Athiya Shetty -KL Rahul: బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఈమె గత కొంతకాలంగా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో విహరిస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జనవరి 23వ తేదీ ముంబైలోని సునీల్ శెట్టి ఖండాలా ఫామ్ హౌస్ లో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు.
అతియా శెట్టి, రాహుల్ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా పెళ్లి తర్వాత అతియాశెట్టి తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా అతీయా స్పందిస్తూ జీవితంలో ఎలా ప్రేమించాలో నేర్చుకుంటాను.. మా జీవితంలో ఈ రోజు ఎంతో విలువైనది. సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మేమిద్దరం ఒక్కటయం. ఈరోజు మా జీవితంలో మర్చిపోలేనిది. మా ఈ ప్రయాణంలో మీ ఆశీర్వాదాలు మీ కృతజ్ఞత ప్రేమ మాకు తోడు కావాలని కోరుకుంటున్న అంటూ ఈమె తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.
Athiya Shetty -KL Rahul: శుభాకాంక్షలు తెలుపుతున్న బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు
ఇలా అతియా పెళ్లి తర్వాత మొదటిసారి వీరు పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఈ పోస్ట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసినటువంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే క్రికెట్ సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…