Movie News

ఇకపై నా పేరును వాడితే అందరినీ కోర్టుకు ఈడుస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ..!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అక్టోబర్ 10వ తేదీ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా ఈమె ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలుపుతూ ఎన్నికల బరిలో దిగింది. అయితే ఎన్నికలలో అనసూయ గెలిచిందని తరువాత ఈమె ఓడిపోయింది అంటూ విభిన్న రకాలుగా కథనాలు వెలువడ్డాయి.

ఈ క్రమంలోనే అనసూయ స్పందిస్తూ మీడియా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే అనసూయ గెలిచిందని మీరు ఎలా బ్రేకింగ్స్ వేస్తారు. అసలు నేను గెలిచానని మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి సమాధానం ఎవరు చెబుతారు అంటూ అనసూయ మీడియాని ప్రశ్నించింది.

అనసూయ అడిగిన ఈ ప్రశ్నకు మీడియా వారు మాకు ఇన్ పుట్స్ వచ్చాయని సమాధానం చెప్పడంతో నేను కూడా మీడియా నుంచే ఇక్కడికి వచ్చాను ఇప్పటికీ కూడా నేను మీడియాలో ఉంటే న్యూస్ రిపోర్ట్ చేస్తాను కానీ క్రియేట్ చేయను అంటూ వారిపై ఆగ్రహం తెచ్చుకుంది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో చిరాకు పడుతూ సమాధానం చెప్పిన అనసూయ ఆ తర్వాత తన గురించి ఇకపై ఎవరైనా తప్పుడు రాతలు రాస్తే వారిపై యాక్షన్ తీసుకుంటానని చెప్పింది.

నా ప్రమేయం లేకుండా నా గురించి తప్పుడు వ్యాఖ్యలు రాసే వారిపై, నా పేరును పలు మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ లో ఉపయోగించిన వారిని కోర్టుకు లాగుతా అంటూ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ యాంకరమ్మ.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago