ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం “మహా సముద్రం”. లవ్ అండ్ త్రిల్లింగ్ ఎమోషన్ జానర్ లో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. ఇకపోతే ఈ సినిమా గురించి సరికొత్త సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించగా వారి సరసన హీరోయిన్ పాత్రలో అదితిరావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో ఒక పాత్రలో సమంత చేయాల్సి ఉండేదని సమంత ఈ సినిమాలో నటించక పోవటం వల్ల వేరే హీరోయిన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కథ ముందుగా సమంత వరకు వెళితే కథ మొత్తం నచ్చిన సమంత ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఇలా సమంత ఈ సినిమా రిజెక్ట్ చేయడానికి కారణం బహుశా సిద్ధార్థ్ ఇందులో హీరోగా నటిస్తుండటం ప్రధాన కారణం అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇకపోతే శర్వానంద్ సమంత కాంబినేషన్ లో ఇదివరకే జాను చిత్రం తెరకెక్కింది.
ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా సమంత మహా సముద్రం సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14 వ తేదీ విడుదల కానుంది. గత కొన్ని రోజుల నుంచి ఫ్లాప్ లను చవిచూస్తున్న ఈ హీరో హీరోయిన్లకి మహా సముద్రం సినిమా ద్వారా విజయాన్ని అందుకుంటారో లేదో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…