Tag Archives: srikanth

Malavika: మా పేరెంట్స్ నాపై కోప్పడ్డారు.. నాకు శ్రీకాంత్ కు పెద్ద గొడవ జరిగింది.. నటి మాళవిక!

Malavika: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చాలా బాగుంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మాళవిక గురించి అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగులో నటించింది కేవలం ఐదు సినిమాలే అయినా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా తెలుగులో ఐదు సినిమాలకే పరిమితమైన దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Malavika: మా పేరెంట్స్ నాపై కోప్పడ్డారు.. నాకు శ్రీకాంత్ కు పెద్ద గొడవ జరిగింది.. నటి మాళవిక!

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చాలా బాగుంది సినిమా షూటింగ్ సమయంలో తనకు శ్రీకాంత్ కు మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఒక రొమాంటిక్ పాట చిత్రీకరిస్తున్న సమయంలో నేను కంఫర్ట్ గా లేను. అదే విషయాన్ని శ్రీకాంత్ గారితో చెప్పడంతో ఆయన పాట మధ్యలో నుంచే వెళ్లిపోయారని తెలియజేశారు.

Malavika: మా పేరెంట్స్ నాపై కోప్పడ్డారు.. నాకు శ్రీకాంత్ కు పెద్ద గొడవ జరిగింది.. నటి మాళవిక!

ఇక తాజాగా తాను పుష్ప సినిమా చూశానని అందులో సమంత నటించిన ఐటమ్ సాంగ్ చాలా బాగుందని తనకు అలాంటి అవకాశం వస్తే నటిస్తానని తెలిపారు. ఇకపోతే చాలా బాగుంది సినిమాలో తనకు రేప్ సీన్ నచ్చలేదని ఈ కార్యక్రమం ద్వారా మాళవిక బయటపెట్టారు.

ఎక్స్పోజింగ్ ఎక్కువ అని తింటారు…

ఇక తాను తమిళంలో 35 సినిమాలు చేశానని అయితే తన జీవితంలో ఈ సినిమాలో ఎందుకు చేశానా అని బాధపడిన సినిమా ఒకటి ఉందని. అది హిందీ చిత్రం
సీయూ ఎట్‌ నైట్ అనే చిత్రంలో ఎందుకు నటించానని బాధ పడతానని ఈమె తెలిపారు.ఈ సినిమాలో ఎక్కువ ఎక్స్పోజింగ్ ఉండటం వల్ల పేరెంట్స్ కూడా తనను తిట్టారని ఈ కార్యక్రమం ద్వారా ఈమె తెలియజేశారు.

Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!

Roshan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం సర్వసాధారణం. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే శ్రీకాంత్ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు రోషన్ టీనేజ్ లోనే నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా వెండితెర అరంగ్రేటం చేశారు.

Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!

ఈ సినిమా తర్వాత రోనంకి దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లిసందడి సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన పెళ్లిసందD సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేలేకపోయినప్పటికీ హీరోగా ముందు ముందు మంచి అవకాశాలను అందుకుంటాడు అనే పేరు సంపాదించుకున్నారు.

Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!

ఆ రెండు బ్యానర్లలో అవకాశం దక్కించుకున్న రోషన్..

ఇలా పెళ్లి సందD సినిమా తర్వాత రోషన్ తన తదుపరి చిత్రాలను చేయడం కోసం రెండు బడా బ్యానర్లను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ వారి బ్యానర్లో ఒక సినిమా చేయడానికి రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా సితార బ్యానర్ లో మరో సినిమా చేయడానికి రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ బ్యానర్ లో రోషన్ తో సినిమా చేసే దర్శకులు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే ఇలా పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకోవడం చూస్తుంటే రోషన్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చి నటించినట్లు ఉంది.. హీరో శ్రీకాంత్ కామెంట్స్!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ దక్కించుకుంది.ఇక ఈ సినిమా ద్వారా నటుడు శ్రీకాంత్ వరదరాజులు అనే విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుని దూసుకుపోతోంది.

ఈ సినిమా విజయం సాధించడంతో వైజాగ్ లో సినిమా విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో భాగంగా శ్రీకాంత్ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ తో నాకు చాలా అనుబంధం ఉందని నా మొదటి సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభించాము అలాగే అఖండ సినిమా విజయోత్సవ వేడుకను ఇక్కడ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

బోయపాటి దర్శకత్వంలో రెండు సినిమాలు చేశాను బాలయ్యతో కలిసి రెండు సినిమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఆయనతో పని చేస్తున్నంతసేపు మనకు అలుపంటూ ఉండదు బాలకృష్ణ గారు ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా పని చేస్తారని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.

ఇక వరదరాజులు పాత్ర నాకన్నా ఆయనకి ఎక్కువ నమ్మకం ఉందని తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఎన్నోసార్లు తెలిపినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.ఇక ఇందులో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారని సాక్షాత్తు శివుడే బాలకృష్ణ రూపంలో ఈ సినిమాలో నటించారా అనేంతగా బాలకృష్ణ పాత్రలో ఒదిగిపోయారని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అఖండ సినిమాకు ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.

ఊహకు ముందు నేనే ప్రపోజ్ చేశాను.. తనతో నా ప్రయాణం.. : శ్రీకాంత్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ను దక్కించుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకరు. ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో కాకుండా ఎన్నో విలన్ పాత్రలో నటించారు.తన సినీ కెరీర్లో 125 చిత్రాలలో నటించిన శ్రీకాంత్ తాజాగా బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ చిత్రంలో వరదరాజు పాత్రలో నటించి మరోసారి అద్భుతమైన రికార్డును దక్కించుకున్నారు.

ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో శ్రీకాంత్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పదోతరగతి చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఎంతో ఇష్టం ఏర్పడటం వల్ల ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని, ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవటం వల్ల మొదట్లో విలన్ పాత్రలో అవకాశాలు వచ్చినా వాటిని చేశానని ఈ సందర్భంగా తెలిపారు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని నాకు మొదటగా పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమా ద్వార ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ తన భార్య నటి ఊహ గురించి ఎన్నో విషయాలను తెలిపారు. శ్రీకాంత్ ఊహ ఇద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం ఆమె.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత మరో నాలుగు చిత్రాల్లో కలిసి నటించాము. అలా మా ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడి చివరికి పెళ్లి వరకు వెళ్లిందని తెలిపారు.

ఇలా ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత ఊహకు ముందుగానే ప్రపోజ్ చేశానని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు. ఒక గొలుసు కొనుక్కొని ఊహ ఇంటికి వెళ్లి పూజ మందిరంలో ఆ గొలుసు ఉంచి తన తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్లి తనకి నా ప్రేమను వ్యక్తపరిచానని ఈ సందర్భంగా శ్రీకాంత్ ఊహతో తన ప్రయాణం గురించి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ఈయనకు ముగ్గురు పిల్లలు అన్న విషయం మనకు తెలిసిందే ఇందులో పెద్ద అబ్బాయి రోషన్ ఇప్పటికే నిర్మల కాన్వెంట్, పెళ్లి సందD సినిమాలతో వెండితెర అరంగేట్రం చేశారు.

హీరోలకు ఏ మాత్రం తీసిపోని.. విలన్ ల పారితోషికం.. ఆ ప్రతినాయకుల జావితా ఇదే..!

సినిమాలో హీరోలకు ఎంత డిమాండ్ ఉంటుందో.. ప్రతినాయకుడికి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. హీరోకు తగ్గట్లు ప్రతి నాయకుడు లేకపోతే..కథ ఎంత మంచిగ ఉన్నా.. సినిమాను ప్రేక్షకులు ఆదరించలేరు. అందుకే హీరోలకు ఎంత పారితోషికం ఇస్తున్నారో.. ప్రతి నాయకుడికి కూడా అంతే ఇస్తున్నారు. ఇలా తెలుగులో నటిస్తున్న పవర్ ఫుల్ ప్రతినాయకులు ఎవరు..వాళ్లు ఎంతో తీసుకుంటుంన్నారో తెలుసుకుందాం..

అందులో ముఖ్యంగా గుర్తుకు వచ్చే పేరు జగపతిబాబు. అతడు హీరోగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. అంత కంటే ఎక్కువ పేరు విలన్ గా తెచ్చుకుంటున్నాడు. విలన్ గా అతడు ఎంతో బిజీ అయిపోయాడు. అతడు ఒక్కో సినిమాకు రూ. 1 నుంచి రూ. 1.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక తాజాగా అఖండలో ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్ .. అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. విలన్ గా నటించిన శ్రీకాంత్ కు దీనిలో రూ.కోటి ఇచ్చారట.

ఇక విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విషయానికి వస్తే.. అతడు విలన్ గానే కాకుండా ఎన్నో క్యారెక్టర్లను పండిస్తాడు. అందులో ఒదిగా..జీవించేస్తాడు. అతడికి ఒక్క రోజుకు రూ. 10 లక్షలు ఇస్తారు. అతడు కూడా కొన్ని సినిమాలకు రూ.1.5కోట్లు తీసుకున్నాడు. ఇక రియల్ హీరో సోనూసూద్ కు కూడా విలన్ గా మంచి పేరు ఉంది. ఇతడు బాలీవుడ్ లో కూడా నటిస్తాడు కాబట్టి.. ఇతడికి కాస్త డిమాండ్ ఎక్కువనే చెప్పాలి. సోనూసూద్ ఒక్క సినిమాకు రూ. 3 కోట్లు పారితోషికం తీసుకుంటాడు.

ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో విలన్ గా నటించిన సంపత్ రాజ్ కు రూ. 40 లక్షలు.. డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ అయినా.. సపోర్టింగ్ రోల్ అయినా సినిమాకు రూ.50 లక్షలు తీసుకుంటాడు. ఇక కన్నడ సూపర్ స్టార్..ఈగ విలన్ కు కూడా బారీగానే పారితోషికం ఉంది. అతడు ఒక్క సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటాడు. ఆది పినిశెట్టికి రూ. కోటి.. రవికిషన్ కు రూ.40 లక్షలు.. ఈ తమిళ విలన్ హరీష్ ఉత్తమన్ కు రూ. 30 లక్షలు, వివేక్ ఒబేరాయ్ రూ. 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆ విషయం గురించి బాలకృష్ణ ముందుగా వార్నింగ్ ఇచ్చారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీకాంత్!

నందమూరి నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాల గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. నా కెరియర్ ప్రారంభంలోనే మొదటగా విలన్ పాత్రలు చేశాను ఆ తర్వాత హీరోగా చేశాను అయితే మరోసారి యుద్ధం శరణం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఈ సినిమా చేసే ముందు దర్శకుడు బోయపాటి మీరు కంగారుపడి విలన్ పాత్రలకు ఒప్పుకోకండి.మీ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశానని సరైనోడు సినిమా సమయంలో బోయపాటి తనకు చెప్పినట్లు వివరించారు. ఇక బాలకృష్ణ తనకు ఇది రెండవ సినిమా అని శ్రీకాంత్ తెలియజేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా తర్వాత నీకు మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చాయి కదా అని ఏది పడితే అది ఒప్పుకోకు ఏ సబ్జెక్ట్ ఉన్న సినిమాలను చేయాలో నీకు చెబుతాను అలాగే హీరోగా అవకాశాలు వస్తే అవి కూడా చెయ్యి అంటూ బాలయ్య తనకు ముందుగానే వార్నింగ్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.

కారు కొంటా సార్ అని శ్రీకాంత్ తో అంటే.. ముందు ఆ పని చూడు అన్నాడు?

తెలుగు ఇండస్ట్రీలో తన బాధను గానీ, ఇంకెలాంటి ఫీలింగ్‌నైనా పంచుకోవడానికి కొంత మంది తనకు అత్యంత సన్నిహితులున్నారని నటుడు అనంత ప్రభు తెలిపారు. అందులో ముఖ్యంగా శ్రీకాంత్, తరుణ్‌లాంటి వారున్నారని ఆయన అన్నారు. తామంతా క్రికెట్‌ ఆడుతూ ఆడుతూ అలా క్లోజ్ అయ్యామని ప్రభు చెప్పారు.

చిత్ర పరిశ్రమలో అందరితోనూ ఒకలా ఉండలేమని ప్రభు అన్నారు. అలాగే అందరితోనూ అన్ని విషయాలూ షేర్ చేసుకోలేమని, అలా అనిపించేది మాత్రం ఒక్క శ్రీకాంత్‌ గారితోనే అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకి కూడా తాను నచ్చడం నిజంగా తన అదృష్టమని ఆయన చెప్పారు. అలాగే తరుణ్‌, అల్లరి నరేష్ కూడా తనతో చాలా సాన్నిహిత్యంగా ఉంటారని ఆయన అన్నారు.

కానీ ఎవరితో ఎంత క్లోజ్‌గా ఉన్నా కూడా ఒక లైన్‌ అనేది మెయింటైన్ చేస్తానని ప్రభు చెప్పారు. లేదంటే మొత్త అడ్వాంటేజ్ తీసుకుంటానేమో తానే అని ఆయన తెలిపారు. అయితే ఒకసారి తన వద్దనున్న కారు తీసేసి కొంచెం పెద్ద కారు తీసుకుంటా అన్నపుడు, శ్రీకాంత్ అన్ని వివరాలు అడిగి, చివరికి కొత్త కారు ఎందుకు మళ్లీ ? డబ్బులు ఎందుకు వృథా చేయడం ? వచ్చి ముందు పని చెయ్యి. నువ్వు ఏ కారులో వచ్చావు అనేది ఎవరూ చూడరు. పని చేశావా లేదా అనేది మాత్రమే చూస్తారని ఆయన అన్నట్టు ప్రభు వివరించారు.

హీరోయిన్ ఊహ అంటే చాలా ఇష్టం: నటుడు ఆనంద్ భారతీ

తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లోనే కాక కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించిన గొప్ప ఆర్టిస్ట్ నటుడు ఆనంద్ భారతి. ఆయన అనేక మలయాళ టెలివిజన్ సీరియళ్లలోనూ నటించి బుల్లితెర అభిమానులకు కూడా చేరువయ్యారు. హీరోయిన్ ఊహను సపోర్టింగ్ రోల్స్‌లో ప్రముఖ నటుడు ఆనంద్ భారతి ఎక్కువగా తననే రికమెండ్‌ చేయడానికి పర్టిక్యులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని ఆయన్ని అడిగినపుడు ఈ విధంగా సమాధానమిచ్చారు .

సినిమాలతో బిజీగా గడుపుతున్న రోజుల్లో ఊహ అంటే చాలా ఇష్టమని ఆనంద్ భారతి చెప్పుకొచ్చారు. అది ఏ రకమైంది అంటే తనను ఒక సోదరి అన్న ఫీలింగ్ ఉండేదని ఆయన అన్నారు. ఆ అమ్మాయి 13 ఇయర్స్ ఉన్నపుడు తాను చూశానన్న ఆయన, మొదటిసారి బ్రౌన్ కలర్ కళ్లతో ఉన్న తనను చూశానని, వాళ్ల నాన్న తనకు బాగా సన్నిహితుడయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ఆమెతో కలిసి దాదాపు 5, 6 సినిమాలు తీశానని ఆయన తెలిపారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆమెతో కలిసి నటించానని ఆయన అన్నారు.

ఇక రికమెండ్ చేశారు అన్న వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకిస్తూ, రికమెండ్ చేయలేదు. కానీ ఆ అమ్మాయి అంటే తనకిష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇక శ్రీకాంత్ విషయానికొస్తే ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి మంచి స్నేహితుడని, ఇప్పటికీ కూడా వాళ్లు టచ్‌లోనే ఉన్నారని ఆనంద్ భారతి తెలిపారు. ఎప్పుడో ఒకసారి మాత్రం కలుస్తూ ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

శ్రీకాంత్ తనయుడు రోషన్ కు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. ఎందుకంటే..?

అటు మా ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ అక్కడికి వెళ్లి ఓటు హక్కును నియోగించుకుంటున్నారు. తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నం అయ్యారు. ఇటు వైపు హీరో శ్రీకాంత్ తనయుడు నటించిన పెళ్లిసందD సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.

అందులోనే శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమా పెళ్లి సందడి విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందులోనే ఆ సిల్వర్ జూబ్లి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అంతక ముందే ఈ ఫంక్షన్ కు హీరో వెంకటేష్ వచ్చి కూర్చొని ఈవెంట్ ను వీక్షిస్తున్నాడు. తర్వాత కొంత సమయానికి చిరంజీవీ హాజరయ్యారు. అందరు పెళ్లిసందD సినిమా గురించి మాట్లాడారు.

అందులో రోషన్ కూడా మాట్లాడారు. అతడు చిరంజీవిని పెద్ద నాన్న అని పిలిచేవారు. కానీ ఆ ఈవెంట్లో చిరంజీవి గారు అని అసంబోధించి మాట్లాడారు. తర్వాత చిరంజీవి స్టేజిపైకి ఎక్కి తన అభి ప్రాయాలను పంచుకున్నారు. అయితే వెళ్లగానే ‘రోషన్ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను చిరంజీవి అంటూ పేరు పెట్టి పిలుస్తావు..’’అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు.

అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత ముఖంలో చిరునవ్వు చిందిస్తూ.. తనను పెద్ద నాన్న అని పిలిస్తే తప్పేంటిరా అంటూ రోషన్ కు చెప్పాడు చిరంజీవి. ఎంతమందిలో ఉన్నా మీ నాన్నకు నేను అన్నను, నీకు పెద్దనాన్నను రా రోషన్‌ అంటూ రోషన్‌ను దగ్గరికి తీసుకున్నారు. దీంతో రోషన్‌ ఫేస్‌ కళకళలాడిపోయింది. అలా వారి సినీ బంధాన్ని.. అతడికి వాళ్ల నాన్నకు ఉన్న రిలేషన్ ను చిరంజీవి గుర్తు చేశాడు.

నేను గెలవడం కన్నా.. అతను ఓడిపోయినందుకు బాధగా ఉంది: శ్రీకాంత్

గత నెలరోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇండస్ట్రీలో తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది పరస్పరం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. అసలు మా ఎన్నికలను చూస్తుంటే సాధారణ ఎన్నికలను తలపించాయని చెప్పవచ్చు.

ఇక ఎలక్షన్స్ రోజు వరకు రెండు ప్యానెల్ సభ్యుల మధ్య తారాస్థాయిలో గొడవలు చోటు చేసుకున్నప్పటికీ అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు ముగిసి మంచు విష్ణు మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల ఫలితాలపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడు, హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు.

ఈ క్రమంలోనే శ్రీకాంత్ మాట్లాడుతూ ముందుగా మంచు విష్ణుకు అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందారు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలుపొందగా మంచు ప్యానల్ నుంచి ఏడుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా విజయం సాధించారు.

కేవలం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ఒక్కడే గెలుపొందడం విశేషం. శ్రీకాంత్ తన విజయం గురించి మాట్లాడుతూ తాను గెలిచిన దాని కన్నా ప్రకాష్ రాజ్ ఓడిపోయినందుకు ఎంతో బాధగా ఉందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు.ఎన్నికల కౌంటింగ్ అనంతరం మంచు విష్ణు అధ్యక్ష పీఠం దక్కించుకోవడంతో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.