Movie News

Ustaad Bhagat Singh: పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమాకు రీమేక్ చిత్రమే… డైరెక్టర్ దశరథ్ కామెంట్స్ వైరల్!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలోనూ రాజకీయాలలోను ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన ఒకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో పాల్గొంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని కూడా చేయబోతున్నట్లు ప్రకటించారు.

వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే చాలా సంవత్సరాలు తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే 2020వ సంవత్సరంలో భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేశారు.

కేవలం స్క్రిప్ట్ మాత్రమే కాకుండా ఈ సినిమా టైటిల్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా తమిళ తేరీ చిత్రానికి రీమేక్ చిత్రం అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు దశరథ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Ustaad Bhagat Singh: ఇది రీమేక్ చిత్రమే…

ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన దశరథ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తమిళ తేరీ సినిమాకు రీమేక్ చిత్రమే అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు చేశామని తప్పనిసరిగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ దశరథ్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago