Jr.NTR: నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించి ఉత్తమ బాల నటుడిగా అవార్డు తీసుకున్నారు. బాలనటుడిగా మెప్పించి 17 సంవత్సరాలకే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈయన హీరోగా మొదటిసారిగా నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
2001 లో వచ్చిన ఈ సినిమాలో రవీందర్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి పరవాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో నటించారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఈ సినిమా నుంచి వెనుతిరిగి చూసుకోలేదు.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్ తన మొదటి సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
ఎన్టీఆర్ తన మొదటి సినిమాకు గాను అక్షరాల 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.17 సంవత్సరాల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అంటే పెద్ద మొత్తమే అని చెప్పాలి.ఈ విధంగా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న ఎన్టీఆర్ ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఆ డబ్బు తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టారు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకొని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…