Tag Archives: release

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో రిలీజ్ వెనుక కారణం అదేనా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా నుంచి తాజాగా ఒక న్యూడ్ ఫోటో విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల చేయగానే క్షణాల్లో వైరల్ గా మారింది.ఇక ఈ ఫోటో వైరల్ కావడంతో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలతో పాటు నేటిజన్లు సైతం ఫోటో పై స్పందిస్తూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో విడుదల కావడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో రిలీజ్ వెనుక కారణం అదేనా?

ఇక విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున ఈ ఫోటో పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఇలాంటి న్యూడ్ ఫోటో విడుదల చేయడానికి ఓ కారణముంది. అయితే ఈ ఫోటో ఎందుకు విడుదల చేశారనే విషయానికి వస్తే… ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోందని విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే అందరికీ అర్థమైంది.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో రిలీజ్ వెనుక కారణం అదేనా?

ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ లలో పాల్గొనబోయే ఫైటర్స్ శరీర బరువు కొలవడానికి ఈ విధంగా ఒంటి పై ఒక్క నూలు పోగు కూడా లేకుండా వారి శరీర బరువును కొలుస్తారు. ఇలా పాల్గొనబోయే ఫైటర్స్ శరీర బరువును గ్రాములతో సహా కొలుస్తారు కనుక ఇలా న్యూడ్ గా ఉంటారు.

శరీర బరువు కొలవడానికే ఇలా

ఈ విధంగా ఈ ఛాంపియన్ షిప్ లీగ్స్ ఫాలో అయ్యే వారికి ఈ విషయం గురించి అవగాహన ఉంటుంది.ఇక ఈ సినిమా కూడా అదే తరహాలోనే ప్రేక్షకుల ముందుకు రావడంతో సింబాలిక్ గా విజయ్ దేవరకొండ ఫోటోని న్యూడ్ ఫోటోగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా తాజాగా ఈ పోస్టర్ తో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

KGF2 Second Day Collections: విడుదలైన రెండు రోజులకే రికార్డులతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కేజీఎఫ్ …!

KGF2 Second Day Collections: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం యావత్ సౌత్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూసిన వెయిటింగ్ కి తెరపడింది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

KGF2 Second Day Collections: విడుదలైన రెండు రోజులకే రికార్డులతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కేజీఎఫ్ …!

ప్రీమియర్ షోతోనే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా అదరగొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు ముందు నుంచే అంచనా వేశాయి. అందుకు తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది కేజీఎఫ్ 2.

KGF2 Second Day Collections: విడుదలైన రెండు రోజులకే రికార్డులతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కేజీఎఫ్ …!

మొదటి రోజే రూ.134.5 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించిన ఈ చిత్రం, రెండో రోజూ అదేస్థాయిలో వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులకు గాను ఈ చిత్రం దాదాపు 240 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించినట్టు సమాచారం. ఇక టాలీవుడ్‌ విషయానికొస్తే తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్‌ సాధించగా, రెండో రోజు రూ.12.95 కోట్లను రాబట్టింది.రెండో రోజుల్లోనే ఓ డబ్బింగ్‌ మూవీ టాలీవుడ్‌లో రూ.33 కోట్ల షేర్‌ రాబట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ఈ రికార్డు రజనీకాంత్‌ ‘రోబో’ సినిమా సొంతం చేసుకోగా, ఇప్పుడు ఈ జాబితాలోకి కేజీఎఫ్ వచ్చి చేరింది.

కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న కేజిఎఫ్…

ఇక బాలీవుడ్‌లోనూ కేజీఎఫ్‌ తన సత్తా కొనసాగిస్తోంది. తొలి రోజే రూ.50 కోట్లు వసూళ్లు చేసి మరో రికార్డ్ ను బ్రేక్ చేసింది. రెండో రోజు దాదాపు 45 కోట్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాల అంచనా. ఇకపోతే కేవలం రెండు రోజుల్లోనే హిందీలో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం మరో విశేషం. ఇక వీకెండ్ కూడా దానికి తోడు కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సీనీ వర్గాల సమాచారం. రెండు రోజులకే కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా, వారం ముగిసేసరికి ఎన్ని వందల కోట్లను కలెక్ట్‌ చేస్తుందో చూడాలి మరి.

రేపే అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథి ఎవరో తెలుసా..!

ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న జక్కన్న దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఐదు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా.. మరో ఐదు బాషల్లో డబ్ అయి మొత్తం 10 భాషల్లో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఆర్ఆర్ఆర్ టీం సభ్యలు తేదీని ప్రకటించారు. అదే డిసెంబర్ 19న హిందీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలిపారు. అయితే ఇప్పటికే మన తెలుగు హీరోలు ముంబయ్ లో వాలిపోయారు.

వాళ్లు అక్కడ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వస్తాడనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం తన తాజా యాక్షన్ చిత్రం యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్ విజయంతో దూసుకుపోతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఇటీవలి కాలంలో తారా సుతారియా , అహన్ శెట్టి నటించిన రొమాంటిక్ డ్రామా తడప్ ప్రదర్శనకు కూడా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్‌తో పాటు.. పలువురు ఇతర అగ్ర నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.

అయితే.. దీని గురించి అధికారికంగా ధృవీకరణ ఇంకా కాలేదు. అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక తెలుగులో ఎప్పుడు ప్రీ రిలీజ్ ఉంటదనే దానిపై ఎలాంటి అధికారింగా ప్రకటన రాలేదు. మరోవైపు.. SS రాజమౌళి త్వరలో రాబోయే హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు సంబంధించి నిన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో రాజమౌళి, నాగార్జున పాల్గొని తమ ప్రసంగాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, నాగార్జునతో పాటు రణబీర్ కపూర్, కరణ్ జోహార్, అలియా భట్ , దర్శకుడు అయాన్ ముఖర్జీ హాజరు అయ్యారు.

డిసెంబర్ నెలలో థియేటర్లో సందడి చేసే సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..

2021 చివరి నెల బాక్సాఫీస్ వద్ద సంచలనం స్పష్టించనుంది. నందమూరి బాలకృష్ణ సినిమాతో మొదలై థియేటర్లలో సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా ఇక్కడ చూద్దాం. వాటిపై ఓ లెక్కేద్దాం.. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో డిసెంబర్ 2న ‘అఖండ’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘అఖండ’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఈ వారాంతంలో థియేటర్లలోకి రానున్న మరో తెలుగు చిత్రం ‘స్కైలాబ్’. డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉది. ‘స్కైలాబ్’ అనేది 1979 నాటి కామెడీ, డ్రామాగా తెరకెక్కింది. తమ గ్రామం పై స్పేస్ స్టేషన్ పడిపోతుందని ఒక గ్రామ ప్రజలు హృదయపూర్వకంగా భావించే సంఘటనల హాస్య మలుపుతో వ్యవహరిస్తారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
డిసెంబర్ రెండో వారంలో కొత్త సినిమాల హంగామా కనిపిస్తోంది. అవి నాగశౌర్య ‘లక్ష్య’, కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ మరియు శ్రియ ‘గమనం’.

అవన్నీ ఒకే రోజున – డిసెంబర్ 10న విడుదలకానున్నాయి. ‘లక్ష్య’ అనేది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ‘గుడ్ లక్ సఖి’ కూడా లంబాడా అమ్మాయి గురించి మాట్లాడే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గమనం’.. శ్రియా శరణ్, నిత్యా మీనన్, శివ కందుకూరి మరియు ప్రియాంక జవాల్కర్ చుట్టూ తిరిగే కథ. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

ఈ నెలలో అతిపెద్ద చిత్రం అల్లు అర్జున్ తొలి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ – ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ‘పుష్ప ది రైజ్’ డిసెంబరు 17న ఏకకాలంలో ఐదు భాషల్లో విడుదలవుతోంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత దర్శకుడు సుకుమార్‌ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ బిగ్గీ ‘స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్’ తెలుగులో కూడా విడుదలవుతోంది, ఇది ‘పుష్ప’కి ఒక రోజు ముందే థియేటర్లలోకి రానుంది. నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 25 న విడుదల అవుతుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది ఈ సినిమా. రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహించిన ఈ చింద్రంలో .. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ మరియు కృతి శెట్టి నటించారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే రోజున కపిల్ దేవ్ బయోపిక్ ’83’ కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.

బీటెక్ అయిపోయిన ఆర్ఆర్ఆర్ విడుదల కాలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నెటిజన్లు.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన చిత్రబృందం!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల పై సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి కామెంట్ చేశారు. ఈ సందర్భంగా స్పందిస్తూ నేను డిప్లమో చదివేటప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నేను బీటెక్ పూర్తి చేసిన సినిమా విడుదల కాలేదు అంటూ కామెంట్ చేశారు.

ఇలా నెటిజన్ చేసిన కామెంట్ కు చిత్రబృందం స్పందిస్తూ అదిరిపోయే సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా చిత్ర బృందం స్పందిస్తూ నువ్వు కాలేజీకి వెళ్లినన్ని రోజులు కూడా మేము షూటింగ్ చేయలేదు ఏం చేస్తాం మరి అంటూ అదిరిపోయే కామెంట్ చేశారు. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వాయిదా వేశారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7వ తేదీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఈ పాటలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ చేసిన డాన్స్ కి ఎంతో మంది అభిమానులు ఫిదా అయ్యారు.. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారి సినిమాపై అంచనాలను పెంచుతుంది.

‘మైల్స్ ఆఫ్ లవ్’ టీజర్ ను విడుదల చేసిన శ్రీ విష్ణు.. చాలా బాగుంది అంటూ..

నందన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘మైల్స్ ఆఫ్ లవ్’. ఈ సినిమాలో హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి నటీనటులుగా నటించారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి నిర్మించాడు. ఇక ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ సంగీతాన్ని అందించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు చేతులమీదుగా విడుదలయ్యింది.

ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఇందులో పలు పాటలు కూడా విడుదల అయిన సంగతి తెలిసిందే. అందులో తెలియదే పాట మాత్రం యూట్యూబ్ లో బాగా హల్ చల్ చేస్తుంది. ఇక ఈ సినిమా మంచి ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కనుంది. టీజర్ లో మాత్రం డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు బాగా రిచ్ గా కనిపించాయి.

ఇక శ్రీ విష్ణు ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ టీజర్ తనకు బాగా నచ్చిందని తెలిపాడు. హీరో అభినవ్ అందంగా ఉన్నాడని ఇక ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని అందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని తెలిపాడు శ్రీ విష్ణు. ఇక ఈ టీజర్ ను చూసిన ప్రేక్షకులు కూడా బాగా లైకులు చేస్తున్నారు.

మంత్రి అవంతి తో కేంద్ర మంత్రి ఎస్ ఎస్ వర్మ భేటీ

మంత్రి అవంతి తో కేంద్ర సహాయ మంత్రి ఎస్ ఎస్ వర్మ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లో సినిమా చలన అప్పన్న ఆలయ అభివృద్ధి పనులపై ఇరువురు చర్చించారు. ప్రసాదం పథకం కింద 55 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర సహాయమంత్రి ప్రకటించారు. అంతేకాక భక్తుల కోసం వెయిటింగ్ హాల్ యజ్ఞశాల నిర్మాణం తలపెట్టినట్లు వెల్లడించారు.

కాగా గిరి ప్రదక్షణ కోసం కొండ చుట్టూ రాఖీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మాధవ దార మెట్లు మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి అవంతి స్పష్టం చేశారు

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఏపీలో ఆ ఖైదీలంతా విడుదల..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష పూర్తైన మహిళా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా ఖైదీలు, వాళ్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల పాలనకు భిన్నంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.

నిన్న ఏపీ హోం మంత్రి సుచరిత మీడియాలో మాట్లాడుతూ మహిళా ఖైదీల విడుదల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయమని.. దేశ చరిత్రలోనే గతంలో ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని చెప్పారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 55 మంది మహిళా ఖైదీలు విడుదల కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 147 మంది మహిళా ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

పోలీసులు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వివిధ వృత్తులపై శిక్షణ ఇచ్చారు. ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి కాళ్లపై వారు నిలిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఇంతమంది మహిళా ఖైదీల విడుదల జరుగుతోందని వెల్లడించారు. విడుదలైన ఖైదీలు కుటుంబాలతో సంతోషకరమైన జీవనం సాగిస్తాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

నేరాల్లో మహిళల పాత్ర గురించి కూడా విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. చాలామంది క్షణికావేశంలో నేరాలు చేసి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాబొయే ఏడు రోజుల్లో మహిళా ఖైదీల విడుదల జరగనుందని చెప్పారు.

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. సబ్సిడీ నగదు విడుదల..!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. భారీ వర్షాల వల్ల పంట దెబ్బ తినడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ప్రభుత్వం 10.76 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల మధ్యలో కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఆ సమయంలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదలైంది. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ నగదును ఇవ్వనుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టపోయిన రైతుల వివరాలను, వారికి అందించాల్సిన పరిహారం వివరాలకు సంబంధించిన నివేదికను తయారు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో 7,757 హెక్టార్లల్లో పంట నష్టానికి సబ్సిడీ విడుదలైంది.

ప్రభుత్వం విడుదల చేసిన నగదును 17,872 మంది నష్టపోయిన రైతులకు అధికారులు ఇవ్వనున్నారు. మరోవైపు జగన్ సర్కార్ ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా నగదును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రైతుల ఖాతాలలో 4,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుందని తెలుస్తోంది. ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఈ నగదును రైతులకు ఇస్తోంది.

జగన్ సర్కార్ ప్రతి సంత్సరం రైతు భరోసా పథకం ద్వారా 13,500 రూపాయల నగదు ఇవ్వనుండగా ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, రాష్ట్రం వాటా 7,500 రూపాయలుగా ఉంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఉన్నా పథకాలను అమలు చేస్తూ ఉండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.