Tag Archives: stomach bloating

Health Tips : పీరియడ్స్ సమయంలో ఎక్కువ కడుపు నొప్పితో బాధపడుతున్నారా… అయితే ఇలా చేయండి !

Health Tips : ప్రతి మహిళ నెలలో మూడు రోజులు నుంచి ఐదు రోజుల పాటు పీరియడ్స్ కారణంగా బాధపడుతూ ఉంటారు. చాలా మంది స్త్రీలు పీరియడ్స్ అంటే ఎంత గానో ఇబ్బందికి గురవుతారు. సరైన ఆహారాన్ని తీసుకోలేరు. కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలానే మూడ్ స్వింగ్స్ లాంటివి కూడా వారిని బాధిస్తూ ఉంటాయి.

health tips for women to reduce bloating problem in periods time

చాలా మంది స్త్రీలు మెనుస్ట్రేషన్ కంటే ముందే బ్లోటింగ్‌తో ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు. ఈ సమస్య కొందరిలో మెనుస్ట్రేషన్ సైకిల్‌కు వారం ముందు గానే ప్రారంభమవుతుంది. కొన్ని సార్లు అసౌకర్యంగా ఉండడం మరియు నొప్పి కూడా ఉంటుంది. చాలా మంది స్త్రీలు మెనుస్ట్రేషన్ సైకిల్ కంటే ముందే బ్లోటింగ్‌తో బాధ పడుతూ ఉంటారు.

health tips for women to reduce bloating problem in periods time

ఈ సమస్యలను మంచి ఆహారం పద్ధతి ద్వారా దూరం చేసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ కొన్ని చిట్కాలను తెలియజేశారు. అవేంటో ప్రత్యేకంగా మీకోసం… వ్యాయామాలు రోజు చేయడం ద్వారా మెన్సెస్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టవచ్చట. అలానే మనం తీసుకునే ఆహారంతో నొప్పులను దూరం చేసుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది, దాంతో బ్లోటింగ్ సమస్య మాయమవుతుంది.

సహజంగా యూరినేషన్ జరగాలంటే ఏం తినాలో తెలుసా !

సహజంగా యూరినేషన్ ప్రక్రియకు ఉపయోగపడే ఆహార పదార్థాలను తీసుకోండి. దాంతో యూరిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇలా చేస్తే వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది. కాబట్టి వాటికి అవసరమయ్యే ఆస్పరాగస్, పైనాపిల్, పీచ్, కీర దోస, అల్లం మరియు వెల్లుల్లి మీ రోజు వారీ ఆహారంలో భాగంగా తీసుకోండి. వాటితో పాటు మంచి నీటిని ఎక్కువగా తాగండి. దాంతో కూడా యూరిన్ ఫ్రీగా అవుతుంది. వీటిని రోజు పాటించడం వలన పిరియడ్స్ సమస్యలు కలిగే నొప్పులను దూరం చేసుకోవచ్చు.

కడుపు ఉబ్బరంగా ఉందా.. ఈ ఆహార పదర్ధాలను తీసుకోండి..!

కొంతమందికి ఏమీ తినకపోయినా.. కొద్దిగా తిన్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. దీనినే బ్లోటింగ్ అని కూడా అంటారు. వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే.. మలబద్దకం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం. చక్కెర, పిండి పదార్ధాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి వంటి వాటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే..కొన్ని ఆహార పదర్థాలు తీసుకోవాలి. అవేంటంటే.. పీచు పదర్థాలను జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే తీసుకోవాలి. బెర్రీలు, పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో ఎక్కువగా పీచు పదర్థాలు ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్‌లు లభిస్తాయి.

డైజెస్టివ్ ఎంజైమ్‌లు అధికంగా ఉండే ఫైనాపిల్ ప్రోటీన్లు, పిండి పదార్ధాలు తేలిగ్గా అరిగేలా చేస్తాయి. కివి, బొప్పాయి కూడా అజీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలో సోడియం ఎక్కువగా ఉన్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. అయితే అరటి పండు తినడం వల్ల శరీరం నుంచి సోడియంను బయటికి పంపించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

యాపిల్ సిడార్ వెనిగర్, పసుపు, అల్లం, నిమ్మ, ప్రోబయోటిక్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తొలగిపోతుంది. వీటిని తీసుకోవడమే కాకుండా తరచూ రోజుకు 4 లీటర్ల నీటిని తాగాలి. ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా ఆహారాన్ని నమిలి తినాలి. దీంతో జీర్ణవ్యవస్థ మంచిగా పని చేస్తుంది.అప్పుడే కడుపు ఉబ్బరం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.