Lavanya Tripathi: సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరో హీరోయిన్లకు సినిమాలలో నటించే అవకాశం వచ్చిన పలు కారణాల వల్ల కొన్ని సార్లు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీలు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లావణ్య త్రిపాఠి సైతం తనకొచ్చిన ఓ సినిమా ఆఫర్ వదులుకొని పెద్ద తప్పు చేసిందని చెప్పాలి. ఈ సినిమా కనుక చేసి ఉంటే లావణ్య త్రిపాఠి ఎప్పుడో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయేది.
అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక నాచురల్ స్టార్ నాని సరసన ఈమె నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమా ద్వారా కూడా మంచి గుర్తింపు పొందిన ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరలేదు.
ఇలా పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ అగ్రతారగ పేరు సంపాదించలేకపోయిన లావణ్య త్రిపాఠి తన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాని వదులుకుందని తెలుస్తోంది.పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన గీతాగోవిందం సినిమాలో ముందుగా నటించే అవకాశం లావణ్య త్రిపాఠికే వచ్చిందట.
ఈ సినిమా అవకాశం వచ్చిన సమయంలో లావణ్య త్రిపాఠి పలు కారణాలవల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు లావణ్య రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం రష్మిక అందుకుంది.ఇలా రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి కనక ఈ సినిమా చేసి ఉంటే ఆమె కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్రతారగా ఉండేదని నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా లావణ్య త్రిపాటి హ్యాపీ బర్త్ డే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…