Tag Archives: the warrior

weekend Releasing Movies: ఈవారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే?

weekend Releasing Movies: సినిమా ఇండస్ట్రీ తలరాతను హీరో హీరోయిన్ల తలరాతలు ప్రతి శుక్రవారం మారుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి.ఇకపోతే తాజాగా ఆగస్టు మొదటి వారంలో విడుదలైన సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి. ఇకపోతే ఈ నెల రెండవ వారంలో కూడా సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లోనూ అలాగే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం…

థియేటర్లో విడుదలయ్యే సినిమాలు…

*లాల్ సింగ్ చద్దా: అమీర్ ఖాన్ కరీనాకపూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ద్వారా టాలీవుడ్ నాగచైతన్య మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

*మాచర్ల నియోజకవర్గం: ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ కృతి శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు.

*కార్తికేయ 2: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వర జంటగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాని కార్తికేయ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

weekend Releasing Movies: ఓటిటిలో విడుదల కాబోయే సినిమాలు..

*హలో వరల్డ్: జీ 5 తో కలిసి నిహారిక కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 12వ తేదీ జీ 5 లో విడుదల కానుంది.
*రాష్ట్ర కవచ్: హిందీ సినిమా ఆగస్టు 11న జీ5 లో స్ట్రీమింగ్ పవర్.

*హ్యాపీ బర్త్ డే: లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది

*ది వారియర్: లింగస్వామి దర్శకత్వంలో రామ్ కృతి శెట్టి జంటగా నటించిన ది వారియర్ సినిమా ఆగస్టు 11వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

*థాంక్యూ: నాగచైతన్య రాశి కన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది.

*గార్గి: సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12 నుంచి సోనీ లీవ్ లో ప్రసారం కానుంది.

Krithi Shetty: అదే నా బలహీనత.. ఆ హీరోనే నా ఫస్ట్ క్రష్.. కెరియర్ గురించి బేబమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Krithi Shetty: కృతి శెట్టి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమా ద్వారా ఉప్పెనలా ఎగిసిపడుతూ అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కథలు ఎంపిక చేసుకునే విధానం ఎంతగానో నచ్చుతుందని, ప్రతి సినిమాకుఎంతో వేరియేషన్ ఉంటుందని అందుకే తన సెలక్షన్ నచ్చుతుందని కృతి శెట్టి తెలిపారు.

ఇకపోతే తాను రంగస్థలం సినిమా చూసినప్పటి నుంచి రామ్ చరణ్ అభిమాన హీరోగా మారిపోయారని అలాగే ఉప్పెన సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తనకు ఒక లేఖ రాసి పంపించారని ఇప్పటికి ఆలేక తన దగ్గర చాలా భద్రంగా ఉందని ఈమె పేర్కొన్నారు.ఇకపోతే తమిళ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే తనకు శివ కార్తికేయన్ అంటే ఎంతో ఇష్టమైన హీరో అని తెలిపారు. తనే నా ఫస్ట్ క్రష్ అని కృతి శెట్టి తెలిపారు.ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ తాను చూసానని ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు.

ఇకపోతే తనకు చాలా వరకు కోపం రాదని ఒకవేళ కోపం వచ్చిన గదిలోకి వెళ్లి నిద్రపోతానని నిద్రలేచేసరికి తన కోపం పూర్తిగా తగ్గిపోతుందని కృతి శెట్టి తెలిపారు. అదే నా బలం అని అలాగే బలహీనత గురించి కూడా మాట్లాడారు. ఎవరైనా తన ముందు గట్టిగా అరిచిన గొడవపడిన తనకు ఏడుపొస్తుందని అందుకే ఫ్రాంక్ వీడియో సమయంలో ఏడ్చేసానని తెలిపారు.

స్వీట్స్ అంటే భలే ఇష్టం..

ఇక తనకు ఫుడ్ విషయానికి వస్తే స్వీట్స్ ఎక్కువగా తింటానని అయితే హీరోయిన్ అయిన తర్వాత పూర్తిగా స్వీట్స్ పక్కన పెట్టాల్సి వచ్చిందని ఈమె తెలిపారు. అలా రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్వీట్ షాప్స్ కనుక కనపడితే చాలా బాధేస్తుందని, ఇక ఉప్పెన సినిమా సమయంలోనే తాను పెరుగన్నం తినడం నేర్చుకున్నానని ఈ సందర్భంగా కృతి శెట్టి తన ఇష్ట ఇష్టాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Krithi Shetty: ఆ డైరెక్టర్ వల్ల వారం రోజులు ఇబ్బంది పడ్డాను… ఆ సమయంలో అతను అండగా నిలిచారు: కృతి శెట్టి

Krithi Shetty: ప్రతి ఏడాది వెండితెరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు పరిచయమవుతుంటారు. అయితే కొందరు ఒక్క సినిమాకే పరిమితం కాగ మరికొందరు మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఉప్పెనలా తన కెరీర్ లో దూసుకుపోతున్నారు.

కృతి శెట్టి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈమె ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించిన దివారియర్ సినిమా ఈనెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ద్వి భాష చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమాలో కృతి శెట్టి రామ్ సరసన సందడి చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి డైరెక్టర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన మాతృభాష తుళు అయినప్పటికీ తాను తెలుగు ఎంతో చక్కగా మాట్లాడతానని తెలిపారు.

తమిళం తెలియక ఇబ్బంది పడ్డాను…

తను తెలుగు సినిమా డైరెక్టర్లతో పని చేయటం వల్ల తెలుగు చాలా సులభంగా మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. అయితే డైరెక్టర్ లింగుస్వామి తెలుగు తమిళ యాసలో ఉంటుంది. నాకు తమిళం గురించి ఏమాత్రం తెలియదు.ఈ సినిమా షూటింగ్ సమయంలో మొదటి పది రోజులపాటు ఆయన భాష అర్థం కాక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయితే హీరో రామ్ కి తమిళం ఎంతో అద్భుతంగా వచ్చు ఆ సమయంలో డైరెక్టర్ లింగు స్వామి గారు చెప్పే విషయాలన్నింటినీ రామ్ తనకు ఎంతో చక్కగా వివరిస్తూ తనకు చాలా సహాయం చేశారని ఈ సందర్భంగా కృతి శెట్టి డైరెక్టర్ గురించి, హీరో రామ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఈ సినిమాలో కృతి శెట్టి రేడియో జాకీలా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయింది.

Ram The Warrior movie: ‘ది వారియర్’గా వచ్చేస్తున్న రామ్..! పస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

Ram The Warrior movie: యువ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం #RAPO19. దీని టైటిల్ ‘యోధుడు(The Warrior)’. తమిళ చిత్ర నిర్మాత లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Ram The Warrior movie: ‘ది వారియర్’గా వచ్చేస్తున్న రామ్..! పస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌లో.. రామ్ పోతినేని పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు.

Ram The Warrior movie: ‘ది వారియర్’గా వచ్చేస్తున్న రామ్..! పస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

ఎక్కువగా మాస్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫోటోలల్లో రామ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. వీటిని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. దర్శకుడు గతంలో చేసిన రెండు తెలుగు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలో పూర్తిగా విఫలమయ్యాయి.

పందెం కోడి 2 డబ్బింగ్ వెర్షన్ కూడా ప్రజల నుండి పెద్దగా ఆదరణ పొందలేదు. ఇలా లింగుస్వామికి గత కొంతకాలంగా ఎలాంటి హిట్ అందుకోలేదు. దీనితో అయినా ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నాడు.
లింగుస్వామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో సినిమా కావడం, తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

టైటిల్ ను తన సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నా..

ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నాడు. అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్‌ క్యాస్ట్‌ ఉండడం కూడా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైంది.
ఇదిలా ఉండగా.. పోస్టర్ విడుదలన కొద్ది సమయానికే ఆ టైటిల్ పై వివాదాలు నెలకొన్నాయి. తన టైటిల్ ను కాపీ కొట్టారని హవీష్ అనే యంగ్ హీరో ఆరోపిస్తున్నాడు. వారియర్ అనే టైటిల్ ను తన సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు త్వరలోనే సినిమా డీటెయిల్స్ ను కూడా ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. రాపో19 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రారంభించినప్పుడు కథ కాపీ వివాదంలో చిక్కుకుంది. ఇలా వివాదాల నడుమ ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.