సిగరెట్ కోసం డబ్బులు అడిగినందుకు.. అతడిని దారుణంగా నలుగురు కలిసి?

0
48

మనం ఏదైనా దుకాణం దగ్గరకు వెళ్లి ఏదైనా కొన్నప్పుడు తిరిగి డబ్బులను అతడికి ఇస్తాం. దుకాణాదారుడు వాటిని విక్రియించుకుంటూ డబ్బులను సంపాదించుకుంటాడు. ఇలో ఓ వ్యక్తి సిగరెట్ తీసుకొని.. దుకాణాదారుడు డబ్బులు అడిగినందకు చితకబాదాడు. అంతేకాదు.. నలుగురు వ్యక్తులు వచ్చి విచక్షణారహితంగా కొట్టారు.అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగానే కొద్దిసేపటికి చనిపోయాడు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సెహదోల్ లో చోటు చేసుకుంది. మృతుడ్ని అరుణ్​ సోనిగా గుర్తించిన అధికారులు.. ఈ దారుణానికి పాల్పడిన వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్దాం.. సెహదోల్ జిల్లా కేంద్రానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో డియోలాండ్ లో రాత్రి ఘటన జరిగింది.

రాత్రి 9 గంటల ప్రాంతంలో నలగురు వ్యక్తులు మనుఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్ లు వచ్చి.. అరుణ్ సోనీ అనే వ్యక్తి దుకాణం వద్దక సిగరెట్ అడిగి తీసుకున్నారు. ఆ నలుగురు కూడా సిగరెట్ తీసుకొని డబ్బులు కట్టకుండా వెళ్లిపోసాగారు. సోని గట్టిగా అడిగాడు.

సిగరెట్ కు డబ్బులు కట్టండి అని. ఇక వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే నలుగురు కలిసి దుకాణాదారుడిని తీవ్రంగా గాయపరిచారు. పక్కన ఉన్న సోనీ కుమారులు అతడ్ని కాపాడేందుకు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న కొద్దిసేపటికే సోని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరు తప్పించుకోగా.. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here