Krithi Shetty: ప్రతి ఏడాది వెండితెరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు పరిచయమవుతుంటారు. అయితే కొందరు ఒక్క సినిమాకే పరిమితం కాగ మరికొందరు మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఉప్పెనలా తన కెరీర్ లో దూసుకుపోతున్నారు.
కృతి శెట్టి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈమె ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించిన దివారియర్ సినిమా ఈనెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ద్వి భాష చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమాలో కృతి శెట్టి రామ్ సరసన సందడి చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి డైరెక్టర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన మాతృభాష తుళు అయినప్పటికీ తాను తెలుగు ఎంతో చక్కగా మాట్లాడతానని తెలిపారు.
తను తెలుగు సినిమా డైరెక్టర్లతో పని చేయటం వల్ల తెలుగు చాలా సులభంగా మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. అయితే డైరెక్టర్ లింగుస్వామి తెలుగు తమిళ యాసలో ఉంటుంది. నాకు తమిళం గురించి ఏమాత్రం తెలియదు.ఈ సినిమా షూటింగ్ సమయంలో మొదటి పది రోజులపాటు ఆయన భాష అర్థం కాక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయితే హీరో రామ్ కి తమిళం ఎంతో అద్భుతంగా వచ్చు ఆ సమయంలో డైరెక్టర్ లింగు స్వామి గారు చెప్పే విషయాలన్నింటినీ రామ్ తనకు ఎంతో చక్కగా వివరిస్తూ తనకు చాలా సహాయం చేశారని ఈ సందర్భంగా కృతి శెట్టి డైరెక్టర్ గురించి, హీరో రామ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఈ సినిమాలో కృతి శెట్టి రేడియో జాకీలా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…