Tag Archives: rrr

Ramcharan: జపాన్ లో చరణ్ చాక్లెట్స్.. రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా?

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఆధర అభిమానాలను సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాని జపాన్ లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 21వ తేదీ ఈ సినిమాని జపాన్ లో ఎంతో ఘనంగా విడుదల చేశారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం రామ్ చరణ్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు.అయితే జపాన్ లో రామ్ చరణ్ కు ఎంతో మంచి ఆదరణ లభించింది. జపాన్ లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం రామ్ చరణ్ దంపతులు జపాన్ వీధులలో సందడి చేశారు.

ఇకపోతే రామ్ చరణ్ అనంతరం ఒక స్కూల్ కి ముఖ్య అతిథిగా వెళ్ళగా అక్కడ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడమే కాకుండా విద్యార్థులు ప్రత్యేకమైన కానుకలను అందజేశారు. అదేవిధంగా జపాన్ లో ఒక షాప్ లో రామ్ చరణ్ ఫోటోతో కలిగే ఉన్నటువంటి చాక్లెట్లను చూసిన రామ్ చరణ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్…

Ramcharan:

ఈ విధంగా జపాన్ లో చాక్లెట్ పై తన ఫోటో ఉండడం చూసి హీరో రామ్ చరణ్ మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమాతో సంపాదించుకున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

Tolly wood Top Most Profitable Movies: బాహుబలి నుంచి కార్తికేయ 2 వరుకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాలీవుడ్ సినిమాలివే?

Tolly wood Top Most Profitable Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో సినిమాలు విడుదలవుతూ పెద్ద ఎత్తున బాక్సాఫీస్ వద్ద భారీ   కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు విడుదలవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే బాహుబలి సినిమా నుంచి తాజాగా విడుదలైన కార్తికేయ 2 సినిమా వరకు ఏ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టిందో ఇక్కడ తెలుసుకుందాం…

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల బిజినెస్ చేయగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 860 కోట్ల షేర్స్ రాబట్టింది. ఇక బాహుబలి ది బిగినింగ్ తెలుగులో 191 కోట్ల రూపాయల షేర్స్ రాబట్టింది. అన్ని భాషలలో కలిపి 311 కోట్ల షేర్స్ రాబట్టింది. రెండు భాగాలు కలిపి నిర్మాతలకు 694 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా అన్ని ఏరియాలలో కలిపి 451 కోట్లకు అమ్మారు. ఇక అన్ని ఏరియాలలో కలిపి ఈ సినిమా 111.41 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 613.06 కోట్ల షేర్స్ రాబట్టింది.

అలా వైకుంఠపురం: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా 85 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా ఈ సినిమా మొత్తంగా 160.37 కోట్ల రాబట్టింది. నిర్మాతలకు 75.88 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

ఎఫ్2: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 34.5 కోట్ల జరుపుకోగా ఓవరాల్ గా ఈ సినిమా 80 కోట్ల రూపాయల వరకు షేర్స్ రాబట్టింది.

పుష్ప: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా 6 వారాల్లో ఈ సినిమాకు రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకువచ్చింది.

Tolly wood Top Most Profitable Movies: మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు:

మహేష్ బాబు రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా . 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 39.36 కోట్ల లాభాలను అందుకుంది

కార్తికేయ2: నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఇటు సౌత్ ఇండస్ట్రీలోను అటు నార్త్ ఇండస్ట్రీలో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా 36 కోట్ల షేర్ రాబట్టింది.ఇక ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో టాప్ టెన్ స్థానంలో కొనసాగింది.

Jr.NTR: మొదటి సినిమాకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో తారక్ ఏం చేశారో తెలుసా?

Jr.NTR: నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించి ఉత్తమ బాల నటుడిగా అవార్డు తీసుకున్నారు. బాలనటుడిగా మెప్పించి 17 సంవత్సరాలకే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈయన హీరోగా మొదటిసారిగా నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

2001 లో వచ్చిన ఈ సినిమాలో రవీందర్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి పరవాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో నటించారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఈ సినిమా నుంచి వెనుతిరిగి చూసుకోలేదు.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్ తన మొదటి సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

మొదటి పారితోషికాన్ని తల్లి చేతిలో పెట్టిన తారక్…

ఎన్టీఆర్ తన మొదటి సినిమాకు గాను అక్షరాల 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.17 సంవత్సరాల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అంటే పెద్ద మొత్తమే అని చెప్పాలి.ఈ విధంగా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న ఎన్టీఆర్ ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఆ డబ్బు తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టారు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకొని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Chalaki Chanti: కొమరం భీముడో పాటను మద్యం పాటగా మార్చేసిన చలాకి చంటి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్!

Chalaki Chanti: బుల్లితెరపై ప్రసారం అవుతూ అద్భుతమైన కామెడి ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్స్ తమ అద్భుతమైన కామెడీ స్కిట్ ద్వారా ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తూ ఉంటారు.ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో పై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రోమోలో భాగంగా ముఖ్యంగా చలాకి చంటి చేసిన స్కిట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎంతో ఎమోషన్ కూడగట్టుకొని పాడిన కొమరం భీముడో పాట ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ పాటలో ఎన్టీఆర్ నటించడం కాకుండా జీవించాడని అందరూ ప్రశంసలు కురిపించారు. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో చలాకి చంటి ఈ పాటను ఏకంగా మందు పాటగా మార్చేశాడు.

కొమరం భీముడో పాటను చలాకి చంటి మందు పాటగా మారుస్తూ…విస్కీదేవాలా బ్రాండీ దేవాలా.. గ్లాసుల ఐసేసీ మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. బుట్ట ప‌క్క‌నా కోడిని చూడాలా.. కోడిని దీసుకొచ్చీ కోసీ వండాలా.. సుక్క సుక్క‌కీ ముక్క ముక్క‌తో జుర్రుకోవాలా.. దొబ్బితాగాలా.. అంటే పూర్తిగా మందు పాటగా మార్చేశాడు. ఈ క్రమంలోనే ఈ పాటకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొమరం భీమ్ పాట..

ఇక ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ అభిమానులు చలాకి చంటి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా ఈ పాట పాడి అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఇలా ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉండే ఒక పాటను చలాకి చంటి ఇలా మందుతో పోల్చి పాడటం ఏంటి? ఎంతో గొప్ప సందర్భంలో ఎన్టీఆర్ పాడిన ఈ పాటను తాగుబోతుల పాటగా చలాకి చంటి పాడటంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో చలాకి చంటి స్కిట్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vijayendra Prasad: వక్రీకరించడం అంటే దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ చేసింది.. ‘ఆర్ఆర్ఆర్’ అలా కాదు : విజయేంద్ర ప్రసాద్

Vijayendra prasad: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రాజమౌళి ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ఈ చిత్రం ద్వారా వక్రీకరిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Vijayendra prasad: వక్రీకరించడం దానవీర శూరకర్ణ .. ఆర్ఆర్ఆర్ కాదు: విజయేద్రప్రసాద్

ఈ క్రమంలోనే ఈ విమర్శలపై రాజమౌళి తండ్రి సినీ రచయిత విజయేంద్రప్రసాద్ స్పందించారు. ఈ సినిమాలో స్వాతంత్ర సమరయోధులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను తాము వక్రీకరించడం లేదని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

Vijayendra prasad: వక్రీకరించడం దానవీర శూరకర్ణ .. ఆర్ఆర్ఆర్ కాదు: విజయేద్రప్రసాద్

మేము కేవలం వారి పాత్రలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సరికొత్త కథను తయారు చేసాము అంతేకాకుండా ఈ సినిమాలో వారికి ఎలాంటి గౌరవ భంగం కలగకుండా చిత్రీకరించామని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో సందర్భంగా యాంకర్ దాన వీర శూర కర్ణ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు.

మహాభారతంలో ఎక్కడా లేదు…

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దానవీరశూరకర్ణ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని చెబుతున్నాను. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు జన్మ వృత్తాంతం గురించి చెబుతారు.నువ్వు ద్రౌపది పై మోజు పడ్డావు కదా ఆమెను ఆరో భర్తగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ సన్నివేశం ఆ సినిమాలో ఉంది కానీ మహాభారతంలో ఎక్కడా లేదని వక్రీకరించడం అంటే ఇదని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ దాన వీర శూర కర్ణ సినిమా గురించి ప్రస్తావించారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. విడుదలయ్యేది ఎప్పుడంటే?

RRR Movie: రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

RRR Movie: ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. విడుదలయ్యేది ఎప్పుడంటే?

ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 7వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారని పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేశారు. కేవలం సినిమా ప్రమోషన్ కోసమే 45 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉందనగా చిత్రబృందం అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. విడుదలయ్యేది ఎప్పుడంటే?

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా వేసినట్లు నిర్మాత అధికారకంగా తెలియజేస్తూ అభిమానులలో నిరాశ కల్పించారు.ఈ క్రమంలోనే విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసిన చిత్రబృందం నేడు అధికారికంగా ఈ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఎలాంటి ఆంక్షలు లేని సమయంలోనే విడుదల…

ఈ క్రమంలోనే నిర్మాత డివివి దానయ్య ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాని మార్చి 18వ తేదీ విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకవేళ ఈ తేదీకి కుదరని పక్షంలో ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీకి విడుదల చేస్తామని అప్పటికీ కరోనా పూర్తిస్థాయిలో తగ్గి థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చిత్ర బృందం భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ 2 తేదీలలో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాత తెలియచేసారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ రెమ్యూనరేషన్స్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!

RRR Movie: ఇండియా మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం చాలా మంది ప్రేక్షకులను నిరాశ పరిచింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళమాళం భాషలతో పాటు వివిధ భాషల్లో జనవరి 7న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా సినిమా మరోసారి వాయిదా పడింది. 

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా…!

ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజుగా నటించారు. దీంతో ఈ పిరియాడిక్ డ్రామా మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ టీజర్ ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచాయి. దీంతో పాటు బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్ గన్, అలియా భట్ నటిస్తుండటంతో మూవీపైన భారీ బజ్ క్రియేట్ అయింది. 

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా…!

RRR Movie : బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ..

దాదాపుగా 500 కోట్ల వ్యయంతో ఈ మూవీని తెరకెక్కించారు. అందులో రూ. 200 కోట్ల వరకు స్టార్ల రెమ్యునరేషన్ కే కేటాయించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజయ్ దేవ్ గన్, అలియా భట్ ల రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. సినిమాలో కీలక పాత్రల కోసం వీరిద్దరిని ఎంచుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేయడంతో పాటు.. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండటంతో వీరిద్దరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం 7 రోజుల నటించినందుకే.. అజయ్ దేవ్ గన్ కు రూ. 35 కోట్లు ముట్టచెప్పినట్లు టాక్. ఇదిలా ఉంటే అలియా భట్ కు రూ. 9 కోట్లు ఇచ్చారట. మూవీలో అలియాభట్ పాత్ర కేవలం 20 నిమిషాలే ఉంటుందట. ఇంతలా భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటింపచేశారు.

RRR Movie: వామ్మో.. ఆర్ఆర్ఆర్ సినిమాకు 500 కోట్ల ఆఫర్ ప్రకటించిన ఓటీటీ సంస్థ.. మేకర్ స్పందన ఏమిటంటే?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అద్భుతమైన కథాంశంతో సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.అయితే కరోనా కారణం వల్ల ఇప్పటికే ఈ సినిమా నాలుగు సార్లు విడుదల వాయిదా పడింది.

RRR Movie: వామ్మో.. ఆర్ఆర్ఆర్ సినిమాకు 500 కోట్ల ఆఫర్ ప్రకటించిన ఓటీటీ సంస్థ.. మేకర్ స్పందన ఏమిటంటే?

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసిన నిర్మాతకు ఫైనాన్షియర్ నుంచి అధిక ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా విడుదల విషయంలో నిర్మాత కాస్త టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఫైనాన్షియర్ దగ్గర నుంచి నిర్మాత తీసుకున్న 180 కోట్ల రూపాయలకు తాను బాధ్యుడిగా ఉంటానని రాజమౌళి చెప్పినట్లు సమాచారం.

RRR Movie: వామ్మో.. ఆర్ఆర్ఆర్ సినిమాకు 500 కోట్ల ఆఫర్ ప్రకటించిన ఓటీటీ సంస్థ.. మేకర్ స్పందన ఏమిటంటే?

ఎన్నో అంచనాల నడుమ జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయటానికి 500 కోట్లు ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం.

ఈ సినిమా వారిద్దరికీ మంచి హిట్ ఇస్తుంది..

ఇలా ఓటీటీ సంస్థ 500 కోట్ల ఆఫర్ చేయడం అంటే భారీ మొత్తమే అని చెప్పాలి. ఇంత మొత్తంలో ఆఫర్ ప్రకటించినప్పటికీ మేకర్స్ మాత్రం ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ప్రేక్షకులలో ఏమాత్రం అంచనాలు తగ్గడం లేదని, ఈ సినిమా థియేటర్లలో విడుదల అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ కు అద్భుతమైన హిట్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే
ఓటీటీ సంస్థ ప్రకటించిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు.

Junior NTR: జక్కన్న బిర్యానీ..అలియాభట్ ఇరానీ బన్ మస్కా..మరి చరణ్..?

Junior NTR: ఇండియా మొత్తం చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. అయితే జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేద్దాం అనుకన్నప్పటికీ.. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లను మాత్రం భారీ ఎత్తున చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ లతో పాటు బాలీవుడ్ లోనూ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లను పెద్ద ఎత్తున చేసింది.

పిరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా…రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.

ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను బాలీవుడ్ నటి సాహెబా బాలీ ఇంటర్వ్యూ చేశారు. దీనికోసం హైదరాబాద్ వచ్చిన నటి సాహెబా బాలీకి హైదరాబాద్ బిర్యానీతో పాటు తెలంగాణ చేపల పులుసు, గుంటూరు చికెన్‌ను వడ్డించారు. వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. మీరు నిజమైనా పులితో ఫైట్ చేశారా..అని సాహెబా ప్రశ్నించగా..‘ఏమో.. అయిండొచ్చు, కాకపోవచ్చు’ అంటూ తారక్‌ సమాధానం ఇచ్చారు. మీకు ఎన్ని భాషలు వచ్చు అని అడగ్గా.. ఎన్టీఆర్ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు అని సమాధానం ఇచ్చాడు. 

రాజమౌళిని బిర్యానీతో పోల్చారు..


అయితే ఈ ఇంటర్వ్యూలో తారక్ ట్రిపుల్ ఆర్ టీంకు పలు రకాల వంటలని సెలెక్ట్ చేశారు. రాజమౌళిని బిర్యానీతో పోల్చారు. బిర్యానీ చూడటాని సింపుల్ గా ఉంటుంది కానీ దీన్ని తయారు చేయాలంటే కష్టపడాలని అన్నారు. రాజమౌళి కూడా అంతే.. చూడటానికి సింపుల్ గా ఉంటాడు కానీ.. పని విషయంలో ఫర్ఫక్ట్ గా ఉంటాడని చెప్పాడు. పానిపూరీ నోట్లో వేసుకోగానే.. దాని ఫ్లేవర్లు బయటపడుతాయని.. చరణ్ కూడా ఇంతే అని.. తనతో మాటలు కలిపితే అన్ని విషయాలు పంచుకుంటాడని చెప్పాడు. అలియా భట్ ఇరానీ బన్ మస్కా వంటిదని ఎంతో ఆరోగ్యవంతమైనదని.. అలియా కూడా చాలా ప్రత్యేకమైనదని అన్నాడు. అజయ్ దేవ్ గన్ కు వడాపావ్ సెలెక్ట్ చేశాడు. ముంబై లోెకల్ ఫుడ్. అక్కడి వారికి ఇది ఖచ్చితంగా కావాల్సిందే అని.. అలాగే అజయ్ దేవ్ గన్ అందరికి కావాల్సిన వాడే అని అన్నారు.

Bheemla Nayak: ఆర్ఆర్ఆర్ వాయిదా పడిందిగా… భీమ్లా నాయక్ సినిమాను ముందుకు తెండి.. పవన్ ఫాన్స్ డిమాండ్!

Bheemla Nayak: దేశవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీ విడుదల అవుతున్నట్టు చిత్ర బృందం ప్రకటించడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్ర బృందం అభిమానులకు చేదు వార్త తెలియజేస్తూ ఈ సినిమా విడుదల వాయిదా పడిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా వాయిదా పడుతుందనే విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎంతో సంతోషపడ్డారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కినప్పటికీ ఈ సినిమా జనవరి 7న విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ ఫోన్ చేయించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా పడింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రాజమౌళి సినిమా పై దాడి చేశారు.

Bheemla Nayak: ఆర్ఆర్ఆర్ వాయిదా పడిందిగా… భీమ్లా నాయక్ సినిమాను ముందుకు తెండి.. పవన్ ఫాన్స్ డిమాండ్!

అయితే ఈ సినిమా ఒమిక్రాన్ వల్ల వాయిదా పడిన విషయం తెలియడంతో పవన్ అభిమానులు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒమిక్రాన్ వల్ల వాయిదా పడటంతో ఆ తర్వాత విడుదల కావాల్సిన ప్రభాస్ రాధేశ్యామ్ కూడా వాయిదా పడుతుందని వార్తలు వినబడుతున్నాయి.

పండగ చేసుకుంటున్న చిన్న సినిమాలు…

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు పండగ చేసుకుంటున్నాయి. ఇలా నాగార్జున బంగార్రాజు, హీరో, రౌడీ బాయ్స్ వంటి చిత్రాలు సంక్రాంతి బరిలో దిగటానికి సిద్ధం అయ్యాయి. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఈ సినిమా విడుదల ఉండదని హింట్ ఇచ్చిన అభిమానులు మాత్రం ఈ సినిమా విడుదలపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.