Tag Archives: theaters

Lasya -Manjunath: అందరూ చూస్తుండగానే థియేటర్లో లాస్యకు ప్రపోజ్ చేసిన మంజునాథ్… వీడియో వైరల్!

Lasya -Manjunath: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాంకర్ లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈమె బుల్లితెరకు కాస్త దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి లాస్య ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. ఇక తన పిల్లల విషయాలను కూడా ఈమె అభిమానులతో పంచుకుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా లాస్య సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా తన భర్త మంజునాథ థియేటర్లో తనకు ప్రపోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది .ఇలా అందరూ సినిమా చూస్తుండగా సినిమాని అనుకరిస్తూ మంజునాథ్ కూడా లాస్యకు ప్రపోజ్ చేయడం గమనార్హం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని లాస్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Lasya -Manjunath: సంతోషం వ్యక్తం చేసిన లాస్య…


ప్రస్తుతం సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా రీ రిలీజ్ కావడంతో ఈ సినిమాని చూడటం కోసం వెళ్ళినటువంటి లాస్య మంజునాథ్ ఇలా థియేటర్లో ప్రపోజ్ చేసుకోవడం చూసినటువంటి ప్రేక్షకులు ఒక్కసారిగా ఈలలు వేస్తూ గోల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Adipurush: ఆది పురుష్ సినిమా చూడాలంటే థియేటర్లకు అలా వెళ్లాల్సిందేనా… వైరల్ అవుతున్న న్యూస్!

Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఆది పురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కాబోతోంది ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాని చూడటానికి థియేటర్ కి వచ్చే వారందరూ కూడా చెప్పులు లేకుండా థియేటర్లోకి వచ్చే సినిమా చూడాలి అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయటే వదిలి వెళ్తాము అలాంటిది రామాయణం తరహాలో రాబోతున్న సినిమాని చూడటానికి కూడా చెప్పులు థియేటర్ బయట వదిలి వెళ్లాలంటూ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు.

Adipurush: చెప్పులు వేసుకుని చిత్ర బృందం…


ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై ప్రభాస్ తో సహా ఇతర చిత్ర బృందం కూడా చెప్పులు లేకుండా తిరగడం మనం చూసాము అందుకే థియేటర్లో ఈ సినిమాని వీక్షించే సమయంలో చెప్పులు కూడా వేసుకోకుండా సినిమాని చూడాలని అందుకే చెప్పులు లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలని ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Allu Arjun: థియేటర్లో టపాసులు పేలుస్తూ రచ్చ చేసిన బన్నీ ఫ్యాన్స్… పోలీసులు రావడంతో ఇలా?

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన సినీ కెరియర్ లో సూపర్ హిట్ చిత్రమైనటువంటి దేశముదురు సినిమాను తిరిగి విడుదల చేశారు. ఈ సినిమా ఏప్రిల్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమాని హైదరాబాద్లోని సంధ్య 70 ఎంఎం థియేటర్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమా చూడటం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏకంగా థియేటర్లోనే టపాసులు పేలుస్తూ రచ్చ చేశారు. ఇలా ఒక్కసారిగా టపాకాయల మోత మోగడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అరుపులతో, కేకలతో గోల చేశారు.

దీంతో అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు థియేటర్ వద్దకు చేరుకొని షో ఆపివేయడమే కాకుండా అందరిని థియేటర్ నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని నిర్మాత శ్రీనివాస్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలియజేయడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.


Allu Arjun: థియేటర్ దేవాలయం లాంటిది….

ఈ విధంగా అభిమానులు హీరోల పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకోవడం తప్పు కాదు కానీ థియేటర్లో ఇలాంటి పనులు చేయడం మంచిది కాదని థియేటర్ తమకు ఒక దేవాలయం లాంటిదని ఈయన తెలియజేశారు. దేవాలయాలను సంరక్షించుకుందాం అంటూ శ్రీనివాస్ కుమార్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.సాధారణంగా ఒక హీరో సినిమా వస్తుంది అంటే థియేటర్ ముందు పండగ వాతావరణం ఉండేది అయితే ఈ మధ్యకాలంలో అభిమానులు అత్యుత్సాహం కారణంగా థియేటర్లోనే టపాసులు పేలుస్తూ ఇతర ప్రేక్షకులకు ఇబ్బందికరంగా మారుతున్నారని చెప్పాలి.

Actor Naresh: సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లు ఖాళీ.. నరేష్ కామెంట్స్ వైరల్!

Actor Naresh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా చాలా నష్టపోయింది. కరోనా కారణంగా సినిమా నిర్మాణ పనులు ఆగిపోయి నటీనటులందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా ప్రేక్షకులు బయటకి వచ్చి థియేటర్లలో సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు.

థియేటర్లు మూతపడటంతో ఓటీటీ లకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటిటిలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి నెలలు గడుస్తున్నా కూడా చాలామంది ప్రేక్షకులు ఓటీటీ లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగటమే. బాగా డబ్బున్న వారికి ఈ టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా చూడాలంటే మినిమం 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు.

ఇటీవల ఈ విషయంపై నటుడు వి కె నరేష్ స్పందించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో ఉన్న రిలేషన్ వల్ల వివాదంలో నిలిచిన నరేష్ చాలాకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. ఇటీవల నరేష్ ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రజలు థియేటర్లలో సినిమా చూడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నరేష్ స్పందిస్తూ…సినిమా కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకి వచ్చి సినిమాలు చూస్తారు. ఇటీవల విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయని వెల్లడించాడు.

Actor Naresh: పాప్ కార్న్ పెప్సీ రేట్లు పెరగడం కూడా..

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడకపోవటానికి టికెట్ రేట్లు పెరగటం ముఖ్య కారణం కావచ్చు .కానీ అదొక్కటే కారణం కాదు. సినిమా టికెట్ రేట్లతో పాటు సినిమా థియేటర్లలో అమ్ముతున్న పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు రూ.20, రూ.30 లకు దొరికే పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధర ఇప్పుడు రూ.200, రూ.300 అయ్యింది. అందువల్ల ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు రావటానికి ఆసక్తి చూపరు. వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారు. అని నరేశ్‌ ట్వీట్‌ చేశాడు.

RRR Movie: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురైన చేదు అనుభవం… ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్లు?

RRR Movie: దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నటువంటి RRR సినిమా ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా హౌస్ఫుల్ బోర్డులు కనబడుతున్నాయి. థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని భారీ ఎత్తున హంగామా చేస్తున్నారు.

RRR Movie: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురైన చేదు అనుభవం… ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్లు?

ఇలా ప్రతి చోటా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి సందడి చేస్తున్న ఈ సినిమాకి కర్ణాటకలో మాత్రం చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. కర్ణాటకలో ఈ సినిమా థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనం ఇవ్వకుండా ఖాళీగా కనిపించడం కాస్త నిరాశకు గురిచేస్తుంది. అయితే అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాని అవాయిడ్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే….

తెలంగాణ కర్ణాటక బోర్డర్ లో ఉన్నటువంటి కొన్ని థియేటర్లలో కూడా ఈ సినిమా విడుదలైంది. అయితే అక్కడ కన్నడ వారి కన్నా తెలుగువారు అధికంగా ఉండటం వల్ల ఈ సినిమాని కన్నడ భాషలో కాకుండా తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఇలా కన్నడ భాషలో ఈ సినిమా ఉన్నప్పటికీ తెలుగులో ప్రసారం చేయటం వల్ల కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

బాయ్ కాట్ చేయాలి….

ఈ క్రమంలోనే ఈ సినిమా చూడటానికి పెద్దగా కన్నడ ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడం వల్ల హౌస్ ఫుల్ బోర్డ్ కనిపించాల్సిన థియేటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇలా కన్నడ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసిన ఈ సినిమా పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ కన్నడ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయం తెలిసి అప్పటికే రంగంలోకి దిగిన మేకర్స్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన కన్నడిగులు మాత్రం ఈ సినిమాను చూడటానికి ఇష్టపడలేదని చెప్పాలి.

Movie Tickets-Prabhas Theater: ఏపీ టికెట్ల లొల్లితో..ప్రభాస్ థియేటర్ క్లోజ్..!ఎక్కడంటే..

Movie Tickets-Prabhas Theater: టికెట్ ధరల విషయంలో టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. పలు మార్లు ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరిపినా.. ఈ అంశం కొలిక్కి రాలేదు. టికెట్ ధరల విషయంలో జగన్ సర్కారు తగ్గదేలేదు అంటోంది. ఇప్పటికే విడుదలైన భారీ సినిమా పుష్పకు ఏపీలో వసూళ్ల దెబ్బ తాకింది.

Movie Tickets-Prabhas Theater: ఏపీ టికెట్ల లొల్లితో..ప్రభాస్ థియేటర్ క్లోజ్..!ఎక్కడంటే..

సంక్రాంతి బరిలో ప్రభాస్ రాధేశ్యామ్, జక్కన్న ట్రిపుర్ ఆర్ బరిలో నిలువనున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ రేట్ల కారణంగా భారీ కలెక్షన్లు సాధ్యం కాదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో పలు సినిమా థియేటర్లు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. కనీస టికెట్ ధర కేవలం రూ. 5 ఉండటంతో చాలా థియేటర్లు మెయింటెనెన్స్ డబ్బులు కూడా రావని అంటున్నారు నిర్వాహకులు.

Movie Tickets-Prabhas Theater: ఏపీ టికెట్ల లొల్లితో..ప్రభాస్ థియేటర్ క్లోజ్..!ఎక్కడంటే..

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం పలు థియేటర్లపై రైడ్స్ చేస్తూ.. నోటీసులు ఇవ్వడం, సీజ్ చేయడం చేస్తున్నారు. దీంతో థియేటర్ నిర్వాహకులు థియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రేట్లను బట్టి చూస్తే కనీసం కరెంట్ బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అతిపెద్ద స్క్రీన్ కలిగిన థియేటర్ కూడా మూతపడింది.


రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభం అయిన థియేటర్ మూసివేత:

రెబల్ స్టార్ ప్రభాస్ పాట్నర్ గా ఉన్న ’వీ ఎపిక్‘ థియేటర్ కూడా మూతపడింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతో థియేటర్ రన్ చేయలేమని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూర్ పేటలోని ఈ థియేటర్ ప్రపంచంలోనే లార్జెస్ట్ స్క్రీన్ థియేటర్ గా పేరుంది. ప్రభాస్ మిత్రులు వంశీక్రిష్ణా రెడ్డి పేరు మీద ఉన్న ఈ థియేటర్ ను 2019లో రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన టికెట్ రేట్ల ప్రకారం అక్కడ గరిష్టంగా టికెట్ ధర రూ. 30 గా ఉంది. దీంతో థియేటర్ నడిపితే నష్టాలే వస్తాయంటున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం ఈ థియేటర్ పై ఆధారపడి 50 కుటుంబాలు జీవిస్తున్నాయి.

ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో మాల్స్, థియేటర్స్ బంద్..!

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్రతీ రోజూ పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని.. మునుపటి వేవ్ కంటే.. ఈ సారి వచ్చే వేవ్ ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించింది.

దీంతో కొన్ని దేశాలు ఇప్పటికే విదేశీ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. ఇక మన భారతదేశలో కూడా కేసులు తగ్గి, సాధారణ జనజీవనం మొదలైన కొద్దినెలల్లోనే ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ రూపంలో కలవరపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి.. అన్నిరంగాలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, వైరస్‌పై భయం తగ్గడంతో జనం మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలను పక్కనపెట్టారు.

అయితే దీనిపై రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ కొత్త వేరియంట్ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఎయిర్ పోర్టు వద్ద విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అవసరమనుకుంటే వారిని క్వారంటైన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త వేరియంట్ మూలంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కేంద్రాలకు నిన్నటి నుంచి పరుగెడుతున్నారు. ప్రజల్లో భయం మళ్లీ మొదలైందనే చెప్పాలి. ఇక మంత్రిమండలి సమావేశం మాల్స్, థియేటర్ల నియంత్రణకు సంబంధించి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు, వైద్యులు సూచించారు.

వాళ్ళు నడపలేక మాకు ఇస్తున్నారు.. ఇది వ్యాపారం.. సర్వీస్ కాదు..!

చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు తాము వ్యతిరేకం కాదని.. అతడు తీసిన సినిమాపై తమకు నమ్మకం ఉంటే.. తాము థియేటరల్లో రిలీజ్ చేస్తామని.. లేదంటే తీసుకోమని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు. ఇటీవల అతడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్న సినిమా నిర్మాతలు మీకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటుంన్నారని విలేకరి ప్రశ్నించగా.. సురేష్ బాబు ఇలా సమాధానం ఇచ్చారు.

వారి యొక్క అసమర్థత వల్లే ఇలా జరుగుతుందని తెలిపాడు. సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనేవి ఉండవు. మంచి సినిమా.. మంచి సినిమా కానివి అనేవి మాత్రమే ఉంటాయన్నారు. ఒకప్పుడు థియోటర్లు అన్నీ ముగ్గురు.. నలుగురు నిర్మాతలో ఆధీనంలోనే ఉన్నాయనేవారు. కానీ అవి తమ కంట్రోల్ లోకి రావడానికి కారణం ఎవరు ఆలోచించరని అన్నారు.

ఒక థియేటర్ యజమాని తన థియేటర్ హక్కులను వదిలిపెట్టి వేరొకరికి ఇవ్వడానికి కారణం అతడు ఆ వ్యాపారం రన్ చేయలేకనే ఇస్తున్నాడని క్లారిటీ ఇచ్చాడు. ఉదాహరణకు నందగోపాల్ యజమాని అయిన దేవీ థియేటర్ ఎవరి చేతిలోకైనా వెళ్లిందా.. లేదు కదా.. అతనికి ఆ థియేటర్ ను ఎలా రన్ చేసుకోవాలో తెలుసు.. గనుక అది అతడి చేతిలోనే ఉందంటూ తెలిపారు. ఇలా తమ వ్యాపారాలను రన్ చేసుకోలేక ఇబ్బంది పడినవారే తమకు బాధ్యతలు అప్పగించారని.. ఇలా ఎక్కువ థియేటర్లు మా వద్ద ఉన్నాయని అన్నారు.

ఒక వారంలో ఒక మంచి సినిమా రిలీజ్ అయిందంటే.. తమకు నమ్మకం ఉంటే తీసుకుంటాం లేదంటే.. లేదు అని అన్నారు. ఎక్కడైనా ఎవరైనా చేసేది బిజినెస్ మాత్రమే అని.. మేము చేసేది కూడా బిజినెస్ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీ పరిస్థితి కూడా అలానే ఉంది. సినిమా ఆడుతుందని నమ్మకం ఉంటేనే తీసుకుంటారు.. కానీ ఉపయోగం లేకుండా తీసుకోని నష్టపోవడానికి ఇష్టపడరు అని అన్నారు. అంతేగానీ తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.