Tag Archives: naresh

ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదు చాలామంది పెద్దలు ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నరేష్..!

గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి. ఎలాంటి గొడవలు విమర్శలు లేకుండా ఎంతో ప్రశాంతంగా మా సభ్యులందరూ మా అధ్యక్షుడిని ఎన్నుకునే వారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నికలు జరిగినా ఎప్పుడూ కూడా ఈ సారీ జరిగిన ఎన్నికలంత రసవత్తరంగా జరగలేదని చెప్పవచ్చు. ఈ సారి జరిగిన మా ఎన్నికలలో రెండు ప్యానెల్ సభ్యుల మధ్య పరస్పరం మాటలు చోటు చేసుకుంటూ తీవ్ర స్థాయిలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.

ఇక మంచు విష్ణు ప్యానెల్ సభ్యులలో నరేష్ మొదటి నుంచి ముందుండి మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నారు.తను మంచు విష్ణు గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేయగా తాను అనుకున్న విధంగానే మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మా ఎన్నికల ఓటింగ్ తర్వాత నరేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా ఎన్నికలలో మంచు విష్ణు గెలవడంతో మోహన్ బాబు ఉన్నారన్న ధైర్యంతో నరేష్ మాటల తూటాలు పేలుస్తున్నాడు. తన మాటలతో కేవలం ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను మాత్రమే కాకుండా ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని సైతం టార్గెట్ చేస్తూ విమర్శించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు మా అసోసియేషన్ లో ఎలాంటి గొడవలు లేవని ఆయన పోయిన తర్వాత ఆ లోటును భర్తీ చేయలేదని పేర్కొన్నారు.

అదేవిధంగా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు స్థానాన్ని భర్తీ చేయడానికి కేవలం మోహన్ బాబు మాత్రమే అర్హులని ఒకవేళ దాసరి గారు బ్రతికి ఉంటే ఆ బాధ్యతలను మోహన్ బాబుకి ఇచ్చేవాడని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కేవలం చిరంజీవి మాత్రమే కాదని ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారనీ నరేష్ షాకింగ్ కామెంట్స్ చేయడంతో మెగా అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ విషయంపై స్పందించిన మెగా అభిమానులు నటుడు నరేష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఎప్పుడూ కూడా తాను సినిమా ఇండస్ట్రీలో పెద్ద అని చెప్పుకోలేదని సినిమా ఇండస్ట్రీలోని సభ్యులే అతనిని సినీ పెద్దగా భావించారని ఈ సందర్భంగా మెగా అభిమానులు గుర్తు చేశారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి బలవుతారు.. నరేష్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రకాష్ ప్యానల్ పై విష్ణు ప్యానల్ బురద చల్లుకుంటూ పరస్పరం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రకాష్ ప్యానెల్ కు మద్దతు తెలుపుతున్న నాగబాబు గత రెండు రోజుల క్రితం ఓటుకు పదివేలు పంచుతున్నారనే వార్త తన వరకు వచ్చిందని మీడియా ఎదుట వెల్లడించారు.

ఈ క్రమంలోనే మంచు ప్యానెల్ నుంచి నరేష్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఓటుకు 25 వేలు డబ్బులు ఇస్తున్నారని ఒక వీడియో ద్వారా తెలియజేశారు.ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఇస్తున్న డబ్బులను తీసుకుని మంచు విష్ణుకు ఓటెయ్యండి అంటూ ఆయన ఆరోపించారు.

ఈ క్రమంలోనే నరేష్ మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి శ్రీకాంత్ మాట్లాడుతూ నరేష్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. మేము మందు పంచి, లేక డబ్బులు పంచి గెలవాలని అనుకోలేదు. మీ మనుషులనే పంపించి డబ్బులు ఇచ్చి మా ప్యానెల్ పై బురద చల్లుతున్నారు. అసలే దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి.ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వారు అమ్మవారి ఆగ్రహానికి బలై నాశనం అవుతారంటూ శ్రీకాంత్ నరేష్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు.

ఇలా మా ఎన్నికలు ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎంతో హోరాహోరీగా జరుగుతున్నాయి.మరి నేడు జరిగే ఎన్నికలలో అధ్యక్ష పదవి ఎవరు కైవసం చేసుకుంటారు అనేది మరి కొన్ని గంటలలో తెలియనుంది. ఈ క్రమంలోనే రెండు ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్ర ఉత్కంఠత ఏర్పడిందని చెప్పవచ్చు.

ప్రకాశ్ రాజ్ అప్పుల చిట్టా విప్పిన నరేష్…7.30 కోట్ల చెక్ బౌన్స్ కేసు అంటూ ఆగ్రహం..!

మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ఎన్నికలను పోస్టల్ బ్యాలెట్ ద్వారా మంచు విష్ణు కుట్రకు తెరదీశారంటూ ప్రకాశ్ రాజ్ అనడంతో.. విష్ణు ప్యానల్ సభ్యులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. విష్ణుకు మద్ధతుగా నరేశ్ మాట్లాడుతూ.. జయసుధ పోటీ చేసిన సమయంలో మాత్రమే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్ వాడామని.. అంతకముందు ఇలాంటివి లేవని.. అతడు చెప్పాడు.

దీనిపై వివిధ రకాలుగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దీనిపై విష్ణు మనోవేధనకు గురైనట్లు పుర్కొన్నాడు. అగ్రదేశాలు కూడా పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడిన మాటలు అస్సలు బాగాలేదని అన్నారు. ప్రకాశ్ రాజ్ జీ ఛానెల్, అశోక్ తివారీలకు బాకీ పడ్డారని.. దాదాపు అతడిపై ఏడున్నర కోట్ల చెక్ బౌన్స్ కేసు ఉందని.. అతడు గుర్తు చేశారు. అంతకముందు.. దీనిపైనే ప్రకాశ్ రాజ్ మంచు ప్యానల్ పై శ్రీకాంత్, జీవితా రాజశేఖర్ తో కలిసి వచ్చి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

ఓట్లు కోసం అడ్డదారులు తొక్కడానికి విష్ణు, మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి ఇక్కడ డబ్బులు కట్టారని, వారితో ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఎన్నికల్లో 60ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని మండిపడ్డారు. మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56మందికి సంబంధించి రూ. 28వేలు మోహన్ బాబు ఎలా కడతారని ప్రశ్నించారు.

ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్‌, శరత్‌బాబు తదితరుల పోస్టల్‌ బ్యాలెట్‌ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారన్నారు. గెలవడం కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగున్న విషయం తెలిసిందే.

హీరో శ్రీకాంత్, నరేష్ మధ్య సోషల్ వార్.. వైరల్ అయిన వీడియోలు..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. కోలుకుంటుంన్నాడు. దీనిపై సినీ ప్రముఖులు వివిధ రకాలుగా స్పందించారు. అందులో మొదట సీనియర్ సినీ నటుడు నరేష్.. ‘సాయి మా ఇంటి దగ్గర నుంచే బైక్ పై వెళ్లాడు. ఈ స్పోర్ట్స్ బైక్ లను వాడొద్దు.. అవి ప్రమాదకరం అని తాము తన కొడుకుకి.. మిగతా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అనుకున్నామని’ అన్నాడు.

కానీ ఈ లోపు ప్రమాదం జరిగిందని అన్నాడు. అంతేకాకుండా ఇలా.. రోడ్డు ప్రమదాల్లో బాబూ మోహన్ కుమారుడు, కోట శ్రీనివాసరావు కుమారుడు చనిపోయి.. వాళ్ల కటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చారు అంటూ ఆవేదన చెందాడు. దయచేసి ఎవరు బైక్ నడిపినా జాగ్రత్తగా ఉండాలంటూ.. ఓ వీడియోను పోస్టు చేశాడు నరేష్.

దీనిపై శ్రీకాంత్ తీవ్రంగా స్పందించాడు. చనిపోయిన వారి పేర్లను తీసుకురావడం కరెక్ట్ గా లేదు. మరోసారి ఈ వీడియోలు పెట్టకుండా ఉండటం మంచిది అంటూ సలహా ఇచ్చాడు. నరేష్ వీడియోపై బండ్ల గణేష్ కూడా స్పందించాడు. ఆ వీడియోలో అలా మాట్లాడటం మంచిది కాదని సలహా ఇచ్చాడు.

అయితే శ్రీకాంత్ ఇచ్చిన బైట్ కు నరేష్ తీవ్ర స్థాయిలో మండపడ్డాడు. ‘నువ్వే ఆలోచించి మాట్లాడు.. నా బైట్స్ మీద నువ్వు ఇచ్చిన బైట్ చూశాను. ఏంటమ్మా నువ్వు ఎందుకు అలా ఇచ్చావ్.. నువ్వు ఇచ్చిన బైట్ నాకు నచ్చలేదు. నా కళ్ల ముందు హీరోగా వచ్చావు.. జాగ్రత్త’ అంటూ.. మరో వీడియోను నరేష్ పోస్టు చేశాడు. ఇలా ఈ వీరిద్దరి మధ్య సోషల్ వార్ జరిగింది.

చనిపోయిన వాళ్ళతో పోల్చడం ఏంటి..? కాస్త ఆలోచించి మాట్లాడండి : నటుడు శ్రీకాంత్

శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయనను పరామర్శించి ఆయన ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ నటుడు నరేష్ సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

యువత కేవలం అతివేగం కారణంగా ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ విధమైనటువంటి యాక్సిడెంట్స్ వల్ల ఎంతో మంది చనిపోయారు అంటూ మాట్లాడటంతో నటుడు నరేష్ వ్యాఖ్యలను పలువురు సెలబ్రిటీలు తప్పుబడుతున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేస్తూ ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దు..ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి క్షేమంగా బయటకు రావాలని కోరుకోవాలి తప్ప మరణించిన వారి గురించి ప్రస్తావించకూడదని తెలిపారు.

ఈ విధంగా నరేష్ చేసిన వ్యాఖ్యలకు హీరో శ్రీకాంత్ స్పందించారు.. ఈ సందర్భంగా సాయి ధరమ్ రోడ్డు ప్రమాదం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. సాయి తేజ్ కు జరిగినది కేవలం చిన్న యాక్సిడెంట్.. ఇది కామన్ గా జరిగేది. రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యి కింద పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తొందరగా కోలుకుంటారు.. కోలుకొని సురక్షితంగా బయటపడాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ శ్రీకాంత్ తెలియజేసారు.

అదే విధంగా ఎవరైనా వీడియో బైట్లు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. సాయి ధరమ్ తేజ్ ఏంటో నాకు తెలుసు ఆయన ర్యాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి గురించి ఈ టైంలో ఈ విధంగా మాట్లాడటం తప్పుకాదు. ఈ సమయంలో తన కుటుంబం ఎంతో కంగారుగా బాధతో ఉంటారు. ఇలాంటప్పుడు మరణించిన వారి పేర్లు బయటకు తీసుకు రావడం మంచిది కాదు ఎందుకో నాకు నరేష్ గారు పెట్టిన బైట్ నచ్చలేదు ఇకపై ఎవరైనా ఇలాంటి బైట్లు పెట్టేముందు దయచేసి ఆలోచించండి పెట్టండి ఈ విధంగా మరణించిన వారి పేర్లను ప్రస్తావించి అందరినీ బాధ పెట్టకండి అంటూ శ్రీకాంత్ తెలియజేశారు.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు: బండ్ల గణేష్

మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.రోడ్డు ప్రమాదం అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన స్పృహలోకి వచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ కు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టం అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎప్పటిలాగే బయటకు వెళ్ళిన సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే సాయి ధరమ్ తేజ్ నటుడు నరేష్ కొడుకు నవీన్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరు తరచూ బైక్ రేసింగ్ లో పాల్గొనేవారు. అయితే శుక్రవారం కూడా నరేష్ ఇంటికి వెళ్లి అక్కడినుంచి బయలుదేరిన తరువాత సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఈ ప్రమాదంపై నరేష్ స్పందిస్తూ నేను ముందుగానే హెచ్చరించాను అంటూ సాయి తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేష్ వ్యాఖ్యలకు బండ్లగణేష్ స్పందించి ట్విట్టర్ ద్వారా వీడియోను షేర్ చేశారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కి చిన్న ప్రమాదం జరిగింది ఎప్పటిలాగే ఆయన షూటింగ్లకు వెళ్తారు సినిమాలు తీస్తారు అంతా బాగుంటుంది. ఇలాంటి సమయంలో నటుడు నరేష్ గారూ మీరు ఎవరెవరో ప్రమాదంలో మరణించిన వారి పేర్లు చెప్పడం, వారి గురించి ఈ సమయంలో మాట్లాడటం కరెక్ట్ కాదు. అనవసరంగా సాయి ధరంతేజ్ రేసింగ్ చేశారని మా ఇంటి దగ్గరికి వచ్చారని ఇవన్నీ చెప్పడం తప్పు కదా సర్ అంటూ నరేష్ వ్యాఖ్యలపై బండ్లగణేష్ ఘాటుగా స్పందించారు.

ఇలాంటి క్లిష్ట సమయాలలో కేవలం ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి త్వరగా కోలుకోవాలని, సాయి ధరమ్ తేజ్ మునుపటిలాగే సంతోషంగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఇలాంటి సమయంలో ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి ముందు నేర్చుకోండి సార్ అంటూ నరేష్ వ్యాఖ్యలపై బండ్లగణేష్ స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బైక్ రేసింగే ప్రమాదానికి కారణమా? పోలీసుల అనుమానానికి బలం చేకూర్చుతున్న సీసీటీవీ ఫుటేజీ..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూలో ఆయనకు ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. అయితే అతడి ప్రమాదానికి సబంధించి పోలీసుల విచారణలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అతడు బైక్ రేసింగ్ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వారు అనుమానానించడానికి గల కారణం ఏంటంటే.. ధరమ్ తేజ్.. నటుడు నరేశ్ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ట చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. అతడు ప్రమాదానికి ముందు కొన్ని గంటల ముందు నటుడు నరేశ్ ఇంటి వద్ద నుంచి బయలుదేరాడు. అక్కడ నుంచి అతడు దుర్గం చెరువువైపు పయణించాడు. ఇవన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

అయితే అతడు నవీన్‌ విజయ్‌ కృష్ణతో బైక్ రేసింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సీసీటీవీల్లో రికార్డయిన వీడియోలో రెండు బైక్ లు అతి వేగంగా వెళ్తేన్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు ప్రమాదానికి గల కారణం బైక్ రేసే అంటూ అనుమానిస్తున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే 8 గంటలకు మెడికవర్ ఆసపత్రికి తరలించగా.. అక్కడినుంచి అతనిని మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. అతడు ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

అతడు కోలుకున్న మరుక్షణమే విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇలా వెలుగులోకి వచ్చిన బైక్ రేసింగ్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా .. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు సంబంధించి అతడిపై రాయదుర్గం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

మా బిల్డింగ్ వ్యవహారంపై మరో రగడ.. అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు..

టాలీవుడ్ మూవీ అసోసియేషన్(మా) ఎన్నికలు నేషనల్ పాలిటిక్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా నడుస్తున్నాయి. మా ఎన్నికల సందడి మొదలైన దగ్గర నుంచి ప్రతీ రోజు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. హీరో విష్ణు కొత్త బిల్డింగ్ ప్రస్తావన తీసుకు వచ్చిన దగ్గర నుంచి వ్యవహారం మొత్తం దాని చుట్టే తిరుగుతోంది. అయితే పాత మా బిల్డింగ్ అమ్మకంపై ప్రస్తుతం రచ్చ జరుగుతోంది.

నాగబాబు, మోహన్ బాబు వీటిపై తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. రూ. 90 లక్షలు విలువ చేసే బిల్డింగ్ ను కేవలం రూ. 30 లక్ష్లల ఎలా విక్రయించారని హీరో మోహన్ బాబు ప్రశ్నించగా.. దానికి కౌంటర్ గా నాగబాబు.. దానికి సంబంధించి నరేశ్, శివాజీ రాజాను అడగాలని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పష్టంగా వివరణ ఇస్తూ.. బిల్డింగ్ కొనుగోలు చేసిన సమయంలో తానే అధ్యక్షుడిగా ఉన్నానన్న నాగబాబు సినీ పెద్దల సూచనలు, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొనే 71 లక్షల 73వేలతో భవనాన్ని కొనుగోలు చేశామన్నారు.

అలాగే, ఇంటీరియర్ డిజైన్ కోసం మరో మూడు లక్షలు వెచ్చించినట్లు వివరించారు. 2006 నుంచి 2008 వరకూ తానే అధ్యక్షుడిగా ఉన్నానన్న నాగబాబు అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత ‘మా’ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదని దానికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చానన్నారు. బిల్డింగ్ అమ్మకం గురించి మళ్లీ తనపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే, నాగబాబు వ్యాఖ్యలపై 24 గంటలు గడవక ముందే శివాజీరాజా రియాక్ట్ అయ్యారు. నాగబాబు హయాంలో ఎంత నిజాయతీతో ఆ ఫ్లాట్ కొన్నారో, తాను అధ్యక్షుడిగా, నరేశ్ కార్యదర్శిగా ఉన్న సమయంలో అంతే నిజాయతీతో అమ్మేశామని కౌంటర్ ఇచ్చారు.

అధ్యక్షుడిగా ఉన్న నరేష్ కూడా దీనిపై స్పందించారు.. స్పందించారు. అమ్మింది బిల్డింగ్ కాదని, కేవలం ప్లాట్ మాత్రమే అన్నారు. అక్కడ ఉన్న బిల్డింగ్ కు ఎలాంటి అద్దెలు రావడం లేదు. సింగిల్ వాల్ హౌస్, అలాగే పక్కనే మురుగు కాలువ కావడంతో ఆర్టిస్ట్స్ ఇబ్బంది పడేవారు. దీనితో ఆ ఫ్లాట్ అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేపర్లలో ప్రకటనను ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు కావునా రూ. 30 లక్షలకకు అమ్మినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ బిల్డింగ్ కొన్న రేటుకు.. అమ్మిన రేటుకు ఇంత వ్యత్యాసం ఉండటంతో దాదాపు రూ.60 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మా ఎన్నికల వ్యవహారంలో అసోసియేషన్ బిల్డింగ్ ఎపిసోడ్ కీలకంగా మారినట్లు కనిపిస్తోంది. ఇది చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి.

మా అధ్యక్ష భవనం విక్రయించడంపై వాళ్లనే అడగండి: నాగబాబు

మా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మొదలైన దగ్గర నుంచి ప్రతీ రోజు ఏదో ఒక వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మా బిల్డింగ్ పై మోహన్ బాబు వ్యాఖ్యలకు నాగబాబు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అనూహ్యంగా తప్పుకోవడం, తెరపైకి మరికొందరి పేర్లు రావడంతో ఎన్నికలు ఇంకా రసవత్తరంగా మారాయి.

అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంచు విష్ణు సొంత డబ్బులతో బిల్డింగ్ నిర్మిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఎన్నికలు మొత్తం మా బిల్డింగ్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై మోహన్ బాబు- నాగబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చిస్తూ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు నేతృత్వంలో గత నెలలో జూమ్‌ మీటింగ్‌ జరిగింది.

పలువురు సభ్యులు అందులో పాల్గొన్నారు. మీటింగ్‌లో భాగంగా మాట్లాడిన మోహన్‌బాబు ఎక్కువ ధరకు భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారు..? సినిమా పెద్దలు అప్పుడు ఎందుకని పెదవి విప్పలేదు అని ప్రశ్నించారు.

దీనిపై నాగబాబు స్పందిస్తూ.. 2017 లో అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా.. సెక్రటరీగా ఉన్న నరేశ్ నే దీనిపై అడిగి సమాధానం రాబట్టుకోవాలని నాగబాబు అన్నారు. బిల్డింగ్‌ అమ్మకం వ్యవహారమంతా నరేశ్‌-శివాజీరాజాలకే తెలుసని అన్నారు. భవనం అమ్మకం గురించి నరేశ్‌నే ప్రశ్నించాలన్నారు.

నటి హేమకు కౌంటర్ ఇచ్చిన ‘మా’ అధ్యక్షుడు నరేష్.. చర్యలు తీసుకుంటామంటూ?

సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా కొనసాగిన నటి హేమ “మా”నిధులను దుర్వినియోగం చేశారంటూ మా అధ్యక్షుడు పై ఆరోపణలు చేశారు.కావాలనే మా అధ్యక్షుడిగా మరికొన్ని రోజులు కొనసాగాలనే ఉద్దేశంతోనే మా ఎన్నికలు జరగడం లేదంటూ నటి ఆరోపణలపై తాజాగా మా అధ్యక్షుడు నరేష్, జీవిత స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం మీడియా ముందు మాట్లాడిన నరేష్ నటి హేమ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు..

గత రెండు సంవత్సరాల నుంచి “మా” లో ఏం జరిగింది అనే విషయాలను గురించి నరేష్ మీడియా ముందు సవివరంగా వివరించారు. ఈ క్రమంలోనే నటి హేమ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని, ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు. మా డబ్బులను గోల్ మాల్ చేశామని నటి ఆరోపించడంతో స్పందించిన నరేష్ “మా”డబ్బులలో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని ఇప్పటికీ “మా”లో సరిపడే డబ్బులు ఉన్నాయని తెలిపారు.

కరోనా విపత్కర పరిస్థితులలో సినీ కార్మికుల కోసం పలువురు సెలబ్రిటీలు డొనేట్ చేసిన డబ్బులు కూడా భద్రంగా ఉన్నాయని ఈ సందర్భంగా నరేష్ వివరించారు.ప్రస్తుతం మా ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల ఈ ఎలక్షలను వాయిదా వేస్తున్నారు.ఈ క్రమంలోనే పరిస్థితులు చక్కబడ్డాక తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మా అధ్యక్షుడు నరేష్ మీడియా ముందు వెల్లడించారు.

ఈ క్రమంలోనే నటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ హేమ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత వుండే ఈ కరోనా పరిస్థితులలో ఎవరిని ఫండ్ అడుగుతామని ఆమె నిలదీశారు.గతంలో కొత్త కమిటీ ఏర్పడినప్పుడు పెద్ద హీరోలు అందరూ వారి రెమ్యూనరేషన్ లో కొంత శాతం మా అసోసియేషన్ కి ఇస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం వారిని డబ్బులు అడుగలేని పరిస్థితిలో ఉన్నామని జీవిత తెలియజేశారు. ఇకపోతే ఆగస్టు 22వ తేదీ ఏజీఎం నడుపుతామని, ఆ రోజు సభ్యులంతా ఎలక్షన్లు ఎప్పుడు జరపాలి అనే విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా జీవిత వెల్లడించారు.