Movie News

Neha Chowdary: రేవంత్ నామినేట్ చేయడం వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను.. రేవంత్ పై నేహా షాకింగ్ కామెంట్స్!

Neha Chowdary: బిగ్ బాస్ కార్యక్రమం మూడవ వారం పూర్తి కావడంతో మూడవ వారంలో ఇంటి నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె ఎలిమినేషన్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. స్పోర్ట్స్ యాంకర్ గా ఎంతో ఫాలోయింగ్ ఉన్నటువంటి నేహా ఎలిమినేట్ కావడం ఏంటి అని అందరూ భావించారు. అయితే ఈమె ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ వేదికపై ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

 

ఇలా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన నేహా చౌదరి బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరోసారి తన ఎలిమినేషన్ పై ఎమోషనల్ అయ్యి ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. హౌస్ లో కొంతమంది మినహా మిగిలిన అందరూ కూడా బిగ్బాస్ ఇచ్చే టాస్క్ లో ఎలాగైనా గెలవాలని తప్పుడు మార్గంలో ఆడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ తో తనకు జరిగిన గొడవ గురించి నేను అతనికి క్లారిటీ ఇచ్చాను అయినా తనని నామినేట్ చేశారు.రేవంత్ ఆరోజు నామినేట్ చేయడం వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా రేవంత్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రేవంత్ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఈమె అతనిపై ఆరోపణలు చేశారు.

Neha Chowdary: గెలవడం కోసం అడ్డదారులు వెతుకుతున్నారు..

ఇక బిగ్ బాస్ హౌస్ లో గీతు రాయల్ తనపై గెలవడం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉందని అయితే తన పద్ధతి ఏమాత్రం బాగా లేదంటూ ఈమె ఆరోపణలు చేశారు. సుదీప, బాలాదిత్య, చంటి, శ్రీహాన్, ఆదిరెడ్డి,శ్రీ సత్య వంటి కొందరు కంటెస్టెంట్లు మాత్రమే ఈ ఆటను సక్రమంగా ఆడుతున్నారు మిగిలిన వారంతా కూడా గెలవడం కోసం ఏం చేయడానికైనా వెనకాడరు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago