గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి. ఎలాంటి గొడవలు విమర్శలు లేకుండా ఎంతో ప్రశాంతంగా మా సభ్యులందరూ మా అధ్యక్షుడిని ఎన్నుకునే వారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నికలు జరిగినా ఎప్పుడూ కూడా ఈ సారీ జరిగిన ఎన్నికలంత రసవత్తరంగా జరగలేదని చెప్పవచ్చు. ఈ సారి జరిగిన మా ఎన్నికలలో రెండు ప్యానెల్ సభ్యుల మధ్య పరస్పరం మాటలు చోటు చేసుకుంటూ తీవ్ర స్థాయిలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.
ఇక మంచు విష్ణు ప్యానెల్ సభ్యులలో నరేష్ మొదటి నుంచి ముందుండి మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నారు.తను మంచు విష్ణు గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేయగా తాను అనుకున్న విధంగానే మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మా ఎన్నికల ఓటింగ్ తర్వాత నరేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికలలో మంచు విష్ణు గెలవడంతో మోహన్ బాబు ఉన్నారన్న ధైర్యంతో నరేష్ మాటల తూటాలు పేలుస్తున్నాడు. తన మాటలతో కేవలం ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులను మాత్రమే కాకుండా ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని సైతం టార్గెట్ చేస్తూ విమర్శించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు మా అసోసియేషన్ లో ఎలాంటి గొడవలు లేవని ఆయన పోయిన తర్వాత ఆ లోటును భర్తీ చేయలేదని పేర్కొన్నారు.
అదేవిధంగా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు స్థానాన్ని భర్తీ చేయడానికి కేవలం మోహన్ బాబు మాత్రమే అర్హులని ఒకవేళ దాసరి గారు బ్రతికి ఉంటే ఆ బాధ్యతలను మోహన్ బాబుకి ఇచ్చేవాడని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కేవలం చిరంజీవి మాత్రమే కాదని ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారనీ నరేష్ షాకింగ్ కామెంట్స్ చేయడంతో మెగా అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ విషయంపై స్పందించిన మెగా అభిమానులు నటుడు నరేష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఎప్పుడూ కూడా తాను సినిమా ఇండస్ట్రీలో పెద్ద అని చెప్పుకోలేదని సినిమా ఇండస్ట్రీలోని సభ్యులే అతనిని సినీ పెద్దగా భావించారని ఈ సందర్భంగా మెగా అభిమానులు గుర్తు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…