SV Krishna Reddy: డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డికి జరిమానా విధించిన పోలీసులు… పోలీసుల పై కామెంట్స్ చేసిన డైరెక్టర్!
SV Krishna Reddy: గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున కార్లను తనిఖీ చేస్తూ కార్లకు బ్లాక్ ఫిలిమ్స్ ఉన్న వాటిని తొలగించి కార్లకు జరిమానా విధిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు దర్శకులకు ఈ విధంగా పోలీసులు జరిమానా విధించిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా మరొక డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి కారుకు కూడా పోలీసులు జరిమానా విధించారు. మంగళవారం సుల్తాన్ బజార్ బ్యంక్ స్ట్రీట్ రోడ్డులో పోలీసులు తనిఖీలలో భాగంగా అటువైపుగా వెళ్తున్నటువంటి ఎస్.వి.కృష్ణారెడ్డి కారును ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన పోలీసులు ఆయన కారును ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉండడంతో కారుకు ఫైన్ వేసారు.
ఇలా పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తూ ఉండగా ఎస్ వి కృష్ణారెడ్డి పోలీసుల పట్ల స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.పోలీసులు నెంబర్ ప్లేట్ తప్పు ఉందని చెప్పడంతో ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తప్పు తనదేనని తప్పకుండా నెంబర్ ప్లేట్ సరి చేసుకుంటానని పోలీసులకు వివరణ ఇచ్చారు.
పోలీసులు మండుటెండను కూడా లెక్కచేయకుండా విధిగా తమ విధులను నిర్వర్తిస్తూ ఉండటంతో ఎస్.వి.కృష్ణారెడ్డి పోలీసులపై అభినందనల వర్షం కురిపించారు. ఇలా పోలీసులను డైరెక్టర్ అభినందించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.ఇక పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఎస్.వి.కృష్ణారెడ్డి ప్రస్తుతం బిగ్ బాస్ సోహైల్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…