తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి “వెంకటాద్రి ఎక్స్ప్రెస్” సినిమా ద్వారా అడుగుపెట్టిన రకుల్ తర్వాత ఎక్స్ప్రెస్ వేగంతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో సినిమాలు తీస్తూ ఎంతో మంచి గుర్తింపు పొంది వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఆ తర్వాత పలు వరుస ఫ్లాప్ లను చవిచూసిన రకుల్ ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన “కొండపొలం” అనే సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా “భారతీయుడు 2”, “ఎటాక్”, “మేడే”,”థ్యాంక్ గాడ్” వంటి సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీకి తాజాగా కంటతడి పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు రకుల్ అంత ఎమోషనల్ గా కన్నీరు పెట్టుకోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ రంజిత్ తివారీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన
‘బెల్ బాటమ్’ అనే చిత్రంలో నటించారు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించగా తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చిత్ర బృందంతో కలిసి థియేటర్ లో ఈ సినిమాను చూస్తూ ఎమోషనల్ అవ్వదు కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత థియేటర్ లో సినిమాలు చూడటంతో తెరపై టైటిల్స్ పడగానే రకుల్ భావోద్వేగానికి గురైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…