Tag Archives: TPCC

కేసిఆర్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి!

సీఎం కేసిఆర్ కి ప్రశ్నలు సంధించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులకు సీఎం పదవి ఏమైందన్నారు రేవంత్ రెడ్డి. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ కొంగ జపం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.

కాగా హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసిఆర్ దళిత బంధు అంటున్నారని రేవంత్ విమర్శించారు. ఇవాళ జరిగిన సభలో కేసిఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని మండిపడ్డారు. మరియమ్మను పోలీస్ కస్టడీలో చంపేశారని.. దళితులకు కేసిఆర్ క్షమాపణలు చెప్పారని రేవంత్ డిమాండ్ చేశారు.

మైనారిటీ హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుంది_ మధుయాష్కి

హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ మాట్లాడారు.మైనారిటీ హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు మధుయాష్కి. దళిత బంధు పేరుతో పేలాలు వేసి బిర్యాని తింటున్నారని ఆయన విమర్శించారు.. దళితుల ఉద్యోగాల కావాలి ఉపాధి కావాలని మధుయాష్కి డిమాండ్ చేశారు.

కాగా దళిత బందు మైనార్టీలకు ఇవ్వాలన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. దళితుల కంటే ముస్లింలు వెనుకబడ్డారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలను పట్టించుకోవడంలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

టిఆర్ఎస్ నేతలపై మల్లు రవి ఆగ్రహం!

ఇంద్రవెల్లి సభతో టీఆరెఎస్ పార్టీలో కలవరం మొదలైంది అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న భాషను .. ఆ పార్టీ నాయకులు ఒకసారి గమనించాలని సూచించారు.

కాగా టిఆర్ఎస్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును తీసుకొచ్చిందని రవి తెలిపారు. ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరాతో కలుగులో ఉన్న నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపాతో రహస్య ఒప్పందం చేసుకుని టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు