Movie News

Yadamma Raju: కాలి వేలు తొలగిస్తుంటే ప్రాణం పోయినట్టు అయింది… ఎమోషనల్ అయిన యాదమ్మ రాజు!

Yadamma Raju: యాదమ్మ రాజు కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈయన ప్రమాదంలో భాగంగా కాలికి బాగా దెబ్బ తగలడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఈయన హాస్పిటల్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు యాదమ్మ రాజుకు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నఫలంగా హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేశారు.

ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి ఈయన బయటకు వచ్చిన ప్రతిసారి స్టిక్ సహాయంతో నడుస్తూ పలు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈయన తాజాగా బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు నటించిన స్లండాగ్ హస్బెండ్ సినిమాలో నటించారు. తనకు ప్రమాదం జరిగినప్పటికీ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తనకు జరిగిన ప్రమాదం గురించి తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి బైక్ స్కిడ్ కావడంతో బైక్ వచ్చి నాపై పడిందని అందుకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో తన కాలు దెబ్బతిందని కుడికాలు వేలు తొలగించారని తెలిపారు. ఇలా కాలు వేలు తొలగించే సమయంలో తొడపై ఉన్నటువంటి చర్మం తీసి ఇక్కడ వేశారు.

Yadamma Raju:

ఆ సమయంలో భరించలేనటువంటి బాధను అనుభవించానని తెలిపారు.ఇలా సర్జరీ చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిందని ఈ సందర్భంగా తాను అనుభవిస్తున్నటువంటి నొప్పిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక ఒక ఆర్టిస్ట్ గా సినిమాలలో నటించడం వల్ల ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత ఉంది కనుక తాను ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాను అంటూ ఈ సందర్భంగా యాదమ్మ రాజు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago