Tag Archives: new movie

Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!

Prabhas-Radhe Shyam: బాహుబలి, సాహో చిత్రాలతో ఆలిండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తన కొత్త సినిమా రాధేశ్యాంతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న రాధేశ్యాంపై అన్ని ఇండస్ట్రీల్లో అంచానాలు తారాస్థాయికి చేరాయి.

Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!

ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. రాధేశ్యాం ద్వారా తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పాటలు ప్రస్తుతం ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. రాధేశ్యాంలో పూర్తి లవర్ బాయ్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు.

Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!

తాజాగా రాధేశ్యాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు నిర్వహించనున్నారు. గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. దీని కోసం రామోజీ ఫిలీం సిటి అందంగా ముస్తాబవుతోంది. చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతోంది చిత్ర యూనిట్. పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈసినిమా కోసం పీరియాడిక్ లుక్ వచ్చేలా సెట్ వేస్తున్నారు. దీనికి హోస్ట్ గా జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి వ్యవహరించనున్నట్లు సమాచారం. 

Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!

జాతి రత్నాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. గతంలో జాతి రత్నాల ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. జాతి రత్నాలు సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ కూడా హెల్ప్ అయ్యారు. దీంతో ప్యాన్ ఇండియా సినిమాకు జాతి రత్నాలు స్టార్ నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా ఏమేర అభిమానులను ఆకట్టుకుంటాడో చూడాలి.

Rajinikanth: రజనీకాంత్ తదుపరి చిత్రం ఇదే..28 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇలా..!

సూపర్ స్టార్ రజనీకాంత్ .. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. చిత్ర నిర్మాత ఆర్ బాల్కీ.. కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 28 ఏళ్ల తర్వాత లెజెండరీ కాంబో ఒక్కటవుతుంది. ఈ వార్త సూపర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) తర్వాత.. రజనీ అభిమానులు తమ అభిమాన సూపర్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Rajinikanth: రజనీకాంత్ తదుపరి చిత్రం ఇదే..28 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇలా..!

పాండిరాజ్‌, వెంకట్‌ప్రభుతో పాటు పులువురు దర్శకులు రజనీకాంత్‌కు కథలు వినిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రముఖ బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఆర్.బాల్కీ ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారట.. సామాజిక ఇతివృత్తంతో దర్శకుడు చెప్పిన పాయింట్‌ నచ్చడంతో .. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.

Nani: ‘నాన్న నువ్వు సింహంలా ఉన్నావ్’..నానీ షేర్ చేసిన వీడియో వైరల్..!

ఈ చిత్రాన్ని ఈ పాన్-ఇండియా లెవల్లో తీయనున్నారట. ఈ సినిమాకే ఇళయరాజా సంగీతాన్ని వహిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీ, ఇళయరాజా కాంబో కలిసి ఈ సినిమా చేస్తుండటం.. 28 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య సినిమా వస్తుండటంతో అభిమానులు ఉబ్బితబ్బిపోతున్నారు. చిత్ర నిర్మాత ఆర్.బాల్కీ గురించి మాట్లాడుతూ.. అతను అమితాబ్ బచ్చన్ చీనికమ్‌, షమితాబ్, పా వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను అక్షయ్ కుమార్‌తో కలిసి ప్యాడ్‌మాన్ మరియు మిషన్ మంగళ్‌లో కూడా పనిచేశాడు.

Rajinikanth: రజనీకాంత్ తదుపరి చిత్రం ఇదే..28 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇలా..!

ఈ చిత్రనిర్మాత ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించడంలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత రజినీ ప్రాజెక్ట్ మొదలవ్వబోతోంది. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చత్రం అన్నాత్తే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన తెచ్చకున్నా.. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

ఆకట్టుకుంటున్న డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది టైటిల్ పోస్టర్!

సాధారణంగా మనం డామిట్ అనే పదాన్ని ఎన్నో సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా కన్యాశుల్కం సినిమాలో గిరీశం వాడిన ఈ డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఇలా ప్రతి ఒక్కరి నోటి వెంట డామిట్ అనే పదం వచ్చేది. ఇదిలా ఉండగా తాజాగా డామీట్.. డేవిడ్ రాజు పెళ్లి అయిపోయింది అనే టైటిల్ తో మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశంకర్ ఫేమ్ జీ. వెంకట్ కృష్ణన్ షార్ప్ మైండ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడు నెహ్రూ, హీరో శివ కంఠమనేని పెళ్లి సందD దర్శకుడు గౌరీ రొనంకి, దర్శకుడు మల్లికార్జున నిర్మాత ఆచార్య శ్రీనివాస్ తదితరులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

షార్ప్ మైండ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాతలు కిరణ్ కుమార్ గుడిపల్లి, కె రామచంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ కృష్ణన్ మాట్లాడుతూ..ఈ సినిమా నాకు దర్శకుడిగా మూడో సినిమా ఎంతో అద్భుతమైన కథతో మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. ఇప్పటికే రాజా సంగీత దర్శకత్వంలో సాంగ్స్ రికార్డ్ స్టార్ట్ చేశాము. త్వరలోనే మిగతా సభ్యులను ప్రకటిస్తామని ఈ సందర్భంగా దర్శకుడు జి వెంకట కృష్ణన్ వెల్లడించారు.

నిర్మాత కె రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దర్శకుడు వెంకటకృష్ణన్ ఎంతో కమిట్మెంట్ తో పని చేసే డైరెక్టర్ ఆయన పై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను ఇందులో నటించబోయే హీరోయిన్ ఇతర ఆర్టిస్టులను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇక తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది.

‘బ్యాక్ డోర్’ లో ఏం జరుగుతోంది.. డిసెంబర్ 3 న తెలవనుంది..

పూర్ణ కీలక పాత్రధారిగా కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్యాక్‌డోర్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన టీజర్‌ పది మిలియన్‌ వ్యూస్‌ తెచ్చుకోగా… ట్రైలర్‌ ఆ మార్కును దాటిపోయే దిశగా సందడి చేస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 3 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘క్లీన్‌ యు’ సెన్సార్‌ సర్టిఫికెట్‌ కూడా పొందింది. ఇటీవల హైదరాబాద్ లో ఈ చిత్రబృందం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రం పూర్తిగా మహిళ ప్రధాన కాథాంశం అని.. చక్కటి సందేశాన్ని జోడించడంలో బాలాజీ విజయం సాధించాడన్నారు.

ఈ చిత్రం తన కంటే చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడిన వివాహిత కథ ఇది. ఇక వారి అనుబంధం ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుంది.. అక్కడ నుంచి వాళ్లు ముందుకు ఎలా వెళ్తారు.. అనేదే ఆసక్తికరంగా ఉండనుంది. పూర్ణ కెరీర్‌లో విభిన్నమైన సినిమాగా నిలుస్తుందని చిత్ర దర్శకుడు అన్నారు.

నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. పూర్ణ పాత్రకు దగ్గట్లు నటించిందని.. ఆమె నటనలో మంచి ప్రతిభ కనబర్చిందని తెలిపారు. బ్యాక్‌డోర్‌ ఫస్ట్‌లుక్‌ను హీరో ఆది సాయికుమార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథలకు భిన్నమైన కథాంశంతో ఈ చిత్రం విడుదల కానుంది.

రాజమౌళి-మహేష్ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్న స్టార్ హీరో.. ఎవరంటే?

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా జనవరి 7వ తేదీ విడుదలకు సిద్ధమైంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి రాజమౌళి ఎంతో కష్టపడ్డారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు హీరోగా మరొక భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా వెల్లడించారు.

ఇకపోతే మహేష్ బాబు కోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను కూడా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ తరహాలో ఉంటుందని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి సరికొత్త సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటానికి ఒక స్టార్ హీరోని రంగంలోకి దించడానికి రాజమౌళి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ అయితే బాగుంటుందని రాజమౌళి భావించారట.

విక్రమ్ ఏదైనా ఒక పాత్ర కోసం ఎంతగా కష్టపడతారో మనకు ఎన్నో సినిమాల ద్వారా నిరూపితమైంది. ఇక రాజమౌళి సినిమాలో అవకాశం అంటే విక్రమ్ నో చెప్పే ఆస్కారం లేదని తప్పకుండా ఈ చిత్రంలో నటిస్తారని తెలుస్తుంది. ఏదిఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయం గురించి రాజమౌళి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఆహాలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ ..

ఈ సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా హిట్ అయిన సినిమాల్లో చెప్పుకునేవి లవ్ స్టోరీ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇద్దరు బ్రదర్స్ బంపర్ హిట్ కొట్టేశారు. ఇది అక్కినేని ఫ్యామిలీకి డబుల్ సందడి అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. త్వరలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాను ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. థియేటర్లలో సినిమా చూడని వారు ఇంకా ఉంటే.. ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. బొమ్మరిల్లు భాస్కర్ కు గత కొన్ని సంవత్సరాల నుంచి మంచి హిట్ దొరకలేదు.

ఒకానొక సమయంలో అతడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట.. కనీసం దర్శకత్వం వహించడానికి సినిమాలు చేతిలో లేక ఎన్నో కష్టాలను అనుభవించారట. ఇకపోతే.. ఈ సినిమాకు అల్లు అరవింద్ అతడికి నెలకు శాలరీ చొప్పున పారితోషికం ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికీ ఉంటుంది.

చాలా రోజుల తరువాత బొమ్మరిల్లు భాస్కర్‌కు మళ్లీ సక్సెస్ వచ్చినట్టు అయింది. దీనిలో హీరోగా నటించిన అఖిల్ అక్కినేనికి కూడా చాలారోజుల నుంచి మంచి హిట్ దొరకలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరింది. దీంతో బొమ్మరిల్లు భాస్కర్ కు, అక్కినేని అఖిల్ కు ఈ సినిమా వాళ్ల కెరీర్ కు పెద్ద ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా ఆహాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్న కపట సూత్రధారి..!

క్రాంతి సైనా దర్శకత్వంలో విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందూలాల్, మాస్టర్ బాబా అహిల్, అమీక్షా, సునీత తదితరులు ప్రధాన పాత్రలలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “కపట సూత్రధారి”. రామ్ తవ్వ సంగీతం వహించగా, సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి మనీష్ (హలీమ్) నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12వ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శివారెడ్డి మాట్లాడుతూ ఇన్ని రోజులు ఇంత అద్భుతమైన టైటిల్ ఉన్న సినిమాను ఎందుకు తెరకెక్కించలేదని ఆశ్చర్యం వేస్తుంది అని తెలిపారు.ఈ సినిమాను తెరకెక్కించడంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడారు.

ఇక నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూదర్శకుడు క్రాంతి తను మంచి స్నేహితులు అని ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలకు పని చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.ఇక హీరో హీరోయిన్స్ మాట్లాడుతూ ఈ సినిమాలో అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

నిర్మాత మనీష్ మాట్లాడుతూ కథ వినగానే ఎంతో నచ్చింది ఎలాగైనా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాము.ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుందని ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు. ఈ క్రమంలోనే సినిమా నవంబర్ 12వ తేదీ విడుదల కానున్నట్లు తెలియజేశారు.

రాజా విక్రమార్క టైటిల్ చెప్పగానే చిరంజీవి అలా అన్నారు: కార్తికేయ

ఆర్ఎక్స్ 100 తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న హీరో కార్తికేయ. అతడు ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ టైటిల్ తో మెగస్టార్ చిరంజీవి నటించిన విషయం తెలిసిందే.

అయితే కార్తికేయ నటిస్తున్న ఈ సినిమాలో ఈ టైటిల్ ను చెప్పింది కూడా కార్తికేయ అంట. ఈ విషయాలను అతడు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఈ కథను శ్రీ సిరిపల్లి చెప్పడంతో తనకు బాగా నచ్చిందని.. ఈ సినిమాను అతడు నిజాయితీగా తీయగలడనే నమ్మకం వచ్చిందన్నారు. కథను చెప్పినట్టే చక్కగా తెరకెక్కించారన్నారు.

ఎన్‌ఐఏ ఏజెంట్‌గా ఈ సినిమాలో కనపడుతానన్నారు. ఓ రోజు శ్రీతో తానే ఈ ‘రాజా విక్రమార్క ’ టైటిల్ బాగుంటుందని చెప్పాను.. అతడు ఓ రోజు టైం తీసుకొని ఫైనల్ చేశారన్నారు. ఈ టైటిల్ పెట్టిన తర్వాత చిరంజీవికి ఫోన్ చేసి చెప్పినట్లు చెప్పాడు. ఆయను ‘గుడ్ లక్’ అని అన్నారన్నారు. చిరంజీవిగారి మీద అభిమానంతో ఆయన సినిమా టైటిల్‌ పెట్టుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

తన ఫిజిక్ కారణంగానే ఆర్‌ఎక్స్‌ 100, గ్యాంగ్‌ లీడర్‌, వలిమై చిత్రాల్లో అవకాశాలు ఇచ్చినట్లు ఆయా చిత్ర దర్శకులే చెప్పారన్నారు. అయితే అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా వలిమై గురించి మాట్లాడారు. అందులో తాను విలన్ గా చేస్తున్నానన్నారు. ఈ సినిమా కారణంగానే తాను తమిళ్ నేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. డబ్బింగ్ తానే చెప్పుకున్నట్లు వివరించాడు.

నవంబర్ 26న ‘ 1997 ’ సినిమా విడుదల..

వాస్తవ కథలను ఈ మధ్య తెరకెక్కించడంలో చిత్ర దర్శక నిర్మాతలు ముందు ఉంటున్నారు. ఇటీవల దీని నేపథ్యంలో వచ్చిన సినిమా జై భీమ్. ఇది అమెజాన్ ఓటీటీలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సూర్య హీరోగా దీనిలో అద్భుతంగా నటించాడు.

ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో వాస్తవ కథలను మంచిగా తీర్చిదిద్దితే ప్రేక్షకులు ఆదిరిస్తారు అనే దానికి ఇదే చక్కని ఉదాహరణ. ఇదిలా ఉండగా.. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని.. డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ కథ అన్నీ కథలకంటే కాస్త బిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడదుల చేశారు. ఈ పోస్టర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్, మోహన్, నవీన్ చంద్ర మూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వాళ్లు ముగ్గురు ఉండే విధంగా ఈ పోస్టర్ ను రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’ అంటూ సాగుతుంది. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ పాటను సింగర్ మంగ్లీ పాడారు. దీనిని నవంబర్ 26న విడుదల చేస్తున్నట్లు.. దానికి సంబంధించిన రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు.

దీనికి కోటి స్వరాలను అందించడంతో పాటు.. ఈ సినిమా లో అతడు ఓ పాత్రను కూడా పోషించాడు.
ఈ చిత్రాన్ని ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ నిర్మించారు. దీనికి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం డాక్టర్ మోహన్ వ్యవహరిస్తున్నారు. కెమెరా మెన్ గా చిట్టిబాటు, ఎడిటింగ్ గా నందమూరి హరి ఉన్నారు. బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు నటీనటులుగా ఉన్నారు.

కావాలనే నన్ను వివాదంలోకి లాగుతున్నారు.. ఆ సన్నివేశంలో తప్పేంటి: ప్రకాష్ రాజ్

ఇటీవల సూర్య హీరోగా నటించిన జై భీమ్ విజయవంతంగా అమెజాన్ ఓటీటీలో రన్ అవుతోంది. టాప్ లో ఆ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దీనిలో రావు రమేష్, సూర్య మధ్య జరిగే సన్ని వేశాలు అమోఘం అని చెప్పాలి. వీరిద్దరు వకీల్ పాత్రలో నటించారు. ఇక చిన్నతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జోస్ అద్భుతంగా నటించింది.

ఆమె డీ గ్లామర్ గా మారి తన నటనతో అందరి మన్ననలు పొందింది. ఒక లాయర్ చంద్రు నిజ జీవిత కథ ఆధారంగా తీసినది ఈ సినిమా. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సమాజంలో వైరల్ గా మారింది. ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ స్పందన చూస్తుంటే మంచి కథలు తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపించారు.

అయితే దీనిలో ఓ సన్నివేశం కొంతమంది వివాదం స్పష్టిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ సీబీఐ ఎంక్వైరీ చేసే ఆఫీసర్ పాత్రలో నటించాడు. దీనిలో ఓ వ్యక్తిని విచారించే క్రమంలో అతడు హిందీలో మాట్లాడుతుంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అతడిని తెలుగులో మాట్లాడు అంటూ చెంప దెబ్బ కొట్టి హెచ్చరిస్తాడు. ఇది హిందీ భాషను అవమానించడమే అంటూ కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించాడు.

దీనిలో అణగారిన వర్గాల బాధని పూర్తిగా చూపించామని.. వాళ్లు పడే ఇబ్బందులు, కష్టాలను చూపించామన్నారు. ఇవన్ని పక్కన పెట్టేసి కేవలం చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తాను ఈ సినిమాలో నటించాన్న కారణంతోనే ఎక్కువగా సినిమాను వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి వివాదాలకు స్పందించడం .. ఎలాంటి అర్థం లేదంటూ చెప్పుకొచ్చాడు.