Tag Archives: promotions

Vijay Devarakonda: నువ్వు దేవరకొండ కాదు.. అనకొండవి.. పెద్ద పోటుగాడిలా స్టేట్మెంట్లు ఇచ్చావు ఒక్క టిక్కెట్ అమ్ముడుపోవట్లేదు.. విజయ్ పై ఫైర్ అయిన ధియేటర్ ఓనర్ !

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది.

ఇకపోతే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్ద ఎత్తున సినిమా డిస్ట్రిబ్యూటర్లు విజయ్ దేవరకొండపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈ సినిమాని బాయికాట్ చేయాలంటూ నార్త్ లో పెద్ద వార్తలు రావడంతో విజయ్ దేవరకొండ సినిమాని బాయ్ కాట్ చేస్తే కొట్టడమే అంటూ చేసిన వ్యాఖ్యలు ద్వారా ప్రేక్షకుల థియేటర్ కి రావడం మానేశారు.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని కొనుగోలు చేసే దారుణంగా నష్టపోతున్నారని హీరో విజయ్ దేవరకొండ పై మండి పడుతున్నారు. మల్టీప్లెక్స్ ఓనర్ మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ నువ్వు దేవరకొండ కాదు అనకొండ అంటూ దారుణంగా కామెంట్లు చేశారు. సినిమాని బ్యాన్ చేయమను అంటూ పెద్ద పోటుగాడిలా ఎగిరావు నీ స్టేట్మెంట్ వల్ల ఒక టికెట్ కూడా అమ్ముడుపోలేదు అంటూ ఈయన విజయ్ పై మండిపడ్డారు.

Vijay Devarakonda: దయచేసి రాజకీయాలు చేయొద్దు…

గతంలో నీలాగే తాప్సి కూడా ఎగిరింది ఇప్పుడు ఏమైంది రోడ్డు కొచ్చి పడింది దయచేసి రాజకీయాలు చేయకండి. మీ స్టేట్మెంట్ వల్ల నిర్మాతలు ఏమాత్రం నష్టపోరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున నష్టపోతారు అంటూ ఈయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండపై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nidhi Agarwal: కండోమ్ గురించి ప్రమోట్ చేసిన స్మార్ట్ బ్యూటీ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

Nidhi Agarwal: ఒకానొక సమయంలో హీరోయిన్లు ఎంతో పద్ధతిగా సినిమాలలో నటించేవారు. అయితే ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు హద్దులు దాటి పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ దారుణంగా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

Nidhi Agarwal: కండోమ్ గురించి ప్రమోట్ చేసిన స్మార్ట్ బ్యూటీ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

మొన్నటికి మొన్న సమంత, కాజల్, రెజీనా వంటి హీరోయిన్లు మందు బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. అయితే మరికొందరు హీరోయిన్లు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏకంగా కండోమ్ గురించి ప్రమోట్ చేస్తున్నారు.

Nidhi Agarwal: కండోమ్ గురించి ప్రమోట్ చేసిన స్మార్ట్ బ్యూటీ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

గత కొద్ది రోజుల క్రితం నాటి అనిత తన భర్తతో కలిసి కండోమ్ యాడ్ చేయడంతో నెటిజన్లు భారీగా ట్రోల్ చేశారు. ఈ విషయం మరిచిపోకముందే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సైతం కండోమ్ గురించి భారీ ప్రమోషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహిళలు పొందే ఫీలింగ్…

ఈ వీడియోలో భాగంగా నిధి అగర్వాల్ కండోమ్ గురించి మాట్లాడుతూ.. చివరిలో కండోమ్ ఉపయోగించడం వల్ల మహిళలు పొందే ఫీలింగ్ అంటూ మాట్లాడటంతో చాలామంది ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ ఎన్నిసార్లు ఆ ఫీలింగ్ అనుభవించావు ఇంత అద్భుతంగా చెబుతున్నావు అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కండోమ్ ప్రమోషన్ ద్వారా ఈ స్మార్ట్ బ్యూటీ దారుణమైన కామెంట్లను ఎదుర్కోవల్సి వస్తుంది.

Vijay Devarakonda: ఆ సినిమా ప్రమోషన్ కోసం 50 లక్షలు ఇస్తామన్నా వదులుకున్నాడట.. ఎందుకంటే?

Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు సంబంధించిన ఒక సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Vijay Devarakonda: ఆ సినిమా ప్రమోషన్ కోసం మంచి ఆఫర్ ని వదులుకున్న రౌడీ స్టార్.. ఎందుకంటే?

తాను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఓ సినిమాలో నటించారు అయితే కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు కానీ తిరిగి అదే నిర్మాతలు ఆ సినిమా ప్రమోషన్ చేయమని విజయ్ దేవరకొండకు ఏకంగా 50 లక్షలు ఆఫర్ చేస్తే రౌడీ హీరో సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. అసలు ఈ హీరో ఆఫర్ ని ఎందుకు వద్దనుకున్నారు అనే విషయానికి వస్తే…

Vijay Devarakonda: ఆ సినిమా ప్రమోషన్ కోసం మంచి ఆఫర్ ని వదులుకున్న రౌడీ స్టార్.. ఎందుకంటే?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా తన కెరియర్ తొలి రోజుల గురించి విజయ్ దేవరకొండ తెలియజేశారు.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రమణ్యం వంటి సినిమాలు చేస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ హీరోగా “ఏం మంత్రం వేసావే” అనే సినిమాలో పూర్తిస్థాయి హీరోగా నటించారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు.

ఇది పద్ధతి కాదని ఒప్పుకోలేదు..

ఇక ఆ సినిమా విడుదల కాకపోవడంతో ఈలోగా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు విడుదలై మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇలా విజయ్ దేవరకొండ కు మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఆ నిర్మాతలు తన వద్దకు వచ్చి ఏం మంత్రం వేసావే సినిమా ప్రమోషన్ చేస్తే తనకు 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారనీ ఈ సందర్భంగా రౌడీ హీరో తెలిపారు. అయితే ఏ మాత్రం బాగా రాని సినిమా ప్రమోషన్ చేయడం మంచి పద్ధతి కాదని నా ఫేమ్ ఉపయోగించి మీరు సినిమాని ప్రమోట్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే సంపాదించుకోండి నేను మాత్రం ఈ సినిమాని ప్రమోట్ చేయానని విజయ్ దేవరకొండ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

RRR Movie Pramotions: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం ఇంత ఖర్చా.. నోరెళ్లపెడుతున్న సినీ ప్రముఖులు..!

RRR Movie Pramotions: దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. దీని విడుదల కోసం పంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు దీనికి జనవరి 7వ తేదీన విడుదల కావాల్సి ఉంది కానీ.. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండటంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా. ఫన్నీగా, బాధగా ట్రోలింగ్స్..!

అయితే సినిమా విడుదలకు ప్రమోషన్ల కోసం పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోయింది. దాదాపు రూ.40 కోట్ల వరకు ప్రమోషన్ల కోసం ఖర్చు పెట్టారట. మొదట సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా కరోనా దెబ్బ ఈ సినిమాపై బాగా పడింది.

RRR Pre Release: వాళ్ల ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం..ఇలాంటి వారిని తాను ఎప్పుడూ చూడలేదు: రాజమౌళి

అప్పుడప్పుడు ఇలా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఎలాగోలా సినిమాను పూర్తి చేసేశారు. కానీ ఒమిక్రాన్ ప్రభావంతో ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడింది. 50 శాతం ఆక్యూపెన్సీతో విడుదల చేసుకోవచ్చు అని చెప్పినా.. నష్టం వస్తుందనే కారణంతో సినిమాను వాయిదా వేసుకున్నారు సినీ నిర్మాతలు. మరి సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే క్లారిటీ ఇప్పటి వరకు లేదు.

చిన్న సినిమాలకు ప్లస్ అనే చెప్పాలి..

ఇంత పెద్ద బడ్జెట్ సినిమా వాయిదా పడటంతో.. చిన్న సినిమాలకు ప్లస్ అనే చెప్పాలి. దాదాపు 6 నుంచి 8 సినిమాల వరకు ఈ సంక్రాంతికి బరిలో దిగనున్నాయి. ఇదంతా ఇలా ఉంటే.. ప్రమోషన్ల కోసం పెట్టిన ఖర్చు తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. చెన్నై, బెంగళూరు, కొచ్చి అంటూ అన్ని చోట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. వాటి కోసం దాదాపు రూ.40 కోట్లు ఖర్చు పెట్టామని సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు ట్విట్టర్ వేదిక గా చెప్పాడు. ఇప్పుడు ఇదంతా వృథాగా అయిపోయింది. ఇక మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ.. ఆ సమయంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

Fahadh Faasil: ఫహద్ ఫాజిల్ పుష్ప ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉండటానికి కారణం ఇదే..!

Fahadh Faasil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో ’పుష్ప ది రైస్‘ మూవీ చేరింది. బన్నీ కెరీర్లో తొలిసారిగా ప్యాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో కూడా కలెక్షన్లను బాగానే రాబట్టింది. సినిమా రిలీజ్ కు ముందే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ సినిమాపై భారీ అంనాలను పెంచింది. 

Fahadh Faasil: ఫహద్ ఫాజిల్ పుష్ప ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉండటానికి కారణం ఇదే..!

పుష్ప విడుదలకు ముందు చిత్రయూనిట్ అన్ని భాషల్లో భారీగా ప్రమోషన్లను నిర్వహించింది. హిందీ, తెలుగు, కన్నడ, మళయాళ, తమిళ భాషల్లో విడుదల కావడంతో ఆయా రాష్ట్రాల్లో పుష్ప చిత్ర యూనిట్ ప్రమోషన్లను నిర్వహించింది. అల్లు అర్జున్, రష్మిక చిత్ర ప్రమోషన్లను ముందుండి నడిపించారు. ఇదిలా ఉంటే పుష్పలో మెయిన్ విలన్ ఫహాద్ ఫాజిల్ మాత్రం చిత్ర ప్రమోషన్లలో ఎక్కడా పాలు పంచుకోలేదు.

Fahadh Faasil: ఫహద్ ఫాజిల్ పుష్ప ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉండటానికి కారణం ఇదే..!

పుష్ఫ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి మరో కారణం విలన్. మళయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటంతో సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది. ఫహాద్ కారణంగానే మళయాళంలో కలెక్షన్లు కూడా పెరిగాయి. బన్నీ పుష్ప క్యారెక్టర్ కు విలన్ గా భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫహాద్ ఫాజిల్ కనిపించారు. ఈ సినిమాకు ఫహాద్ భారీ పారితోషకమే తీసుకున్నారు. అయతే పుష్ప సినిమా ప్రమోషన్లలో ఎక్కడా పాల్గొనకపోవడం ఇప్పడు చర్చనీయాంశం అయింది.

పుష్పకు ఛాలెంజ్ విసిరే పాత్రలో ఫహాద్ క్యారెక్టర్..

సాధారణంగా ఫహాద్ ఫాజిల్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారు. ఒక వేళ ప్రమోషన్లు చేస్తే రెమ్యునేషన్ పెంచుతాడు ఫహాద్. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో ఫహాద్ క్యారెక్టర్ తక్కువగానే ఉండటంతో ప్రమోషన్లకు దూరంగా ఉన్నారనే వాదన కూడా ఉంది. ’పుష్ప ది రూల్‘ రెండో భాగంలో ఫహాద్ క్యారెక్టర్ నిడివి ఎక్కువని తెలుస్తోంది. పుష్పకు ఛాలెంజ్ విసిరే పాత్రలో ఫహాద్ క్యారెక్టర్ ఉండనుంది. దీంతో పుష్ప రెండో పార్ట్ ప్రమోషన్లలో ఫహాద్ తప్పక పాల్గొంటారని తెలుస్తోంది.

ఫేక్ ఫోటోలతో ప్రమోషన్ … ఆ దేశ పరువును తీసిన చైనా యువత?

సాధారణంగా వివిధ దేశాలలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చూడటం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. ఈ క్రమంలోనే పర్యాటకులను ఆకర్షించడం కోసం పర్యాటక శాఖ పర్యాటక ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్జియాపు కౌంటీ అనే సుందరమైన ఒక చిన్న గ్రామం ఎంతో మంది పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే అందాలు ఆ వూరి సొంతమని చైనా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించింది.

ప్రమోషన్ లో భాగంగానే బీచ్ ఒడ్డున ఎంతో సుందరంగా కనిపించే అందాల నడుమ జాలర్లు చేపలు పట్టడం. పచ్చదనం పొగ మంచులలో పక్షుల సందడి,వెరసి చైనాలోని రూరల్‌ టౌన్‌ గ్జియాపు కౌంటీని సుందర ప్రాంతంగా ప్రకటించుకుంది చైనా పర్యాటక శాఖ. అయితే వీటిని చూసిన ఇతర విదేశీ పర్యాటకులు ఆ ప్రదేశాలకు పెద్దఎత్తున అక్కడి ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లారు. కానీ ఆ ప్రదేశంలో అలాంటి సుందరమైన అందాలు కనిపించక పోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు.

ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రచారం అంతా పైన పటారం లోన లొటారం అంటూ అసలు ఫోటో షూట్లను బయటపెట్టి చైనా ప్రభుత్వం బండారాన్ని చైనా దేశానికి చెందిన కొందరు యువత బయటపెట్టారు.అంతేకాకుండా ఆ ఫోటోలో ఉన్నది నిజం కూలీలు రైతులు కాదని ,వాళ్ళందరూ కూడా మోడల్స్ అని వారి కోసం చాలా డబ్బులు వెచ్చించారని అసలు విషయాన్ని బయటపెట్టారు.

ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం స్పందించి కరోనా కారణం వల్ల ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆ గ్రామానికి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి ఆలోచన చేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం కూడా ప్రచురించింది. అయితే ఆర్థికంగా వెనుకబడిన గ్రామాన్ని ఆర్థికంగా నిలబెట్టడం ఒక మంచి పని అయినప్పటికీ ఈ విధంగా మోసపూరితంగా వచ్చిన ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం దేశానికి పరువు తీసే అంశమని భావించిన యువత అసలు విషయాన్ని బయటపెట్టారు.

అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. భారీగా జీతాల పెంపు..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ అంగన్ వాడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలను పెంచడంతో పాటు ప్రమోషన్లను ఇవ్వనుంది. అదే సమయంలో ఉద్యోగులకు మరికొన్ని ప్రయోజనాలను కల్పించనుంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.

త్వరలోనే ప్రమోషన్లు కల్పించడంతో పాటు జీతాలను పెంచుతామని మంత్రి చేసిన ప్రకటన పట్ల అంగన్ వాడీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన భర్తీ ప్రక్రియను కూడా చేపడతామని మంత్రి తెలిపారు. మంత్రి ఇదే సమయంలో ఇబ్బందులు, కష్టాలు పడుతున్న అంగన్ వాడీ సిబ్బందికి బీమా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ అంగన్ వాడీ వర్కర్లను టీచర్లని పిలవాలని చెప్పారని.. అంగన్ వాడీ వర్కర్లకు సమాజంలో సముచిత గౌరవం కల్పించే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే అంగన్ వాడీ ఖాళీల భర్తీ జరుగుతుందని.. ఈసారి కూడా వేతనాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అంగన్ వాడీ ద్వారా ప్రయోజనం కల్పించాలని ఆమె అన్నారు.

మంత్రి ప్రత్యేకంగా తయారు చేసిన చీరలను అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, మినీ అంగన్‌వాడీ టీచర్లకు పంపిణీ చేశారు. అంగన్‌వాడీలకు ప్రయోజనం చేకూరే విధంగా మంత్రి కీలక ప్రకటనలు చేయడంతో పాటు త్వరలో ఖాళీలను భర్తీ చేయనుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.