Movie News

Sai Dharam Tej: పవన్, త్రివిక్రమ్ గురించి మాట్లాడే అర్హత లేదు… సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Sai Dharam Tej: సముద్రఖని దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం జులై 31వ తేదీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..నాకు బ్రో సినిమాలో నటించే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ మామయ్యకు త్రివిక్రమ్ గారికి సముద్రఖని గారికి కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నేను జి స్టూడియోస్ బ్యానర్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశానని తెలిపారు.

రోడ్డు ప్రమాదానికి ముందే ఈ సినిమాకు కమిట్ అయ్యాము అయితే ప్రమాదం తర్వాత తాను నటించగలనా అన్న సందేహం కూడా వచ్చింది అయితే ఈ సినిమా నుంచి నన్ను తొలగించాలని చెప్పాను. కానీ త్రివిక్రమ్ గారు నన్ను నమ్మి సముద్ర కని గారికి కొన్ని రోజులు ఎదురు చూడమని చెప్పారు.ఇక ఈ సినిమాలో మామయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని తెలియజేశారు.

Sai Dharam Tej: సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు వారిద్దరూ ఎంత గొప్పవారో అందరికీ తెలిసిందే.ఇలా బ్రో సినిమాని ఎంతో మంచి సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సందర్భంగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటూ సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago