Jagapathi Babu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ప్రతి ఒక్కరు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్న సంఘటనలను మనం చూసే ఉంటాం. ఇలా ఎంతోమంది కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి చేదు సంఘటనలను ఏదో ఒక సందర్భంలో బయటపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నటుడు జగపతిబాబు సైతం తాను కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి తెలియజేశారు.
జగపతిబాబు ఎన్నో సినిమాలలో హీరోగా నటించారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతోమంది యంగ్ హీరోలకు ఈయన తండ్రి పాత్రలలో నటిస్తున్న మెప్పించారు.ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి జగపతిబాబు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ సాహసం సినిమా షూటింగ్ సమయంలో తన జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక చేదు సంఘటన జరిగిందని తెలిపారు. ఈ సినిమాలో తాను సెకండ్ హీరోగా చేస్తున్నానని అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వారం రోజులపాటు కనీసం తనకు తిండి పెట్టలేదని తిన్నావా అని అడిగే వారు కూడా లేకుండా పోయారని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధంగా తాను తిండి తిప్పలు లేకుండా ఉండడంతో ఒక లైట్ బాయ్ వచ్చి తన పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని జగపతిబాబు తెలిపారు. అయితే ఆ చేదు సంఘటన నా జీవితానికి ఒక గుణపాఠంగా మారిందని ఈయన తెలిపారు. సాధారణంగా ఇతర భాషల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చే సెలబ్రిటీలకు మంచి గౌరవం ఉంటుందని అదే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి ఏమాత్రం గౌరవం ఉండదంటూ ఈయన అప్పటి విషయాలను గుర్తు చేసుకొని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…