Tag Archives: pawan

Sai Dharam Tej: పవన్, త్రివిక్రమ్ గురించి మాట్లాడే అర్హత లేదు… సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Sai Dharam Tej: సముద్రఖని దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం జులై 31వ తేదీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..నాకు బ్రో సినిమాలో నటించే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ మామయ్యకు త్రివిక్రమ్ గారికి సముద్రఖని గారికి కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నేను జి స్టూడియోస్ బ్యానర్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశానని తెలిపారు.

రోడ్డు ప్రమాదానికి ముందే ఈ సినిమాకు కమిట్ అయ్యాము అయితే ప్రమాదం తర్వాత తాను నటించగలనా అన్న సందేహం కూడా వచ్చింది అయితే ఈ సినిమా నుంచి నన్ను తొలగించాలని చెప్పాను. కానీ త్రివిక్రమ్ గారు నన్ను నమ్మి సముద్ర కని గారికి కొన్ని రోజులు ఎదురు చూడమని చెప్పారు.ఇక ఈ సినిమాలో మామయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని తెలియజేశారు.

Sai Dharam Tej: సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు వారిద్దరూ ఎంత గొప్పవారో అందరికీ తెలిసిందే.ఇలా బ్రో సినిమాని ఎంతో మంచి సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సందర్భంగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటూ సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sakshi Singh: పవన్ కళ్యాణ్ ప్రభాస్ కి ఇచ్చే అంత డబ్బు నా దగ్గర లేదు… ధోని వైఫ్ కామెంట్స్ వైరల్!

Sakshi Singh: ఇండియన్ కూల్ కెప్టెన్ ధోని ధోని ఎంటర్టైన్స్ అనే పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం మనకు తెలిసిందే. నిర్మాణంలో మొట్టమొదటిసారిగా LGM అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ధోని వైఫ్ సాక్షి సింగ్ కూడా రంగంలోకి దిగారు.ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రెస్మీట్ నిర్వహించే ఈ సినిమాను ప్రమోట్ చేసారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధిలు అడిగే ప్రశ్నలకు సాక్షి సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈమెను ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి స్టార్స్ తో సినిమా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా అంటూ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాక్షి సమాధానం చెబుతూ.. నేను ఇంకా ఇండస్ట్రీలోకి ఇప్పుడే అడుగు పెట్టాను. పవన్ కళ్యాణ్ ప్రబాస్ వీరంతా కూడా పెద్ద స్టార్స్. వీరికి రెమ్యూనరేషన్ ఇచ్చే అంత మని నా దగ్గర లేదని సమాధానం చెప్పారు.

Sakshi Singh: ఆరోజు కోసమే ఎదురు చూస్తున్నాను…


ఫ్యూచర్లో మీ భర్త ధోని హీరోగా ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఆ రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పారు. అన్ని కుదిరితే ధోని హీరోగా తన నిర్మాణంలో సినిమా రావచ్చని ఈ సందర్భంగా సాక్షి సింగ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: బ్రో సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఉపవాసం ఉన్నారు… సముద్ర ఖని కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం బ్రో. ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నేడు శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా డైరెక్టర్ నటుడు సముద్రఖని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా కథ చెప్పగానే పవన్ కళ్యాణ్ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు అని అడిగారు.

మీరు రేపే అంటే ఈ సినిమా రేపే స్టార్ట్ అవుతుందని చెప్పడంతో కథ విన్న తర్వాత మూడు రోజులకు సినిమా షూటింగ్ పనులు ప్రారంభించామని సముద్రఖని వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా పవన్ కళ్యాణ్ సమయం వృధా కాకుండా లొకేషన్ లోనే కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ చేసుకున్నారని తెలిపారు. ఎక్కడ సమయం వృధా కాకుండా పవన్ కళ్యాణ్ చకచకా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నారని తెలిపారు.

Pawan Kalyan: ఉపవాసంతోనే షూటింగ్ పూర్తి చేశారు…


ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ దేవుడి పాత్రలో నటించే రోజులన్నీ కూడా ఉపవాసంతోనే నటించారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి సముద్రఖని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Sailesh Kolanu: అభిమాని ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేసిన దర్శకుడు.. వైరల్ అవుతున్న ట్వీట్..?

Sailesh Kolanu: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ హిట్ ‘ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శైలేష్ కొలను మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. విదేశాలలో ఉద్యోగం చేసుకుని శైలేష్ సినిమా మీద ఉన్న ఇష్టంతో కథ రాసుకొని దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన శైలేష్ హిట్ పార్ట్ 2 తో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక హిట్ పార్ట్ 3 ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు శైలేష్ వెల్లడించాడు. ఈ హిట్ పార్ట్ 3 లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా శైలేష్ శేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అభిమాని కోరిక మేరకు ఇంటికి వెళ్లి అతన్ని సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ విషయం గురించి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలో అభిమానితో దిగిన ఫోటో షేర్ చేస్తూ..” ఇతని పేరు పవన్. నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నాను అనే విషయం తెలిసి తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి ఆహ్వానించాడు. అయితే అభిమాని కోరిక మేరకు తాను కూడా సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళానని, వాళ్లది లవ్లీ ఫ్యామిలీ అని శైలేష్ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ అమ్మ పునుగులు తినిపించారని అవి చాలా రుచికరంగా ఉన్నాయని తెలిపాడు.

Sailesh Kolanu: అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చిన డైరెక్టర్…


ఆమె హీరో వెంకటేష్ అభిమాని అని తెలిసి మరింత ఆనందపడ్డానని తాను తెరకెక్కిస్తున్న సైంధవ్ సినిమాని మొదటి రోజు మొదటి షో చూస్తానని ఆమె చెప్పటంతో తనకు చాలా ఆనందంగా అనిపించిందని శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. శైలేష్ ప్రస్తుతం హీరో వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత హిట్ 3 షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అభిమాని కోరికను నెరవేర్చటానికి వారి ఇంటికి వెళ్లిన శైలేష్ పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Kalyan Dileep: పవన్ పై సెటైర్లు వేసిన తమ్మారెడ్డి… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన నేత కళ్యాణ్ దిలీప్!

Kalyan Dileep: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గురించి తాజాగా నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఒక్కో సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నీకు పిల్లల ఫీజు కట్టడం పెద్ద కష్టం కాదు.ఇంకోసారి పిల్లల ఫీజు కోసం దాచిన డబ్బులు పెట్టి పార్టీ బిల్డింగ్ కట్టానని దేశాన్ని ఉద్దరించడానికి చేసినట్లు చెబుతున్నావు అంటూ మండిపడ్డారు.

ఇక నీ రాజకీయ స్వార్థం కోసం మీ తండ్రిని కూడా అల్లరి చేస్తున్నావ్ ఆయన పెద్దమనిషి అలాంటి ఆయన దేవుడు దీపంతో సిగరెట్ కాల్చేవారని చెబుతున్నావు అంటూ పవన్ కళ్యాణ్ పై తమ్మారెడ్డి మండిపడ్డారు. ఇలా తమ్మారెడ్డి పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత కళ్యాణ్ దిలీప్ స్పందించారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యలపై దిలీప్ సుంకర సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఏమైనా గొప్ప సినిమాలు చేశారా.. ఎంతమంది హీరోలకు మీరు రెమ్యూనరేషన్ ఎగ్గొట్టారు. చిరంజీవి గారికి మీరు ఎంత రెమ్యూనరేషన్ ఎగ్గొట్టారో చెప్పనా?కేవలం సినిమాలో తీయడం నీకు మాత్రమే వచ్చు అన్నట్టు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఏవేవో మాట్లాడుతుంటావు అని ఈయన మండిపడ్డారు.

Kalyan Dileep: పార్టీని నడిపించాలంటే 500 కోట్లు ఉన్న సరిపోదు..

పవన్ కళ్యాణ్ 2014 ముందు వరకు ఎన్ని సినిమాలు చేశారు నీకు తెలుసా అప్పుడు తన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఇక్కడ ఒక పార్టీని నడిపించాలంటే 500 కోట్ల రూపాయలు డబ్బు ఉన్నా కూడా సరిపోదు.. అన్ని నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటూ తమ్మారెడ్డి పై దిలీప్ సుంకర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ustaad Bhagat Singh: పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమాకు రీమేక్ చిత్రమే… డైరెక్టర్ దశరథ్ కామెంట్స్ వైరల్!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలోనూ రాజకీయాలలోను ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన ఒకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో పాల్గొంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని కూడా చేయబోతున్నట్లు ప్రకటించారు.

వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే చాలా సంవత్సరాలు తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే 2020వ సంవత్సరంలో భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేశారు.

కేవలం స్క్రిప్ట్ మాత్రమే కాకుండా ఈ సినిమా టైటిల్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా తమిళ తేరీ చిత్రానికి రీమేక్ చిత్రం అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు దశరథ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Ustaad Bhagat Singh: ఇది రీమేక్ చిత్రమే…

ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన దశరథ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తమిళ తేరీ సినిమాకు రీమేక్ చిత్రమే అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు చేశామని తప్పనిసరిగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ దశరథ్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Unstoppable: ఉన్న ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదు….పవన్ కి బాలయ్య సూటి ప్రశ్న!

Unstoppable: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలకృష్ణ ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హోస్టుగా వ్యవహరించిన అన్ స్థాపబుల్ సీజన్ వన్ మంచి హిట్ అవటంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు.

ఈ అన్ స్టాపబుల్ సీజన్ టు మొదలైనప్పటినుండి ఇప్పటివరకు మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. ఈ రెండవ సీజన్లో మొదటి ఎపిసోడ్ లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అతిథిగా హాజరయ్యారు. ఇక ఆ తర్వాత ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు, యంగ్ హీరోలు ఈ షోలో పాల్గొని బాలకృష్ణ తో కలిసి సందడి చేశారు. ఇక ఇటీవల ప్రభాస్ కూడా ఈ షోలో పాల్గొని సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ షోలో మరొక స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.ఆ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి ఇద్దరు లెజెండరీ హీరోలను ఒకే వేదికపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Unstoppable: రాజకీయాల పై ప్రశ్నించిన బాలయ్య..


ఈ క్రమంలో తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఆహా విడుదల చేసింది.ఈ ప్రోమో లో బాలయ్య పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలకు సంబంధించిన చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ కళ్యాణ్ ని కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు అడిగాడు. అయితే పవన్ కళ్యాణ్ వాటికి సమాధానం చెబుతున్న సమయంలో వీడియో మ్యూట్ చేసి ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెంచారు. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ ఫిబ్రవరిలో ప్రసారం కానుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Director Bobby: చిరంజీవి రాజకీయాలకు పనికిరారు… అందుకు పవన్ మాత్రమే సరైనోడు… డైరెక్టర్ బాబీ కామెంట్స్ వైరల్!

Director Bobby: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మంచు గుర్తింపు పొందిన డైరెక్టర్ బాబి తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైజాగ్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ బాబి చిరంజీవి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ చిరంజీవి అన్నయ్యకు రాజకీయాలు ఏమాత్రం పనికిరావని తెలిపారు. ఆయనకు దేవుడు ఒక తమ్ముడినీచ్చాడు. రాజకీయాలకు పవన్ సరైనోడనీ బాబి తెలిపారు.

చిరంజీవి గారు రాజకీయాలలో ఉండి ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడలేరు కానీ చిరంజీవి గారిలో ఉన్న మంచితనం ఆవేశం కలిస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఎవరికైనా ఎలాంటి సమాధానమైనా చెప్పగలరు. మాటకు మాట కత్తికి కత్తి అన్నట్లుగా ఉంటారని బాబి తెలిపారు.అయితే ఒకరోజు తాను మీరెందుకు రాజకీయాలలో ఇతరులను ఎదిరించలేరు అని అడిగినప్పుడు వాళ్లకు కూడా అమ్మ నాన్నలు అక్కచెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్లు బాధపడతారని ఎంతో సౌమ్యంగా అన్నయ్య ఒకరోజు నాతో చెప్పారని బాబి గుర్తు చేసుకున్నారు.

Director Bobby: రవితేజ అవకాశం ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో ఉన్నా….

ఇక చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలో తన ప్రస్థానం మొదలైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన 20 సంవత్సరాలకు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని తెలిపారు. ఇక నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు గల కారణం రవితేజ.ఆయన నన్ను నమ్మి సినిమా ఇవ్వడం వల్లే డైరెక్టర్ గా నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని ఈ సందర్భంగా బాబీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Roja: పవన్ బాలయ్య టాక్ షోకి రావడం కూడా ప్యాకేజీలో భాగమే… రోజా సెన్సేషనల్ కామెంట్స్!

Roja: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం రెండవ సీజన్లో భాగంగా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం పై పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని తెలియడంతో ఈ ఎపిసోడ్ కాస్త పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు కారణమైంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎపిసోడ్ గురించి ఇప్పటికే వైసీపీ నేతలు స్పందించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రి సినీనటి రోజా సైతం కార్యక్రమం పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి మెగా కుటుంబానికి పెద్దగా సఖ్యత లేదని విషయం మనకు తెలిసిందే. గతంలో మెగా హీరోలు బాలకృష్ణ గారి గురించి పెద్ద ఎత్తున అనుచిత వ్యాఖ్యలు చేశారు.అయితే ఇలా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒకే వేదికపై సందడి చేయడంతో రోజా స్పందిస్తూ కేవలం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో కి రావడం కూడా ప్యాకేజీలో భాగమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Roja: పవన్ టాక్ షోకి రావడం వెనుక చంద్రబాబు హస్తముంది…

పవన్ కళ్యాణ్ ను బద్ధ శత్రువుగా భావించే బాలకృష్ణ కార్యక్రమానికి పవన్ వెళ్లడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని రోజా వెల్లడించారు. గతంలో ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నటువంటి మెగా నందమూరి హీరోలు ఇప్పుడు ఏ ఉద్దేశంతో కలిసారని ఈమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడుతో పొత్తు కలుపుకోవడం కోసమే ఈ షో కి హాజరయ్యారని ఇది కూడా ప్యాకేజీలో భాగమే అంటూ రోజా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ram Charan: పవన్ కోసం హుటాహుటిన హైదరాబాద్ వచ్చిన చరణ్… బాబాయ్ కి సెక్యూరిటీ టైట్ చేసిన అబ్బాయ్!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జపాన్ లో విడుదలైనటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల కోసం తన భార్య ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే జపాన్ నుంచి ఈ దంపతులు టాంజానియా వెకేషన్ వెళ్లారు. ఇలా టాంజానియా అడవులలో ఎంజాయ్ చేసినటువంటి ఈ దంపతులు తిరిగి ఇండియా వచ్చారు.

ఇకపోతే రామ్ చరణ్ ఇంత హడావిడిగా ఇండియా తిరిగి రావడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. గత కొంత రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ప్రతి కదలికల గురించి గుర్తు తెలియని వ్యక్తులు తనని గమనిస్తూనే ఉన్నారని తన ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో రెక్కీ నిర్వహిస్తూ తన ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొందరు యువకులు పవన్ కళ్యాణ్ సిబ్బందితో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకోవడంతో పవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.వైజాగ్ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ పట్ల ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎంతోమంది అభిమాన నటుడికి, నాయకుడికి ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Ram Charan: రంగంలోకి దిగిన రామ్ చరణ్…


ఇలా పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఆయనకు మరింత భద్రత కల్పించాలంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి రామ్ చరణ్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం.చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతో అమితంగా ప్రేమించే రామ్ చరణ్ తన బాబాయికి ప్రాణహాని ఉందని తెలియడంతో తన బాబాయ్ కోసం మరింత సెక్యూరిటీని టైట్ చేశారని తెలుస్తోంది. తన సెక్యూరిటీని కూడా పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ నియమించారట. ఇలా బాబాయ్ కోసం అబ్బాయ్ రంగంలోకి దిగడంతో మెగా అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.