Movie News

Tarakaratna: మూడు వారాలు దాటిన స్పృహలోకి రాని తారకరత్న… తారకరత్న విషయంలో అసలేం జరుగుతుంది?

Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా పాల్గొంటూ నారా లోకేష్ కు మద్దతు తెలిపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికే తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో ఒకసారిగా ఆయనని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలియగానే ప్రత్యేక ఆంబులెన్స్ లో తనని బెంగళూరులోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

ఇలా అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో ఈయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈయన గుండె చికిత్సకు ఏ మాత్రం స్పందించలేదని మొదట్లో వైద్యులు వెల్లడించి తన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే తను ఆరోగ్యంగా కోలుకోవాలని డాక్టర్లు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు గుండెలో దాదాపు 90% బ్లాక్ అయిందని వైద్యులు వెల్లడించారు.

ఇలా తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేకంగా పూజలు చేశారు.ఇక ఆయనకు మెరుగైన వైద్యం అందించడం కోసం డాక్టర్ల సలహాలు సూచనలు మేరకు ఏ క్షణానైనా విదేశాలకు తీసుకువెళ్తారనే వార్తలు కూడా వచ్చాయి.అయితే బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేరి దాదాపు 15 రోజులు పూర్తి అయింది అయినప్పటికీ ఈయన స్పృహలోకి రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Tarakaratna: త్వరలోనే తారకరత్న హెల్త్ అప్డేట్ విడుదల..

ఇలా తారకరత్న 15 రోజులు పూర్తి అయిన ఇంకా స్పృహ లోకి రాకపోవడంతో అసలు ఈయన ఆరోగ్య విషయంలో ఏం జరుగుతుంది? ఈయన తాజా హెల్త్ అప్డేట్ ఏంటి అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయనకు ఇప్పటికే మేజర్ హార్ట్ సర్జరీ జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. అదేవిధంగా ఈయన స్పృహ తప్పి పడిపోయిన సమయంలో తన మెదడుకు ఆక్సిజన్ అందగా చాలా ఇబ్బంది పడ్డారని ఈ క్రమంలోనే ఈయన స్పృహ వచ్చిన ఎప్పటిలాగే యధావిధిగా పని చేసుకునే విధంగా ప్రత్యేక న్యూరాలజిస్ట్ సమక్షంలో ఈయనకు వైద్యం జరుగుతోందని,ఎప్పటికప్పుడు డాక్టర్స్ ఈయన ఆరోగ్య విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజులలో ఈయన తాజా హెల్త్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago