Sad News: ఐదేళ్ల బాలికపై అత్యాచారం..! గొంతు కోసి.. మరీ ఘోరంగా..!
Sad News: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఓచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వావీవరసలు మరిచి చిన్నాపెద్దా తారతమ్యాలు మరచి కామాంధులు ప్రవిర్తిస్తున్నారు. దేశంలో నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చినా.. కామాంధుల్లో భయం నెలకొనడం లేదు.
తాజాగా 5 ఏళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ హోషంగాబాద్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహగ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధితురాలి ఇంటి పైకప్పుపై గుడ్డలో చుట్టి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శనివారం మధ్యహ్నం నుంచి బాలిక కనిపించడం లేదంటూ.. ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు.
బాలిక ఆచూకీ కనిపించకపోవడంతో శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వెతకగా.. బాలిక మృతదేహం ఇంటి పైకప్పుపై కనిపించింది. ఆదివారం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపగా.. బాలికపై అత్యాచారం చేసి గొంతుకోసి చంపినట్లుగా నివేదిక వచ్చింది. దీంతో సోమవారం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు కేసును నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…