Tag Archives: sv krishna reddy

S.V Krishna Reddy: పదేళ్ల తర్వాత వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి లో ఏ మార్పు లేదుగా… అంత కక్కుర్తి అవసరమా?

S.V Krishna Reddy:ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా స్క్రీన్ ప్లే రైటర్ గా, రచయితగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ విధంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇలా ఈయన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించడంతో అప్పట్లో నిర్మాతలు ఈయనకు ముందుగా అడ్వాన్సులు ఇచ్చే సినిమాలు చేయించుకునేవారు. అప్పట్లో ఈవివి సత్యనారాయణ వంటి డైరెక్టర్ కు పోటీగా కృష్ణారెడ్డి సినిమాలు ఉండేవని చెప్పాలి.అయితే ఇండస్ట్రీలోకి కొత్త డైరెక్టర్లు కొత్త టెక్నాలజీ రావడంతో ఈయన సినిమాలకు కాస్త ఆదరణ తగ్గింది.

ఇలా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించ లేకపోవడంతో ఈయన కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.దూరంగా ఉన్న పలు సినిమాలలో నటుడిగా నటిస్తూ మెప్పించారు. అయితే సుమారు పది సంవత్సరాల తర్వాత తిరిగి ఎస్వి కృష్ణారెడ్డి మెగా ఫోన్ పట్టారు.

ఇలా 10 సంవత్సరాలు తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో కూడా ఈయన తన పాత ధోరణిని ఏమాత్రం మార్చుకోలేదు. ప్రస్తుతం యువత అభి రుచికి అనుగుణంగా కథను సిద్ధం చేసుకుని ఉండాలి. ఇలా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండాలి అంటే కొత్త రచయితలను తీసుకొని తన కథను తీర్చిదిద్దుకోవాలి కానీ ఈయన అదే కక్కుర్తితో కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ కృష్ణారెడ్డే చేసేశారు. 

S.V Krishna Reddy: అదే ధోరణిలో ఉన్న కృష్ణారెడ్డి…

ఇలా అన్నింటికీ తానే వ్యవహరించడంతో ఈయన చేసినటువంటి ఈ సినిమా కూడా మూడు రోజులకే దుకాణం సర్దాల్సి వచ్చింది.ఇలా స్క్రీన్ ప్లే డైలాగ్స్ మ్యూజిక్ అన్నింటిని ఇతరులతో కనుక చేయించి ఉంటే ఈ సినిమా అవుట్ పుట్ మరోలా ఉండేదని కానీ శ్రీకృష్ణారెడ్డి ఇంకా ఆ మూస ధోరణిలోనే ఉన్నారని పలువురు ఈయన వ్యవహార శైలి పై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

SV Krishna Reddy: నాకు ఏ పని రాదంటూ కామెంట్స్ చేశారు… చివరికి స్వీట్ షాపులో పనిచేశా: ఎస్వీ కృష్ణారెడ్డి

SV Krishna Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా సంగీత దర్శకుడిగా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాలన్నీ కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి. మధ్యతరగతి కుటుంబ విలువలను ఎంతో అద్భుతంగా చాటిచెప్పే సినిమాలను ఎస్వీ కృష్ణారెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేవారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే చాలా సంవత్సరాలు తర్వాత ఈయన తిరిగి మెగా ఫోన్ పట్టబోతున్నారు.ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎస్వీ కృష్ణారెడ్డి తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాది ఉన్నతమైన కుటుంబం కానీ సినిమాలు చేసే అంత డబ్బు మా దగ్గర లేదు.పీజీ పూర్తి చేసే హీరో అవుదాం అనుకొని మద్రాసు వెళ్లాను కానీ అది అంత తేలికైన విషయం కాదని తెలుసుకున్నాను.ఇలా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ మొదటిసారి తాను పగడపు పడవలు అనే సినిమాలో సెకండ్ హీరోగా నటించాను. నన్ను చూసిన అచ్చిరెడ్డి నీకు ఇది సరైనది కాదు మనమే ఓ సినిమా చేద్దామని సలహా ఇచ్చారు.

SV Krishna Reddy: ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయలేదు…


ఇలా తన దగ్గర ఏమాత్రం డబ్బు లేకపోయినా సినిమా ఎలా చేయగలమని చెబితే ఆయన తన పేరు మీద ఒక స్వీట్ షాప్ పెట్టారు. నేను అందులో కాజాలు లడ్డులు చేస్తూ పనిచేసాను. ఇలా వచ్చిన డబ్బుతో కొబ్బరి బొండం అనే సినిమా చేసాము.మొదటి సినిమా మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత తాను సినిమాలు చేస్తూ ఉండగా ఇండస్ట్రీలో తనపై చాలామంది విమర్శలు చేశారు. తనకు సినిమా డైరెక్షన్ రాదు మ్యూజిక్ డైరెక్షన్ రాదు. ఘోస్ట్ లనుపెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే అలా విమర్శలు చేయడానికి కారణం లేకపోలేదు. తాను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయకపోవడం వల్ల ఇలాంటి విమర్శలు వచ్చాయని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

SV Krishna Reddy: డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డికి జరిమానా విధించిన పోలీసులు… పోలీసుల పై కామెంట్స్ చేసిన డైరెక్టర్!

SV Krishna Reddy: గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున కార్లను తనిఖీ చేస్తూ కార్లకు బ్లాక్ ఫిలిమ్స్ ఉన్న వాటిని తొలగించి కార్లకు జరిమానా విధిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు దర్శకులకు ఈ విధంగా పోలీసులు జరిమానా విధించిన విషయం మనకు తెలిసిందే.

SV Krishna Reddy: డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డికి జరిమానా విధించిన పోలీసులు… పోలీసుల పై కామెంట్స్ చేసిన డైరెక్టర్!

తాజాగా మరొక డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి కారుకు కూడా పోలీసులు జరిమానా విధించారు. మంగళవారం సుల్తాన్ బజార్ బ్యంక్‌ స్ట్రీట్‌ రోడ్డులో పోలీసులు తనిఖీలలో భాగంగా అటువైపుగా వెళ్తున్నటువంటి ఎస్.వి.కృష్ణారెడ్డి కారును ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన పోలీసులు ఆయన కారును ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉండడంతో కారుకు ఫైన్ వేసారు.

SV Krishna Reddy: డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డికి జరిమానా విధించిన పోలీసులు… పోలీసుల పై కామెంట్స్ చేసిన డైరెక్టర్!

ఇలా పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తూ ఉండగా ఎస్ వి కృష్ణారెడ్డి పోలీసుల పట్ల స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.పోలీసులు నెంబర్ ప్లేట్ తప్పు ఉందని చెప్పడంతో ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తప్పు తనదేనని తప్పకుండా నెంబర్ ప్లేట్ సరి చేసుకుంటానని పోలీసులకు వివరణ ఇచ్చారు.

పోలీసులపై అభినందనలు…

పోలీసులు మండుటెండను కూడా లెక్కచేయకుండా విధిగా తమ విధులను నిర్వర్తిస్తూ ఉండటంతో ఎస్.వి.కృష్ణారెడ్డి పోలీసులపై అభినందనల వర్షం కురిపించారు. ఇలా పోలీసులను డైరెక్టర్ అభినందించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.ఇక పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఎస్.వి.కృష్ణారెడ్డి ప్రస్తుతం బిగ్ బాస్ సోహైల్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.

యమలీలకు ఒక్క నంది అవార్డు రాకపోవడంపై ఇప్ప‌టికీ తీవ్ర అసంతృప్తితో అలీ!

ఎస్. వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘యమలీల’ అనేది అతడి కెరీర్ లోనే మైలురాయని చెప్పుకోవచ్చు. ఇందులో అలీని హీరోగా పరిచయం చేస్తూ పెద్ద ప్రయోగం చేశాడు. కానీ అతడు తీసుకున్న నిర్ణయం సరైందేనని.. సినిమా విడుదల అయిన తర్వాత అందరికీ తెలిసింది. సగటు ప్రేక్షకుడు సైతం.. అతడు చూపించిన సెంటిమెంట్ కు ఫిదా అయిపోయారు.

అందులో సంగీత దర్శకుడిగా ఎస్. వీ కృష్ణారెడ్డి అందించిన బాణీలు సినిమాకు పెద్ద హైలెట్ గా నిలిచాయి. 1994 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఇదంతా ఇలా ఉండగా.. సినిమాకు ఎక్కువగా నంది అవార్డులు రాలేదని అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.

ఆ సంవత్సరంలో ప్రకటించిన అవార్డుల్లో ఈ సినిమాకు కేవలం ఒకే ఒక్క అవార్డు వరించింది. అదే బెస్ట్ సినమాటోగ్రఫి అవార్డు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఇంద్రజ, అలీ మాట్లాడుతూ.. ఆ సినిమాకు బెస్ట్ ఫిలింతో పాటు.. బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్ అవార్డులు రావాల్సింది.. కానీ ఆ అవార్డుల ప్రధానోత్సం తీవ్ర నిరాశను కలిగించిందని అలీ అన్నారు.

దీనిపై ఇంద్రజ స్పందిస్తూ.. అవునా.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అన్నా ఇవ్వాల్సింది.. అందులోని పాటలు అంత మధురంగా ఉంటాయని చెప్పుకొచ్చింది ఇంద్రజ. ఇక అప్పటినుంచే అవార్డులపై ఇంట్రెస్ట్ పోయిందని.. వాటిపై ఎలాంటి ఆసక్తి లేదని.. అలీ అసహనం వ్యక్తం చేశాడు. యముడిగా కైకాల సత్యనారాయణ ఆ సినిమాలో ఎంతో ఒదిగిపోయి నటించారు. ఇలా మొత్తానికి సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.