Tag Archives: posani krishna murali

Posani Krishna Murali: నేను చనిపోతే ఏడవద్దని నా భార్యకు చెప్పాను… ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు నన్ను చూడకూడదు: పోసాని

Posani Krishna Murali:పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని పేరు సినీ ఇండస్ట్రీలో నటుడు దర్శకుడిగా కామెడీగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈయన వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా నిలబడి పార్టీ కోసం కృషి చేయడంతో ఈయనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పారు.

ఇలా ఈయన వైసిపి పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వారి పట్ల కూడా పలు సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచినటువంటి పోసాని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను చనిపోతే కనుక తన శవాన్ని ఇండస్ట్రీ వారికి చూపించవద్దు అటు తన భార్యకు చెప్పానని ఈయన తెలిపారు. అంతేకాకుండా నేను చనిపోతే నా భార్య పిల్లలు ఎవరు కూడా ఏడవకూడదు అలా ఉండేలాగా వారిని ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టానని ఈయన తెలియజేశారు.నేను చనిపోయిన తర్వాత నా భార్య నాతో ఉన్నటువంటి అందమైన క్షణాలన్నింటిని గుర్తు చేసుకోవాలి కానీ ఏడవకూడదు.

Posani Krishna Murali:50 కోట్ల ఆస్తులు రాశాను…


ఇకపోతే నా పిల్లలు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. నేను చనిపోయిన తర్వాత నా భార్య ఇబ్బంది పడకూడదు అందుకే తనకోసం 50 కోట్ల రూపాయల ఆస్తులను తన పేరు మీద రాశానని తను ఏ పని చేయకపోయినా నెలకు 9 కోట్ల రూపాయల సంపాదన అందుకుంటుంది అంటూ ఈ సందర్భంగా పోసాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన పోసాని చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ వారు ఎవరు చూడకూడదని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Posani Krishna Murali: ఉత్తమ వెన్నుపోటుదారు అవార్డు ఇవ్వాలి…అశ్వినీ దత్ కి కౌంటర్ ఇచ్చిన పోసాని!

Posani Krishna Murali: ఏపీలో నంది అవార్డుల గురించి నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అంటూ నంది అవార్డులు ఇవ్వాలి అని ఏపీ ప్రభుత్వం గురించి ఇన్ డైరెక్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఇటీవల స్పందించాడు. ఈ క్రమంలో తాజాగా మీడియా ముందుకి వచ్చిన కృష్ణ మురళి అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..”

ఉత్తమ గుండా ఉత్తమ రౌడీ అని కాదు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు, ఉత్తమ వెధవలు, ఉత్తమ సన్నాసులు అనే బిరుదులు మీకే ఇవ్వాలి అని చురకలంటించాడు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరగలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా విజృంభించింది ఆ సమయంలో ప్రజలను కాపాడుకోవడమే కాకుండా ఆ తర్వాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇస్తున్నాడు.

ఎందుకు మీరంతా జగన్ మీద పడి ఏడుస్తున్నారు. ఆయన మీకు ఏం అన్యాయం చేశాడు. చంద్రబాబు లాగా వెన్నుపోటు పొడిచి ఎవరికైనా అన్యాయం చేశాడా అని పోసాని ప్రశ్నించాడు. జగన్ ఎవరికైనా అన్యాయం చేసినట్లు నిరూపిస్తే నీ కాళ్లు మొక్కుతా అంటూ పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టించినప్పుడు మాట్లాడకుండా ఏం చేశావు అంటూ అశ్విని దత్ ని పోసాని ప్రశ్నించాడు.

Posani Krishna Murali: అవార్డులు ఇస్తే ఎవరు పేరు పెట్టని విధంగా ఇస్తారు.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా కారణంగా నంది అవార్డులు ఇవ్వలేదన్నమాట వాస్తవమే కానీ. జగన్ నంది అవార్డులు ఇస్తే ఎవరు పేరు పెట్టని విధంగా ఉంటుంది అంటూ పోసాని చెప్పుకొచ్చాడు. చంద్రబాబు గురించి పొగడటానికి చెన్నై నుండి రజనీకాంత్ విజయవాడకు వచ్చిన మాకు అభ్యంతరం లేదు. మాకు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు మెగాస్టార్ అంటే జగన్ కి ఎంతో అభిమానం అంటూ పోసాని కౌంటర్లు వేశాడు.

Posani Krishna Murali: మూడోసారి కరోనా బారిన పడిన పోసాని ఆస్పత్రికి తరలింపు!

Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు. ఇదివరకే ఈయన రెండుసార్లు కరోనా బారిన పడగా తాజాగా ఈయన మూడో సారి కరోనా బారిన పడ్డారు.ఈయనకు కరోనా అని తెలియడంతో కుటుంబ సభ్యులు తనని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

ఓ సినిమా షూటింగ్లో భాగంగా పూణే వెళ్లినటువంటి పోసాని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ఆయనకు ఒంట్లో బాగా లేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోక పాజిటివ్ అని తెలియడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈయన మూడోసారి కరోనా బారిన పడటం గమనార్హం.


Posani Krishna Murali: ఆందోళనలో అభిమానులు


ప్రస్తుతం కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీల సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇలా పోసాని కరోనా బారిన పడ్డారని తెలియగానే పలువురు ఈయన క్షేమంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Posani krishna murali: ఏపీ ఎఫ్ డిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నటుడు పోసాని!

Posani krishna murali: నటుడు పోసాని కృష్ణ మురళి తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా దర్శకుడిగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న ఈయన రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వైయస్ఆర్సీపీ పార్టీకి తన మద్దతు తెలుపుతున్నారు.

ఇలా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో పార్టీకి ఈయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించిన ప్రభుత్వం పోసాని కృష్ణ మురళికి అరుదైన గౌరవాన్ని అందించింది ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిని ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే ఈయన APFDC చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా మాజీమంత్రి పేర్ని నాని నిర్మాత మండలి అధ్యక్షుడు.సి.కళ్యాణ్..మోహన్ వడ్లపట్ల వంటి తదితరులు పాల్గొన్నారు.

Posani krishna murali: సినిమా షూటింగ్లకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేస్తాం….

ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం పోసాని మాట్లాడుతూ.. త్వరలో ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ మరియు షూటింగ్స్ జరపడం కోసం కావాల్సిన సదుపాయాలన్నింటిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పోసాని తెలియజేశారు. ఇలా జగన్ ప్రభుత్వంలో పోసానికి కీలక బాధ్యతలు ఇవ్వడంతో పలువురు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Posani Krishna Murali: నటుడు పోసాని జీవితంలో ఇంత విషాదం ఉందా… కన్నీళ్లు పెట్టుకున్న నటుడు!

Posani Krishna Murali: వెండితెరపై తన మాట తీరుతో నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నటువంటి నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన కామెడీతో అందరిని నవ్వించిన పోసాని కేవలం నటుడుగా మాత్రమే కాకుండా రచయితగా దర్శకుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇలా ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. రాజకీయాలలో కూడా ఈయన మాటతీరుతో పలుసార్లు వివాదాలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన వైసిపి పార్టీకి మద్దతు తెలపడంతో వైసిపి పార్టీలో ఈయనకు కీలక పదవిని కూడా ఇచ్చారు.

రాజకీయాలలోనూ సినిమాలలో ఎంతో బిజీగా ఉన్న ఈయన తాజాగా సుమ అడ్డా కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన తండ్రి గురించి తెలుసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.తన చిన్నప్పుడే తన తండ్రి చనిపోయారని పోసాని గుర్తు చేసుకున్నారు. తన తండ్రికి ఎలాంటి చెడు అలవాటు లేదని పేకాట అలవాటు మాత్రం ఉండేదని తెలిపారు. అయితే చాలామంది మా నాన్నను ఎందుకు సుబ్బారావు ఇలా చేస్తున్నావు అని అడిగేవారు.

Posani Krishna Murali: మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు…

ఇలా ప్రతి ఒక్కరూ అడగడంతో మా నాన్న ఎంతో మనస్థాపానికి గురైపొలం వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని పోసాని తన తండ్రి గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇలా పోసాని కన్నీళ్లు పెట్టుకోవడంతో సుమ, అలీ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. తెరపై అందరినీ నవ్వించే పోసాని చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఇంత బాధను అధిగమించారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 4వ తేదీన ప్రసారం కానుంది.

Posani Krishna Murali: కైకాల సత్యనారాయణ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని.. చెంచాగిరి అంటూ కామెంట్స్!

Posani Krishna Murali: నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మరణించారు. ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని తన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఇక కైకాల మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కూడా తన మృతికి సంతాపం ప్రకటిస్తూ పోస్టులు చేశారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కైకాల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచి ఉండే పోసాని కృష్ణమురళి సైతం కైకాల సత్యనారాయణ మరణం గురించి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పోసాని సత్యనారాయణ మరణం గురించి ఎలా స్పందించారు అనే విషయానికి వస్తే…

Posani Krishna Murali: నిజాయితీగా బతికిన నటుడు కైకాల…

చెంచాగిరి చేయకుండా… డ్రామాలు ఆడకుండా నిజాయితీగా బతికిన నటుడు కైకాల సత్యనారాయణ. కాలం ఉన్నంతవరకు కాకపోయినా సినీ కళాకారులు బ్రతికున్నంత కాలం బ్రతికి ఉండే నటుడు కైకాల గారు..జోహార్ అంటూ ఆయన మృతి పట్ల స్పందిస్తూ ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Posani Krishna Murali: అవును ఆ డైరెక్టర్ ను కాళ్లతో తన్నాను… వైరల్ గా మారిన పోసాని కామెంట్స్!

Posani Krishna Murali:ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పోసాని మురళీకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో అందరూ మెంటల్ కృష్ణ అని కూడా పిలుస్తుంటారు.అయితే వీటి గురించి ఈయన ఏమాత్రం లెక్క చేయకుండా తన ఇష్ట ధోరణిలో నడుస్తూ తన ఇష్టాను గుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఈ క్రమంలోనే పోసాని మురళీకృష్ణ ఎప్పుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవరికి తెలియదు. ఈ క్రమంలోనే పోసాని గతంలో ఒక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఈయన ఓ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఆ సినిమాకు పనిచేసే కో డైరెక్టర్ పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆ కో డైరెక్టర్ కి ఈయన తన పాడ్ తెచ్చి పెట్టమని చెప్పారట.అయితే తన పెన్ను పాడ్ కనిపించకపోవడంతో ఆ కో డైరెక్టర్ కనిపించలేదు అని సమాధానం చెప్పగా వెంటనే పోసాని తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించలేదు ఏంటి సార్ అని పిలవలేవా అంటూ అందరి ముందే తిట్టారట. అయితే కొంత సమయం తర్వాత కో డైరెక్టర్ మాట్లాడుతూ మురళి అని పిలిచారట.

Posani Krishna Murali: పేరు పెట్టి పిలిచినందుకే ఫైర్ అయిన పోసాని…

ఇలా తనని పేరు పెట్టి పిలవడంతో మండిపోయిన పోసాని తనని కాళ్ళతో తన్ని మురళి ఏంటి మురళి మురళి గారు అని పిలవలేవా అంటూ అందరి ముందు అవమానించానని స్వయంగా ఒప్పుకున్న ఈయన నా మేనరిజం స్ట్రగుల్ అలా ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విధంగా డైరెక్టర్ పట్ల ఈయన అవమానించిన తీరును తెలియజేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం పోసాని ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు.

Koratala Siva : ‘సింహా’ చిత్రానికి రచయితగా పనిచేసాను కానీ నా పేరు టైటిల్స్ లో వేయలేదు.. ఆయన ఓ రాక్షసుడు.. : కొరటాల శివ

‌Koratala Siva : కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గల సామాజిక కార్యకర్తల కుటుంబంలో కొరటాల జన్మించారు.ఆ తర్వాత మామ పోసాని కృష్ణ మురళి దగ్గర సినిమాలకు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్ గా పనిచేశాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, మరియు ఊసరవెల్లి వంటి చిత్రాలకు సంభాషణ రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు.’

2013లో అతను ప్రభాస్ నటించిన మిర్చితో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2015లో శ్రీమంతుడు అనే యాక్షన్-డ్రామా చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, ఆరు IIFA అవార్డులు మరియు ఆరు SIIMA అవార్డులు అందుకున్నారు. 2016 చిత్రం జనతా గ్యారేజ్‌లో  మోహన్‌లాల్ మరియు NT రామారావు జూనియర్ నటించారు.

ఈ కథ “జనతా గ్యారేజ్” పేరుతో పెద్ద ఆటోమొబైల్ సేవా కేంద్రాన్ని నిర్వహించడం మరియు వారి ఆటోమొబైల్ మెకానిక్‌ల సమూహం ద్వారా చట్టాన్ని అమలు చేయడం వంటిది ఎందుకంటే చట్టపరమైన ఏజెన్సీలు సరిపోవని భావించారు. కొరటాల ఈ చిత్రంతో దర్శకుడిగా వరుసగా మూడో విజయాన్ని సాధించాడు. అతను తిరిగి దర్శకత్వం వహించిన నటుడు మహేష్ బాబు పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం భరత్ అనే నేను మరియు బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగించింది. ఈ చిత్రం బాక్స్-ఆఫీస్ వద్ద ₹ 225 కోట్లు వసూలు చేసింది. కొరటాల తదుపరి దర్శకత్వం చిరంజీవి మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఆచార్య చిత్రాన్ని ప్రారంభించాడు. ఏప్రిల్ 2022లో విడుదలైన ఈ చిత్రం ప్రతికూల సమీక్షలను అందుకుంది.

అయితే ఈ మధ్యకాలంలో కొరటాల శివ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. బాలకృష్ణ నటించిన “సింహా ” చిత్రానికి తాను రచయితగా పనిచేశానని కానీ ఆ సినిమా టైటిల్స్ లో తన పేరు వేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏదైతేనేం తాను దర్శకుడిగా మారడానికి కూడా అదొక కారణమని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేరానని అలా నెలకి 25వేల రూపాయల వేతనం ఇచ్చే వారని.. పోసాని కృష్ణమురళి ఒక పని రాక్షసుడని కేవలం మూడు నుంచి నాలుగు గంటలు నిద్రపోతే సరిపోతుందని తరచూ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని చెబుతూ ఉండేవారని ఆయన ఆ ఇంటర్వ్యూలో తన గురువు పోసాని గురించి వివరించారు.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

Posani Krishna Murali:గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్న సినీ హీరోలు డైరెక్టర్లు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి ని భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఈ మీటింగుకు ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, చిరంజీవి, కొరటాల వంటి వారు హాజరయ్యారు. ఇక వీరు సినిమా సమస్యల గురించి టికెట్ల వ్యవహారం గురించి ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు బయటకు చెబుతున్నారే కానీ లోపల ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ లోపల ఈ అంశాల గురించిచర్చించి ఉండవచ్చు అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఇక ఈ మీటింగుకు నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో పోసాని మాట్లాడుతూ స్టార్ హీరోలపై సెటైర్లు వేశారని వినికిడి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్ హీరోలందరూ భారీగా పారితోషకాలు పెంచడం వల్ల వైసీపీ ప్రొడక్షన్స్ పెరిగిపోయే నిర్మాతలపై భారం పడటం వల్ల సినిమా టికెట్ల రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారు అంటూ పోసాని స్టార్ హీరోలను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

విషయం పక్కదారి పట్టించ వద్దు…

పోసాని మురళి కృష్ణ ఈ విధంగా మాట్లాడటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్ని పక్కదారి పట్టించవద్దని పోసానికి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు క్లారిటీ ఉందో తెలియదు కానీ మొత్తానికి ముఖ్యమంత్రితో భేటీ అయిన అనంతరం ప్రతి ఒక్కరూ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే సమస్యను సృష్టించారో వారికి వెళ్లి థ్యాంక్స్ చెప్పడం విడ్డూరంగా ఉంది. వీళ్ల కన్నా పవన్ కళ్యాణ్, నాని, హీరో సిద్ధార్థ్ వంటి వాళ్లే నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పోసానిపై కేసు నమోదు.. ఎవరు పెట్టారో తెలుసా..?

రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అంత్యంత ఆక్రోశంతో మాట్లాడిన విషయం తెలిసిందే. అటు ప్రభుత్వం సినీ పరిశ్రమపై చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. తర్వాత దీనిపై ప్రతీ ఒక్కరూ స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు ఘాటుగా సమాధానం కూడా ఇచ్చారు.

అయితే ఇదే వ్యాఖ్యలపై పోసాని ప్రెస్ మీట్ పెట్టి వైకాపా కార్యకర్తగా స్పందించాడు. దీంతో పవన్ అభిమానులు అతడి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత రెండో సారి ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ ఫ్యామిలీ విషయంలో కూడా తలదూర్చాడాని.. పోసానిపై దాడి చేసేందుకు కూడా పవన్ అభిమానులు వెనుకాడలేదు. కనిపిస్తే.. తీవ్రంగా కొట్టడానికైనా చూశారు.

దాని తర్వాత పవన్ అభిమానులపై పోసాని కేసు నమోదు చేస్తానంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు పోసానిపై కేసు నమోదు చేశాడు. వైఎస్ఆర్ కార్యకర్తల నుంచి తానకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి జనసేన కార్యకర్త అయిన రాజశేఖర్ ఈ ఫిర్యాదు చేశాడు.

వైకాపా కార్యకర్తలు తనను అవమానించారని.. పోసాని వ్యాఖ్యల తర్వాత ఇక్కడ తాము పవన్ అభిమానులమంటూ చెప్పుకొనే పరిస్థితి లేకుండా అయిందని అతడు వాపోయాడు. అతడి వ్యాఖ్యల వల్ల నాకు ప్రాణ హాని ఉందంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు. ఇటు పవన్ అభిమానుల నుంచి కూడా తనకు అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.