Jayasuda: చిరంజీవి ఆ సలహా వల్లే తీవ్రంగా నష్ట పోయాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన జయసుధ!
Jayasuda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి గా,సహజనటిగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు.
నిర్మాతగా మారిన జయసుధ ఆశించినంత ఫలితాలను అందుకోలేదని చెప్పాలి. అయితే ఆమె నిర్మాతగా ఎందుకు విజయం సాధించలేకపోయిందనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన హ్యాండ్సప్ సినిమా గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
జయసుధ నిర్మాతగా మారిన తర్వాత ఆత్మబంధువులు, ‘కాంచన సీత’ సినిమాలు సక్సెస్ కావడంతో ఆమెకి మంచి లాభాలు వచ్చాయి ఈ సినిమా తరువాత ఏకంగా బాలీవుడ్ చిత్రం ‘మేరా పతి సిర్ఫ్ మేరా హై’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కొంత మేర నష్టాలను తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే జయసుధ హ్యాండ్సప్ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ సినిమా పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసిందని జయసుధ తెలిపారు.
ఈ సినిమా గురించి జయసుధ మాట్లాడుతూ ఈ సినిమా విడుదల అయి ఫస్ట్ షో చూసే వరకు ఎవరికీ కూడా ఈ సినిమాలో చిరంజీవి ఉన్నారనే విషయం తెలియదు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పోస్టర్లలో చిరంజీవి పేరు వేసినా మంచి ఓపెనింగ్స్ వచ్చేవని, పోస్టర్ వేద్దామంటే చిరంజీవి గారు వద్దన్నారని..అలా ఆయన సలహా వల్లే ఈ సినిమా నష్టాలలోకి వెళ్లిపోయిందని జయసుధ తెలిపారు. చిరంజీవి అలా చెప్పడానికి గల కారణం అప్పటి వరకు ఒక స్టార్ హీరో ఇలాంటి చిన్న పాత్రలో నటించలేదు. అలా పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేసి తీరా థియేటర్లకు వెళ్లిన తర్వాత మా హీరోకి ఇంత చిన్న పాత్ర ఇవ్వడం ఏంటి అని ఫీల్ అవుతారని అందుకే చిరంజీవి వద్దన్నారని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…