వివాహేతర సంబంధాల కారణంగా పలువురు హత్యలకు గురవుతుంటే.. మరికొంత మంది హత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ జరిగిన ఘటనలో.. అనుమానం పెనుభూతమై ఆమె పాలిట శాపంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు మధ్య అనుమానం తాండవించింది.
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానించి ఆమె ప్రైవేట్ భాగాలను సూది, దారంతో కుట్టేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో 64 ఏళ్ల వృద్ధుడు, 55 ఏళ్ల వృద్దురాలు దంపతులు. కొన్నేళ్ల క్రిందట వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయ. తరచూ భార్యను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని.. వేధించేవాడు.
ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. దీనిలో భాగంగానే ఓ రోజు కోపంతో ఆమె ప్రైవేట్ పార్ట్స్‌కు సూది, దారంతో కుట్లు వేశాడు. దీంతో ఆమె ఓ పోలీస్ అధికారికి సమాచారం అందించడంతో.. ఆమె భర్త చేసిన నీచమైన పని వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ఆమె ప్రైవేట్ భాగాలకు వేసిన కుట్లను తొలగించారు.
భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోవడమే కాకుండా.. తన భర్తను అరెస్టు చేయవద్దని పోలీసులను వేడుకుంది సదరు మహిళ. పోలీసులు అతడిపై వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కట్టుకున్న భార్యను ఇంతలా హింసించిన అతడు మనిషా.. లేదా పశువా.. అంటూ తెలిసిన వారు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…