Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!
Roshan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం సర్వసాధారణం. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే శ్రీకాంత్ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు రోషన్ టీనేజ్ లోనే నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా వెండితెర అరంగ్రేటం చేశారు.
ఈ సినిమా తర్వాత రోనంకి దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లిసందడి సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన పెళ్లిసందD సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేలేకపోయినప్పటికీ హీరోగా ముందు ముందు మంచి అవకాశాలను అందుకుంటాడు అనే పేరు సంపాదించుకున్నారు.
ఇలా పెళ్లి సందD సినిమా తర్వాత రోషన్ తన తదుపరి చిత్రాలను చేయడం కోసం రెండు బడా బ్యానర్లను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ వారి బ్యానర్లో ఒక సినిమా చేయడానికి రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా సితార బ్యానర్ లో మరో సినిమా చేయడానికి రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ బ్యానర్ లో రోషన్ తో సినిమా చేసే దర్శకులు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే ఇలా పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకోవడం చూస్తుంటే రోషన్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…