Balakrishna: నందమూరి తారకరత్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికి తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే తనని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
తారకరత్నకు పల్స్ రేట్ పూర్తిగా పడిపోవడంతో వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి సిపిఆర్ చేసిన అనంతరం పల్స్ రేట్ మొదలైందని అయితే ఆయన ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తుంది.ఇకపోతే ఈయన స్పృహ తప్పి పడిపోయిన సమయంలో ఆయన మెదడుకు ఆక్సిజన్ అందక మెదుడు పనితీరు కూడా పనిచేయలేదని దీంతో ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఈయనకు చికిత్స జరుగుతోందని తెలుస్తోంది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వార్తలు రావడంతో బాలయ్య బెంగళూరులోనే ఉంటూ తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రాన్ని చదివిన విషయం మనకు తెలిసిందే. ఇలా మృత్యుంజయ మంత్రం చదివిన తర్వాత తారకరత్న శరీరం వైద్యానికి సహకరించిందని తెలిపారు. ఇక ఈయన కోలుకోవాలని చిత్తూరులోని మృత్యుంజయ ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు కూడా చేశారు.
తారకరత్న మెదడుపై పూర్తిగా ప్రభావం చూపిందని తెలియడంతో విదేశీ నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరగనున్న నేపథ్యంలో మరోసారి బాలయ్య తారకరత్న కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా తారకరత్న ఆరోగ్యం కోసం బాలయ్య ఎంతో శ్రమిస్తున్నారని ఆయన క్షేమంగా తిరిగి బయటకు రావాలని అభిమానులు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…