Actor Madhavan: తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి గుర్తింపు పొందిన హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో నటించి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇకపోతే మాధవన్ మొదటిసారిగా స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం రాకెట్రీ.ది నంబి ఎఫెక్ట్. ఈ సినిమా భారత ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తిరిగింది.
ఈ సినిమాలో మాధవన్ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమా జులై 1వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు మాధవన్ డైరెక్షన్ అతని నటనపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి ఒక నెటిజన్ స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాకెట్రీ సినిమాలో మాధవన్ నటన ఎంతో అద్భుతం సినిమా చాలా బాగుంది.ఇక మీ డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉందని కామెంట్ చేయడమే కాకుండా క్లైమాక్స్ సన్నివేశం చాలా బాగుందని, తాను ఆ సన్నివేశాన్ని పదేపదే చూశానని చెప్పుకొచ్చారు. ఈ విధంగా నెటిజన్ ట్వీట్ చేస్తూ హీరో మాధవన్ కు ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన హీరో మాధవన్ రిప్లై ఇస్తూ క్లైమాక్స్ సన్నివేశాన్ని పదేపదే ఎలా చూడగలిగావు అంటూ కామెంట్ చేశారు. ఇలా మాధవన్ రిప్లై ఇవ్వడంతో నెటిజన్ దెబ్బకు తను చేసిన ట్వీట్ డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఈ ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా థియేటర్లో విడుదలై కేవలం పది రోజులు అయింది అయితే నేటిజన్ క్లైమాక్స్ సన్నివేశాన్ని పదే పదే చూశారని చెప్పడంతో అతను ఈ సినిమాని పైరసీలో చూశాడని గ్రహించిన మాధవన్ తనదైన శైలిలో కామెంట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…