Sailesh Kolanu: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ హిట్ ‘ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శైలేష్ కొలను మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. విదేశాలలో ఉద్యోగం చేసుకుని శైలేష్ సినిమా మీద ఉన్న ఇష్టంతో కథ రాసుకొని దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన శైలేష్ హిట్ పార్ట్ 2 తో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక హిట్ పార్ట్ 3 ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు శైలేష్ వెల్లడించాడు. ఈ హిట్ పార్ట్ 3 లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా శైలేష్ శేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అభిమాని కోరిక మేరకు ఇంటికి వెళ్లి అతన్ని సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ విషయం గురించి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ క్రమంలో అభిమానితో దిగిన ఫోటో షేర్ చేస్తూ..” ఇతని పేరు పవన్. నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నాను అనే విషయం తెలిసి తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి ఆహ్వానించాడు. అయితే అభిమాని కోరిక మేరకు తాను కూడా సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళానని, వాళ్లది లవ్లీ ఫ్యామిలీ అని శైలేష్ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ అమ్మ పునుగులు తినిపించారని అవి చాలా రుచికరంగా ఉన్నాయని తెలిపాడు.
ఆమె హీరో వెంకటేష్ అభిమాని అని తెలిసి మరింత ఆనందపడ్డానని తాను తెరకెక్కిస్తున్న సైంధవ్ సినిమాని మొదటి రోజు మొదటి షో చూస్తానని ఆమె చెప్పటంతో తనకు చాలా ఆనందంగా అనిపించిందని శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. శైలేష్ ప్రస్తుతం హీరో వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత హిట్ 3 షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అభిమాని కోరికను నెరవేర్చటానికి వారి ఇంటికి వెళ్లిన శైలేష్ పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…