Tag Archives: revanth

Revanth: డబ్బు కన్నా నాకు పేరే ముఖ్యం… శ్రీహాన్ పై షాకింగ్ సెటైర్స్ వేసిన సింగర్ రేవంత్!

Revanth: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం విజేతగా రేవంత్ ట్రోఫీ అందుకున్నారు. అయితే ట్రోఫీ అందుకున్న అనంతరం నాగార్జున ఓట్ల పరంగా శ్రీహాన్ మొదటి స్థానంలో ఉన్నారని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ నా లేక శ్రీహాన్ నా అని సందేహం ఏర్పడింది.

శ్రీహాన్ 40 లక్షల రూపాయల డబ్బు తీసుకోకుండా ఉండి ఉంటే తప్పకుండా ట్రోఫీ అతనే గెలుచుకునేవాడని అతను 40 లక్షలు డబ్బు తీసుకోవడం వల్ల రేవంత్ విన్నర్ అయ్యారంటూ సోషల్ మీడియాలో కొందరు ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం అనంతరం రేవంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పరోక్షంగా శ్రీహాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తనకు డబ్బు కన్నా పేరే ముఖ్యమని తెలిపారు.పేరు ఉంటే డబ్బు సంపాదించుకోవడం చాలా సులభమని తెలిపారు. ఇలా రేవంత్ మాటల వెనుక శ్రీహాన్ డబ్బుకు ఆశపడి డబ్బు తీసుకున్నారంటూ పరోక్షంగా అతనిపై కామెంట్లు చేశారు.ఈ క్రమంలోనే శ్రీహాంత్ డబ్బు కనుక తీసుకోకపోయి ఉంటే తనే విజేతగా నిలిచేవాడని రేవంత్ రన్నర్ గా మిగిలిపోయే వారని మరికొందరు ఈ విషయం గురించి చర్చిస్తున్నారు.

Revanth: రేవంత్ కి విజయాన్ని అందించిన శ్రీహన్….

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ తానేనని మొదటి నుంచి ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి రేవంత్ కు అసలైన విజయాన్ని శ్రీహాన్ అందించారని, శ్రీహాన్ ఫాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ గ్రాండ్ ఫినాలేలో ఒకరు 40 లక్షలు మరొకరు ట్రోఫీ అందుకోవడంతో వీరిద్దరూ కూడా విజేతలేనని నాగార్జున ప్రకటించారు.

Bigg Boss6 winner: బిగ్ బాస్ 6 విన్నర్ గా రేవంత్ సంపాదించింది ఏంతో తెలుసా?

Bigg Boss6 winner: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం ఎంతో ఘనంగా గ్రాండ్ ఫినాలే జరుపుకుంది.15వ వారంలో భాగంగా 6 మంది కంటెస్టెంట్ లు ఉండగా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీ సత్య బయటకు వెళ్లారు. ఇక టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహాన్, రేవంత్ టాప్ పై కంటెస్టెంట్లుగా నిలిచారు.

ఇక వీరిలో శ్రీహన్ రన్నర్ గా నిలవగా విజేతగా రేవంత్ నిలిచారు. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే శ్రీహన్ మొదటి స్థానంలో ఉండగా ఈయన మాత్రం 40 లక్షల రూపాయలు ఉన్నటువంటి గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోవడంతో ట్రోఫీ రేవంత్ అందుకున్నారు.మొత్తానికి విజేతగా నిలిచినటువంటి రోహిత్ బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంత మొత్తంలో సంపాదించారు అనే విషయానికి వస్తే…

బిగ్ బాస్ విజేతగా నిలిచినందుకు ఈయన 10 లక్షల రూపాయల చెక్ ప్రైజ్ మనీ అందుకున్నారు. అదేవిధంగా 650 గజాలు కలిగినటువంటి సువర్ణభూమి ఫ్లాట్ ధర 30 లక్షలు, వీటితోపాటు రేవంత్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ సుమారుగా 11 లక్షలు అందుకున్నారు. వీటితోపాటు మారుతి సుజుకి బ్రీజా కారును కూడా అందుకున్నారు. దీని విలువ సుమారు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా.

Bigg Boss6 winner: బిగ్ బాస్ ద్వారా భారీగా సంపాదించుకున్న రేవంత్…

ఇలా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినటువంటి రేవంత్ తక్కువలో తక్కువ సుమారు 60 నుంచి 65 లక్షల వరకు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్థాయిలో బిగ్ బాస్ ద్వారా సంపాదించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక రన్నర్ గా నిలిచిన శ్రీహన్ 40 లక్షల ప్రైజ్ మనీతో పాటు, తన రెమ్యూనరేషన్ అందుకోనున్నారు.ఇక సువర్ణభూమి డెవలపర్స్ శ్రీహాన్ కు అద్భుతమైన ఆఫర్ కూడా కల్పించారు. ఆయన సువర్ణ భూమి ల్యాండ్ ఎప్పుడు కొన్న తనకు 50 పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని బిగ్ బాస్ వేదికగా వెల్లడించారు.

Bigg Boss6: బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి ఇద్దరు విజేతలు… చివరిలో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున!

Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ముగిసింది.ఇక ఈ కార్యక్రమంలో విన్నర్ గా రేవంత్ నిలబడతారని ముందుగా ఊహించినట్టే ఆయన ట్రోఫీ అందుకున్నారు. శ్రీహాన్ రేవంత్ ఇద్దరూ ఉండగా నాగార్జున 40 లక్షల ఆఫర్ చేయడంతో శ్రీహన్ గోల్డెన్ బ్రీప్ కేస్ అందుకొని 40 లక్షలు సొంతం చేసుకోగా రేవంత్ మాత్రం ట్రోఫీ ముఖ్యమని తాను ట్రోఫీ అందుకొని విజేతగా నిలబడ్డారు.

ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం విజేతగా రేవంత్ కప్పు అందుకోగా రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ మాత్రం 40 లక్షల క్యాష్ అందుకున్నారు. అయితే ప్రతి సీజన్లోనూ ఇదే కదా జరిగేది అనుకుంటే పొరపాటే కానీ ఈ సీజన్లో మాత్రం నాగార్జున అందరికీ చివరిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.40 లక్షల అందుకున్న శ్రీహన్ కప్పు అందుకున్న రేవంత్ ఇద్దరూ కూడా ఈ సీజన్ విజేతలని ప్రకటించారు.

ఇలా వీరిద్దరికి ప్రైజ్ మనీ ట్రోఫీ అందించిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28 బిగ్ బాస్ సీజన్లు జరగగా ఏ సీజన్లోనూ జరగని విధంగా బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా తెలుగు సీజన్ సిక్స్ కార్యక్రమంలో ఇద్దరు విజేతలుగా నిలిచారు.ఇక వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది కనుక ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ విజేతగా నిలిచారని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీహాన్ ఎమోషనల్ అవుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.


Bigg Boss6: ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉన్న శ్రీహాన్..

ఒకవేళ శ్రీహాన్ 40 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకోకపోయి ఉంటే తప్పనిసరిగా కప్పు శ్రీహాన్ అందుకునేవారని అయితే ఆయన బ్రీఫ్ కేస్ తీసుకొని రేవంత్ ట్రోఫీ తీసుకోవడంతో ఈ సీజన్లో ఇద్దరు విజేతలుగా నిలిచారని చెప్పాలి. మొత్తానికి ఈ సీజన్ లో ఇద్దరూ విజేతలుగా నిలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Bigg Boss6: తనని గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది… మనసులో కోరిక బయటపెట్టిన ఇనయ!

Bigg Boss6: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం నాలుగు వారాలను పోటీ చేసుకుని ఐదవ వారంలో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి నలుగురు కంటెస్టెంట్ లు బయటకు వెళ్లారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ బర్తడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఎంతో ఫన్ అందించారు.అదేవిధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల కోరికలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోరికలను చెప్పమని చెప్పగా ఒక్కొక్కరు వారి కోరికలను బయటపెడుతూ ఎమోషనల్ అయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీహాన్ అనాధలకు భోజనం పెట్టాలని భావించారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వల్ల సిరికి ఆ పని పూర్తి చేయమని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.అదేవిధంగా బాలాదిత్య హౌస్ నుంచి బయటకు వెళ్ళగానే తన కూతురికి పేరు పెడతానని చెప్పారు.

తన కుటుంబ సభ్యులందరూ మాట్లాడినటువంటి ఒక వీడియో పంపిస్తే చాలు అంటూ పింకీ తన కోరిక బయటపెట్టింది. అమ్మ వాళ్లు మాట్లాడినటువంటి ఒక వీడియో చూపిస్తే చాలు అంటూ ఫైమా తన కోరిక బయటపెట్టింది.ఇలా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు వారి వారి కోరికలను బయట పెట్టగా ఇక ఇనయ మాత్రం తన కోరికను బయట పెడుతూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss6 : కెప్టెన్ గా రేవంత్..

ఈ సందర్భంగా ఇయన సుల్తానా తన కోరికను బయటపెడుతూ.. తన తల్లి బిగ్ బాస్ హౌస్ కి వస్తే తనని గట్టిగా హాగ్ చేసుకుని ఏడవాలని ఉంది.తనని నాన్న అంత బాగా చూసుకోలేనేమో కానీ నాన్న గుర్తుకు రాకుండా మాత్రం తనని చూసుకోగలను అంటూ ఈ సందర్భంగా ఇనయా సుల్తానా తన కోరికను బయట పెడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వారం కెప్టెన్సీ కండెన్సర్ టాస్క్ లో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్ లు పోటీపడిగా రేవంత్ కెప్టెన్ గా నిలిచినట్టు తెలుస్తుంది.

Neha Chowdary: రేవంత్ నామినేట్ చేయడం వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను.. రేవంత్ పై నేహా షాకింగ్ కామెంట్స్!

Neha Chowdary: బిగ్ బాస్ కార్యక్రమం మూడవ వారం పూర్తి కావడంతో మూడవ వారంలో ఇంటి నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె ఎలిమినేషన్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. స్పోర్ట్స్ యాంకర్ గా ఎంతో ఫాలోయింగ్ ఉన్నటువంటి నేహా ఎలిమినేట్ కావడం ఏంటి అని అందరూ భావించారు. అయితే ఈమె ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ వేదికపై ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన నేహా చౌదరి బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరోసారి తన ఎలిమినేషన్ పై ఎమోషనల్ అయ్యి ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. హౌస్ లో కొంతమంది మినహా మిగిలిన అందరూ కూడా బిగ్బాస్ ఇచ్చే టాస్క్ లో ఎలాగైనా గెలవాలని తప్పుడు మార్గంలో ఆడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ తో తనకు జరిగిన గొడవ గురించి నేను అతనికి క్లారిటీ ఇచ్చాను అయినా తనని నామినేట్ చేశారు.రేవంత్ ఆరోజు నామినేట్ చేయడం వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా రేవంత్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రేవంత్ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఈమె అతనిపై ఆరోపణలు చేశారు.

Neha Chowdary: గెలవడం కోసం అడ్డదారులు వెతుకుతున్నారు..

ఇక బిగ్ బాస్ హౌస్ లో గీతు రాయల్ తనపై గెలవడం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉందని అయితే తన పద్ధతి ఏమాత్రం బాగా లేదంటూ ఈమె ఆరోపణలు చేశారు. సుదీప, బాలాదిత్య, చంటి, శ్రీహాన్, ఆదిరెడ్డి,శ్రీ సత్య వంటి కొందరు కంటెస్టెంట్లు మాత్రమే ఈ ఆటను సక్రమంగా ఆడుతున్నారు మిగిలిన వారంతా కూడా గెలవడం కోసం ఏం చేయడానికైనా వెనకాడరు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Neha Chowdary: అతని వల్లే నేను ఎలిమినేట్ అయ్యా.. బిగ్ బాస్ వేదికపై ఎమోషనల్ అయిన నేహా చౌదరి!

Neha Chowdary: బిగ్ బాస్ కార్యక్రమం ముచ్చటగా మూడవ వారం పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నామినేషన్స్ లో 9 మంది ఉండగా డేంజర్ పొజిషన్లో ఉన్నటువంటి ఇనయ, వాసంతి, నేహా చౌదరి ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి మూడవ వారం నేహా చౌదరి బయటకు వచ్చారు.

ఎలిమినేషన్ టాస్క్ లో భాగంగా చివరిగా వాసంతి నేహా శర్మ మాత్రమే మిగిలిపోయారు. వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేసి మరొకరిని బయటకు పంపించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే తులాభారం టాస్క్ లో భాగంగా వారిద్దరి ఫోటోలలో ఎవరు తక్కువ వెయిట్ ఉంటే వాళ్లు ఎలిమినేట్ అయినట్టు అని నాగార్జున చెప్పడంతో చివరికి నేహా శర్మ బయటకు వచ్చింది.

ఈ విధంగా ఈమె బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన అనంతరం తన ఏవి చూసినా తర్వాత ఈమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ఇక్కడ నిలబడ్డాను అంటే అందుకు గల కారణం రేవంత్. రేవంత్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యానంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.ఇక బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎంతో మంచి బాండింగ్ ఏర్పడినటువంటి వ్యక్తి రాజశేఖర్ గురించి కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Neha Chowdary: రాజశేఖర్ తో ఉన్న బాండింగ్ గుర్తుచేసుకొని ఎమోషనల్ అయినా నేహా…

ఈ క్రమంలోనే నేహా చౌదరి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు నుంచి తన లైఫ్ లోకి ఏ అబ్బాయిని రానివ్వలేదని,అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ తో తనకు మంచి బాండింగ్ ఏర్పడిందని అయితే నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా మన ఈ ఫ్రెండ్ షిప్ ఇలాగే కొనసాగిద్దాము అక్కడ కూడా నీకు బాడీగార్డ్ గా ఉంటాను అంటూ ఈ సందర్భంగా రాజశేఖర్ తో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి బయట పెడుతూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss6: దొంగలతో కలిసి పోలీసులను గెలిపిస్తానని శపథం చేసిన రేవంత్.. మరి గెలిపించారా?

Bigg Boss6: బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం మూడో వారం ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఈ వారంలో భాగంగా కెప్టెన్సీ టెస్ట్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులను దొంగ పోలీసులుగా విడదీస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ టాస్క్ కొనసాగుతుండగా దొంగల టీంలో ఏమాత్రం యూనిటీ లేకపోవడంతో వాళ్ల మధ్య వాళ్లకే గొడవలు జరుగుతున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా గీతుతో రేవంత్ కుదుర్చుకున్న డీల్ పై అనుమానం వచ్చిన దొంగలు రేవంత్ దాచుకున్న బొమ్మలను వాళ్లే దొంగలిస్తారు.

ఈ విధంగా రేవంత్ బొమ్మలను దొంగతనం చేయడానికి శ్రీ సత్య కూడా సహాయం చేస్తుంది అయితే తాను దాచుకున్న బొమ్మలు దొంగలే దొంగతనం చేశారని తెలియడంతో రేవంత్ ఆశ్చర్యపోతాడు. ఇక ఈ విషయం తెలిసిన రేవంత్ ఎలాగైనా పోలీసులను గెలిపించాలని శపథం చేస్తాడు.

Bigg Boss6: నేను చాలా కన్నింగ్ అని ఒప్పుకున్న రేవంత్..

నిద్రపోదాం అనుకున్నాను కానీ నిద్ర పోను నేను వాళ్ళ కన్నా కన్నింగ్ ఇలా దాచుకున్న బొమ్మలను దొంగతనం చేయడానికి మినిమం కామన్ సెన్స్ ఉండాలి అంటూ ఈయన మండిపడ్డారు. అంతేకాకుండా రేవంత్ తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను పోలీసులకు ఇవ్వడానికి సిద్ధపడతారు. దీంతో సుదీప మాట్లాడుతూ నీ వరకు వచ్చేసరికి గేమ్ వచ్చిందా.నువ్వు టీ మొత్తాన్ని డిస్క్ క్వాలిఫై చేస్తావా అంటూ తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయితే రేవంత్ మాత్రం తన అనుకున్నదే చేయాలని మొండి పట్టు పడ్డారు. ఈయన నిజంగానే దొంగల టీం తో కలిసి పోలీసులను గెలిపించారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Bigg Boss 6: శృతి మించిన బిగ్ బాస్ కంటెస్టెంట్… పచ్చి బూతులు మాట్లాడిన రేవంత్!

Bigg Boss 6: గతవారం నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ తిని పడుకోవడానికి ఇక్కడికి వచ్చారా ఇలాగైతే ఇప్పుడే బయటకు వెళ్లిపోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కాస్త శృతిమించడంతో కంటెస్టెంట్ల వెంట బూతు పదాలు రావడంతో నేటిజనులను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది.

ఈవారం బిగ్ బాస్ హౌస్లో దొంగ పోలీస్ టాస్క్ నిర్వహించారు.ఈ టాస్క్ లో భాగంగా కొందరినీ పోలీసులు గాను కొందరిని దొంగలుగా విభజించి అడవిలో ఆట అనే గేమ్ స్టార్ట్ చేశారు. ఈ ఆటలో భాగంగా ఆరోహి తీవ్రంగా గాయపడ్డారు.ఈ క్రమంలోనే ఆమె బాధపడటంతో తనని హౌస్ లోకి తీసుకువెళ్లడం వెంటనే ఇనయా సుల్తానా సింపతి గేమ్ అంటూ మాట్లాడటంతో వెంటనే శ్రీ సత్య తన కాలికి నిజంగానే దెబ్బ తగిలింది అంటూ చెప్పుకొచ్చారు.


Bigg Boss 6: నాగార్జున మీరు హ్యాపీ కదా…

ఇంతటితో ఆగకుండా ఇనయా లాగింది వాడే అంటూ శ్రీహాన్ వైపు చూపిస్తూ నోరు పారేసుకుంది. దీంతో శ్రీహాన్ రెచ్చిపోయి వాడు వీడు అంటే బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.దీంతో రేవంత్ మధ్యలోకి వచ్చి మొన్న కూడా నన్ను ఇలాగే వాడు అంది అప్పుడే లాగి కోయాల్సింది అంటూ పచ్చి బూతులు మాట్లాడారు.మీ ఇంట్లో నీకు కామన్ సెన్స్ నేర్పించలేదా అంటూ కుటుంబ సభ్యుల గురించి కూడా రేవంత్ ప్రస్తావించడంతో హౌస్ లో పెద్ద ఎత్తున రచ్చ మొదలైంది. ఇది చూసిన నేటిజన్స్ నాగార్జున ఇక హ్యాపీ కదా మొత్తానికి నీ కోరిక నెరవేరింది అంటూ పెద్ద ఎత్తున నాగార్జునపై కూడా విమర్శలు చేస్తున్నారు నేటిజన్స్.

Bigg Boss6: కళ్ళ ముందే ఫైర్ యాక్సిడెంట్ లో అమ్మను కోల్పోయాను… ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్న!

Bigg Boss6: బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం రోజురోజుకు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వహించే టాస్కులతో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతూ వారి జీవితంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ రెండవ వారంలో భాగంగా సిసింద్రీ టాస్క్ పూర్తి కాగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక బేబీ ఉండటం అది వారి జీవితాన్ని ఎలా మార్చిందనే విషయాల గురించి తెలపాలని సూచించారు.

ఈ క్రమంలోనే సుదీప 2015లో తనకు ఒకసారి ప్రెగ్నెన్సీ కన్సివ్ అయిందని థైరాయిడ్ కారణంగా బేబీని వదులుకోవాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు.అదేవిధంగా రేవంత్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు అయితే ప్రస్తుతం తన భార్య సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఎప్పుడు నాన్న అని పిలిపించుకుంటానా అని ఎదురు చూస్తున్నానని తెలిపారు.

ఇక మెరీనా రోహిత్ దంపతులు కూడా తమ బేబీని కోల్పోయిన సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.త్రీ మంత్స్ తర్వాత బేబీ హార్ట్ బీట్ లేదని చెప్పగా వేరే దారి లేక బేబీనీ కోల్పోయామని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక కీర్తి భట్ సైతం బిగ్ బాస్ వచ్చేముందు తన కూతురు లేదని వార్త తెలిసింది అయితే చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss6: ఒక్కసారిగా ఎమోషనల్ అయినా కంటెస్టెంట్స్..

అందరిని ఎప్పుడు నవ్విస్తూ ఉండేటటువంటి చలాకి చంటి జీవితంలో కూడా విషాద ఘటన ఉంది. తాను చూస్తుండగానే తన తల్లి ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిందని ఒక్కడినే దాదాపు రెండు గంటల పాటు ఏడుస్తూ ఉన్నాను. ఇలా నా తల్లి చనిపోతే నా జీవితంలోకి ఇద్దరు అమ్మలు వచ్చారంటూ ఈయన తన తల్లి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో జరిగిన సంఘటనలను చెప్పడంతో మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.

Bigg Boss6: రెండు రోజే బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టుకున్న రేవంత్.. ఏం పరిస్థితి తెచ్చావు దేవుడా అంటూ ఎమోషనల్!

Bigg Boss6:బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమై రెండు రోజుల కూడా కాలేదు అప్పుడే ఇంట్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున పోటీ పడటమే కాకుండా మైండ్ గేమ్ ఆడుతూ తమని తాము ప్రూఫ్ చేసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కంటెస్టెంట్ల మధ్య గొడవలు అలకలు ఏడవడం అప్పుడే మొదలయ్యాయని చెప్పాలి. ఇకపోతే ఇంటి సభ్యులను బిగ్ బాస్ క్లాస్, మాస్, ట్రాష్ అని మూడు క్యాటగిరీలుగా విభజించిన విషయం మనకు తెలిసిందే.

ఇక బిగ్ బాస్ హౌస్ సభ్యులకు చాలెంజ్ చేస్తూ సభ్యుల మధ్య పోటీ నిర్వహించాడు. ఈ క్రమంలోని హౌస్ లోకి ఎన్నో అంచనాల నడుము అడుగుపెట్టిన సింగర్ రేవంత్ ఈ చాలెంజ్ కు ముందు లేదా తర్వాత తెలియదు కానీ ఈయన వాష్ రూమ్ దగ్గరకు వెళ్లి కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇలా రేవంత్ ఏడవడంతో వెంటనే రోహిత్ వెళ్లి తనని ఓదార్చారు.

ఇక మరొక గేమ్ లో నేహా ఇనయ పోటీ పడగా.. ఇందులో ఇనయ సుల్తాన్ గెలవడంతో నేహా ఈ హౌస్ లో తనకు ఎవరు సపోర్ట్ చేసేవారు లేరంటూ ఫీల్ అయ్యారు. మరోవైపు మెరీనా రోహిత్ మధ్య గొడవ చోటు చేసుకోవడంతో రోహిత్ తన భార్య మెరీనా పై చిందులు వేశారు. ఇక అనంతరం బిగ్ బాస్ కెమెరాల వైపు చూస్తూ రేవంత్ ఏం పరిస్థితి తెచ్చావు స్వామి బిగ్ బాస్ అంటూ మాట్లాడారు.

Bigg Boss6: కంటెస్టెంట్ల మధ్య మొదలైన గొడవలు పోట్లాటలు…

ఈ విధంగా రెండవ రోజే రేవంత్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈయన ఏదైనా గొడవ కారణంగా కంటతడి పెట్టుకున్నారా లేకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రావడంతో ఎమోషనల్ అయ్యారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రెండు రోజులకి బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ ఇచ్చి భారీగా గొడవలు పెడుతున్నట్టు తెలుస్తుంది.