Samantha: విడాకులు ప్రకటన తొలగించిన సమంత.. మళ్లీ కలవబోతున్నారా..!
Samantha:టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య సమంత జంటగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట వివాహమైన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.
ఇలా అక్టోబర్ 2వ తేదీ వీరి విడాకుల ప్రకటన గురించి అధికారికంగా తెలియజేశారు. దీంతో ఎంతో మంది సినీ ప్రముఖులు అభిమానులు షాక్ అయ్యారు. ఎలాగైనా వీరిద్దరూ తిరిగి కలిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.అయితే సోషల్ మీడియా వేదికగా వీరు చేసే పోస్టులు చూస్తే వీరిద్దరూ కలవరని అర్థమయింది.
ఇక విడాకుల ప్రకటన తర్వాత సమంత నాగ చైతన్య వారి కెరియర్ పై ఫోకస్ చేసి ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇప్పుడిప్పుడే వీరి విడాకుల విషయం గురించి మర్చిపోయి పూర్తి దృష్టిని సినిమాలపై పెట్టిన నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో తన విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్ట్ డిలీట్ చేశారు.
ఈ విధంగా సమంత విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్ట్ డిలీట్ చేయడంతో ఎంతో మంది అభిమానులు వివిధ రకాల సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. త్వరలోనే సమంత నాగచైతన్య తిరిగి కలుస్తున్నారా? లేక పొరపాటున డిలీట్ అయిందా? లేకుంటే అది అవసరమని డిలీట్ చేశారా? అదే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.ఒకవేళ వీరిద్దరూ తిరిగి కలిసే అవకాశం ఉంటే నాగచైతన్య కూడా ఆ పోస్ట్ డిలీట్ చేయాలి.అయితే నాగచైతన్య ఆ పోస్ట్ డిలీట్ చేయకపోవడంతో వీరిద్దరూ తిరిగి కలిసే అవకాశం కూడా లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…