Tag Archives: Tarakaratna

Balakrishna: బాలయ్య డేట్స్ అడిగిన నిర్మాతలు… ఓ రేంజ్ లో ఫైర్ అయిన బాలకృష్ణ…. అదే కారణమా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాలో షూటింగ్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారని ఇదివరకే ఎంతోమంది ఆయనతో కలిసి పని చేసిన నటీనటులు దర్శక నిర్మాతలు ఆయన క్రమశిక్షణ గురించి షూటింగ్ పట్ల తనకున్నటువంటి నిబద్ధత గురించి తెలియజేశారు.ఇక బాలయ్య కూడా షూటింగ్ తొందరగా పూర్తి చేసుకుంటే అదే నిర్మాతలకు పెద్ద లాభాలను తెచ్చిపెడుతుందని విశ్వసిస్తారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ తన సినిమా షూటింగ్లో కనుక ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుస షూటింగులలో పాల్గొంటూ త్వరగా ఆ సినిమాను కంప్లీట్ చేస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగు ఇప్పటికే ప్రారంభమై కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం నిర్మాతలు బాలయ్యకు ఫోన్ చేసి డేట్స్ అడిగారట.

ఇలా నిర్మాతలు బాలయ్యకు ఫోన్ చేయడంతో బాలకృష్ణ వారిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని తెలుస్తోంది.షూటింగ్ పట్ల ఎంతో క్రమశిక్షణగా ఉండే బాలయ్య ఇలా నిర్మాతలపై ఫైర్ అవ్వడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం తారకరత్న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో బాలయ్య ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. తారకరత్న కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.

Balakrishna:ఈ పరిస్థితులలో డిస్టర్బ్ చేయొద్దు….

తారకరత్న ఆరోగ్యం బాగుపడాలని ఎంతో తపిస్తునటువంటి బాలకృష్ణకు నిర్మాతలు ఫోన్ చేసి షూటింగ్ కి రావాలని చెప్పడంతో ఒక్కసారిగా ఫైర్ అవుతూ… ఇలాంటి పరిస్థితులలో తనని డిస్టర్బ్ చేయవద్దని నిర్మాతలకు క్లారిటీ ఇచ్చారట. దీంతో బాలయ్య అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడినట్టు అయింది.

Balakrishna: తారకరత్న కోసం మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బాలయ్య!

Balakrishna: నందమూరి తారకరత్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికి తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే తనని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

తారకరత్నకు పల్స్ రేట్ పూర్తిగా పడిపోవడంతో వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి సిపిఆర్ చేసిన అనంతరం పల్స్ రేట్ మొదలైందని అయితే ఆయన ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తుంది.ఇకపోతే ఈయన స్పృహ తప్పి పడిపోయిన సమయంలో ఆయన మెదడుకు ఆక్సిజన్ అందక మెదుడు పనితీరు కూడా పనిచేయలేదని దీంతో ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఈయనకు చికిత్స జరుగుతోందని తెలుస్తోంది.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వార్తలు రావడంతో బాలయ్య బెంగళూరులోనే ఉంటూ తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రాన్ని చదివిన విషయం మనకు తెలిసిందే. ఇలా మృత్యుంజయ మంత్రం చదివిన తర్వాత తారకరత్న శరీరం వైద్యానికి సహకరించిందని తెలిపారు. ఇక ఈయన కోలుకోవాలని చిత్తూరులోని మృత్యుంజయ ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు కూడా చేశారు.

Balakrishna: తారకరత్న కోసం పూజలు నిర్వహిస్తున్న బాలయ్య…

తారకరత్న మెదడుపై పూర్తిగా ప్రభావం చూపిందని తెలియడంతో విదేశీ నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరగనున్న నేపథ్యంలో మరోసారి బాలయ్య తారకరత్న కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా తారకరత్న ఆరోగ్యం కోసం బాలయ్య ఎంతో శ్రమిస్తున్నారని ఆయన క్షేమంగా తిరిగి బయటకు రావాలని అభిమానులు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

Tarakaratna: మూడు వారాలు దాటిన స్పృహలోకి రాని తారకరత్న… తారకరత్న విషయంలో అసలేం జరుగుతుంది?

Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా పాల్గొంటూ నారా లోకేష్ కు మద్దతు తెలిపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికే తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో ఒకసారిగా ఆయనని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలియగానే ప్రత్యేక ఆంబులెన్స్ లో తనని బెంగళూరులోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

ఇలా అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో ఈయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈయన గుండె చికిత్సకు ఏ మాత్రం స్పందించలేదని మొదట్లో వైద్యులు వెల్లడించి తన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే తను ఆరోగ్యంగా కోలుకోవాలని డాక్టర్లు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు గుండెలో దాదాపు 90% బ్లాక్ అయిందని వైద్యులు వెల్లడించారు.

ఇలా తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేకంగా పూజలు చేశారు.ఇక ఆయనకు మెరుగైన వైద్యం అందించడం కోసం డాక్టర్ల సలహాలు సూచనలు మేరకు ఏ క్షణానైనా విదేశాలకు తీసుకువెళ్తారనే వార్తలు కూడా వచ్చాయి.అయితే బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేరి దాదాపు 15 రోజులు పూర్తి అయింది అయినప్పటికీ ఈయన స్పృహలోకి రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Tarakaratna: త్వరలోనే తారకరత్న హెల్త్ అప్డేట్ విడుదల..

ఇలా తారకరత్న 15 రోజులు పూర్తి అయిన ఇంకా స్పృహ లోకి రాకపోవడంతో అసలు ఈయన ఆరోగ్య విషయంలో ఏం జరుగుతుంది? ఈయన తాజా హెల్త్ అప్డేట్ ఏంటి అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయనకు ఇప్పటికే మేజర్ హార్ట్ సర్జరీ జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. అదేవిధంగా ఈయన స్పృహ తప్పి పడిపోయిన సమయంలో తన మెదడుకు ఆక్సిజన్ అందగా చాలా ఇబ్బంది పడ్డారని ఈ క్రమంలోనే ఈయన స్పృహ వచ్చిన ఎప్పటిలాగే యధావిధిగా పని చేసుకునే విధంగా ప్రత్యేక న్యూరాలజిస్ట్ సమక్షంలో ఈయనకు వైద్యం జరుగుతోందని,ఎప్పటికప్పుడు డాక్టర్స్ ఈయన ఆరోగ్య విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజులలో ఈయన తాజా హెల్త్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Tarakaratna: హాస్పిటల్ బెడ్ పై తారకరత్న…. వైరల్ అవుతున్న ఫోటో!

Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంపై ప్రతి ఒక్కరు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలపడం కోసం కుప్పం వచ్చారు. అయితే పాదయాత్రలో భాగంగా తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలియగానే వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు.

ప్రస్తుతం తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు వైద్యులు తారకరత్న ఆరోగ్య విషయం గురించి వెల్లడిస్తున్నారు.ప్రస్తుతం ఈయన వెంటిలేటర్ పైనే ఉన్నారని అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగవుతుందని వైద్యులు ప్రకటించారు.

ఇలా తారకరత్న ఆరోగ్యం కుదుటపడటంతో అభిమానులు సినీ సెలెబ్రిటీలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఇప్పటికే నందమూరి నారా కుటుంబ సభ్యులందరూ కూడా నారాయణ హృదయాలయకు చేరుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు హాస్పిటల్లో తారకరత్న ఉన్నప్పటికీ ఆయనని చూడటం కోసం ఎవరిని అనుమతించలేదని తెలుస్తుంది.

Tarakaratna: కోలుకుంటున్న తారకరత్న


తాజాగా ఆసుపత్రి బెడ్ పై తారకరత్న ఉన్నటువంటి ఫోటో లీక్ అవ్వడంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో తారకరత్నకు ఆక్సిజన్ సహాయంతోనే శ్వాస అందిస్తున్నారని తెలుస్తుంది.అయితే ఇలా మొదటిసారి తారకరత్న ఫోటో వైరల్ కావడంతో అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు కూడా ప్రకటించడంతో మరే ప్రమాదం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక తారకరత్న విషయంలో మెగాస్టార్ స్పందిస్తూ ఆయన కోరుకుంటున్నారనే విషయం తనకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు.

Tarakaratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ…?

Tarakaratna: నందమూరి తారక రామారావు మనవడిగా గుర్తింపు పొందిన నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి తారకరత్న ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా, విలన్ గా నటించాడు. అయితే సినిమా రంగంలో సరైన గుర్తింపు రాకపోవటంతో ఇండస్ట్రీ కి దూరం అయ్యాడు.

ఆ తర్వాత వ్యాపార రంగంలో రాణిస్తున్న తారక్ ఇటీవల రాజకీయల్లో ఎంటర్ అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రారంభించిన మొదటి రోజే తారకరత్న గుండెపోటుతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రతిమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో బాలకృష్ణ వెంటనే బెంగుళూరుకు చేరుకొని డాక్టర్లతో సంప్రదింపులు జరిపి తారకరత్న వైద్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. అప్పటి నుండి బాలకృష్ణ బెంగళూరులోనే ఉంటున్నాడు.

Tarakaratna: అదొక మెరాకిల్…

ఇక తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి బాలకృష్ణ స్పందిస్తూ… ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 45 నిమిషాల పాటు ఆగిపోయిన తారకరత్న గుండె మళ్ళీ కొట్టుకోవడం ఒక మెరాకిల్ అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం స్టంట్ వేయడానకీ డాక్టర్లు కొన్ని మందులు వేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్ అయ్యాక స్టంట్ వేయనున్నట్టు చెప్పారు. తారకరత్న హెల్త్ విషయమై వైద్యులు అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నారని వెల్లడించాడు.

Taraka Rathna: తారకరత్నకు సోకిన మెలెనా లక్షణాలు.. అది ఎలా వస్తుందో తెలుసా?

Taraka Rathna: తారకరత్న.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.. అయితే తారకరత్న త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు అలాగే నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే దేవుళ్లకు పెద్ద ఎత్తున పూజలు కూడా చేస్తున్నారు.

బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రి వైద్యులు తారకరత్న మెలెనా అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా అని పిలుస్తారు. అయితే మామూలుగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటుగా నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం నుంచి రక్తస్రావం అవుతుంది. కొన్ని కొన్నిసార్లు ఎగువ జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చాలామంది అభిమానులు తారకరత్న బాధపడుతున్న మెలెనా వ్యాధి గురించి దాని లక్షణాల గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా కొన్ని రకాల విషయాలు బయటకు వచ్చాయి.. అయితే మెలెనా వ్యాధి రావడానికి కారణాల విషయానికి వస్తే.. ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం, కడుపులో పుండ్లు, కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికంగా ఉండడం లేదా రక్తనాళాల్లో వాపు, రక్తస్రావం అలాగే రక్త సంబంధిత వ్యాధుల వల్ల ఈ మెలెనా వ్యాధి వస్తుంది.

Taraka Rathna:శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది….

ఇక ఈ మెలెనా వ్యాధి లక్షణాల విషయానికొస్తే.. ఈ వ్యాధి సోకిన వారికి మలం నల్లగా, బంక మాదిరి రావడంతో పాటుగా దుర్వాసన విపరీతంగా వస్తుంది. అలలాగే ఈ వ్యాధి వల్ల శరీరంలో రక్త స్థాయి చాలావరకు తగ్గిపోయి రక్తహీనతతో పాటు బలహీనమైపోతారు. కొన్ని కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మెలెనా వ్యాధి సోకిన వారికి శరీరం లేత పసుపు రంగులోకి మారిపోతుంది. అలసట, విపరీతమైన చెమటలు, గందరగోళం అనిపించడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు.

NTR: టీడీపీ ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ తప్పకుండా వస్తారు… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తారకరత్న!

NTR: నందమూరి వారసుడు తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన రాజకీయ ఎంట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలుపర్రలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా నందమూరి తారకరత్న పాల్గొన్నారు.ఈ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ…నందమూరి ఫ్యామిలీ ఏనాడు పదవులను కోరుకోలేదు ప్రజల క్షేమం కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడుని గెలిపిద్దాం తిరిగి ఆంధ్రప్రదేశ్ నీ అభివృద్ధి బాటలో నడిపిద్దామని తెలిపారు.

ఇక వచ్చే ఎన్నికలలో తాను పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికలలో పోటీకి కూడా దిగుతానని తెలిపారు.టైం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా ఎన్టీఆర్ తప్పనిసరిగా పాల్గొంటారని ఈ సందర్భంగా తారకరత్న తెలిపారు.ఇలా ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని తారకరత్న చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTR: టైం వచ్చినప్పుడు తారక్ ప్రచారానికి వస్తారు…

నేటి నుంచి నా ప్రతి అడుగు జనం కోసమే.. నా చూపు ఆంధ్ర అభివృద్ధి వైపే ఉంటుంది. బాలయ్య బాబాయ్ కి అబ్బాయిగా… చంద్రబాబు మామయ్యకు మేనల్లుడిగా.. మీ అందరి బిడ్డగా మీ ఆశీర్వాదాలు శ్రీరామరక్షగా నమ్ముతున్నాను అంటూ ఈ సందర్భంగా తారకరత్న చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇలా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారని తెలియడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి తారక్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.