Ram Charan: వామ్మో .. రామ్ చరణ్ ఒక్క పాట కోసం 23 కోట్లు ఖర్చు చేస్తున్న డైరెక్టర్ శంకర్!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన RRR సినిమా విడుదల వాయిదా పడటంతో చరణ్ తన దృష్టిని మొత్తం శంకర్ సినిమా పై పెట్టారు. ఇప్పటికే దాదాపు కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఇదిలా ఉండగా తాజాగా మరొక షెడ్యూల్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా శంకర్ సినిమాలు అంటే ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈయన సినిమాలో పాటలకు కూడా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారని విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే శంకర్ రామ్ చరణ్ సినిమాలో తర్వాత షెడ్యూల్ కోసం భారీగా ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో భాగంగా హీరో హీరోయిన్ పై ఒక పాట చిత్రీకరణ జరపనున్నారు. ఈ పాట కోసం శంకర్ ఏకంగా ఇరవై మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ టాక్.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించే ఈ పాట కోసం భారీ మొత్తంలో సెట్ ఏర్పాటు చేసి అందులోనే ఈ పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం.కేవలం ఒక పాట కోసం 23 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు.ఇక ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ జీ స్టూడియోస్ ఏకంగా 200 కోట్లకు దక్కించుకున్నట్లు పెద్దఎత్తున సమాచారం వినబడుతుంది. ఇదే కనుక నిజమైతే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విజయాన్ని అందుకున్నట్లేనని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…