Featured

Vijay Devarakonda: ఆ సినిమా ప్రమోషన్ కోసం 50 లక్షలు ఇస్తామన్నా వదులుకున్నాడట.. ఎందుకంటే?

Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు సంబంధించిన ఒక సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Vijay Devarakonda: ఆ సినిమా ప్రమోషన్ కోసం మంచి ఆఫర్ ని వదులుకున్న రౌడీ స్టార్.. ఎందుకంటే?

తాను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఓ సినిమాలో నటించారు అయితే కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు కానీ తిరిగి అదే నిర్మాతలు ఆ సినిమా ప్రమోషన్ చేయమని విజయ్ దేవరకొండకు ఏకంగా 50 లక్షలు ఆఫర్ చేస్తే రౌడీ హీరో సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. అసలు ఈ హీరో ఆఫర్ ని ఎందుకు వద్దనుకున్నారు అనే విషయానికి వస్తే…

Vijay Devarakonda: ఆ సినిమా ప్రమోషన్ కోసం మంచి ఆఫర్ ని వదులుకున్న రౌడీ స్టార్.. ఎందుకంటే?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా తన కెరియర్ తొలి రోజుల గురించి విజయ్ దేవరకొండ తెలియజేశారు.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రమణ్యం వంటి సినిమాలు చేస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ హీరోగా “ఏం మంత్రం వేసావే” అనే సినిమాలో పూర్తిస్థాయి హీరోగా నటించారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు.

ఇది పద్ధతి కాదని ఒప్పుకోలేదు..

ఇక ఆ సినిమా విడుదల కాకపోవడంతో ఈలోగా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు విడుదలై మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇలా విజయ్ దేవరకొండ కు మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఆ నిర్మాతలు తన వద్దకు వచ్చి ఏం మంత్రం వేసావే సినిమా ప్రమోషన్ చేస్తే తనకు 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారనీ ఈ సందర్భంగా రౌడీ హీరో తెలిపారు. అయితే ఏ మాత్రం బాగా రాని సినిమా ప్రమోషన్ చేయడం మంచి పద్ధతి కాదని నా ఫేమ్ ఉపయోగించి మీరు సినిమాని ప్రమోట్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే సంపాదించుకోండి నేను మాత్రం ఈ సినిమాని ప్రమోట్ చేయానని విజయ్ దేవరకొండ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago