Tag Archives: varudu kavalenu

డైరెక్షన్ చేస్తా అన్నందుకు.. నన్ను బెల్టుతో కొట్టారు.. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య షాకింగ్ కామెంట్స్!

Director Lakshmi Sowjanya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు నందిని రెడ్డి తర్వాత తెలుగులో వరుడు కావలెను చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె చిన్నప్పటినుంచి డైరెక్టర్ కావాలన్న కోరికతో ఈ రంగం వైపు అడుగులు వేస్తూ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత వరుడు కావలెను చిత్రానికి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

ఇలా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీ సౌజన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. లక్ష్మీ సౌజన్య తండ్రి లెక్కల మాస్టర్ కావడంతో తను కూడా అలాగే టీచర్ కావాలన్న ఉద్దేశంతో తన తండ్రి తనని చదివించారని తెలిపారు. చిన్నప్పుడే చాలా ఎత్తుగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు తనని చూసి ఇంకా ఆరవ తరగతెనా అంటూ హేళన చేయడంతో ఏకంగా తన తండ్రి పదవతరగతి పరీక్షలు రాయించారని ఇలా పదకొండు సంవత్సరాలకే పదవ తరగతి పూర్తి చేసినట్లు తెలిపారు.

10 పూర్తికాగానే తనకు MEC తీసుకోవాలనే కోరిక ఉండేదని తన తండ్రి మాత్రం ఎంపీసీ తీసుకోవాలని ఒత్తిడి చేసి.. ఎంపీసీ జాయిన్ చేశారని చెప్పారు.అయితే తనకు లెక్కలు అంటే ఏమాత్రం ఇష్టం లేదని తెలిపిన సౌజన్య ఇంటర్ ఫెయిల్ అయ్యారు.ఇలా ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో నాకు చదువు అంటే ఇష్టం లేదు నేను చదవను సినిమాలకు డైరెక్టర్ అవుతానని చెప్పినట్లు వెల్లడించారు.

నచ్చని పనిని అస్సలు చేయను..

ఇలా తను ఇంటర్ ఫెయిల్ అయ్యి సినిమాలలోకి రావాలని ఉందని చెప్పడంతో తన తండ్రి బెల్ట్ తీసుకొని కొట్టారని ఈ ఇంటర్వ్యూలో లక్ష్మీ సౌజన్య వెల్లడించారు. ఇక తాను ఏ విషయమైనా ఒక్కసారి చెప్పానంటే అది తప్పకుండా తీరాలని, తనకు నచ్చని పనిని అసలు ముట్టుకోని లక్ష్మీ సౌజన్య తెలిపారు.ఇక తన నిర్ణయం చెప్పడంతో తన తండ్రి ముందు చదువుకొమ్మని అప్పటికి కూడా సినిమాలపై ఇంట్రస్ట్ ఉంటే అటువైపే పంపిస్తానని మాట ఇచ్చారని ఆ విధంగానే తాను మాస్టర్ డిగ్రీ వరకు చదువు పూర్తి చేసి అనంతరం ఇండస్ట్రీ వైపు వచ్చానని ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య తెలియజేశారు.

Varudu Kavalenu: ‘వరుడు కావలెను’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే?

Varudu Kavalenu: నాగ శౌర్య , రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా డిసెంబర్ 24 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ అవేవి నిజం కాలేదు.. ప్రస్తుతం లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. రాబోయే ఈ చిత్రం జనవరి 7, 2022న ఓటీటీలో రానుంది.

Varudu Kavalenu: ‘వరుడు కావలెను’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే?

ఈ రొమాంటిక్ మరియు ఫ్యామిలీ డ్రామాకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. కాగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 7వ తేదీ నుంచి జీ5లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ వార్తలను జీ5 అధికారికంగా కూడా వెల్లడించింది.

Varudu Kavalenu: ‘వరుడు కావలెను’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే?

‘వరుడు కావలెను’ చిత్రం అక్టోబర్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఆ సినిమాలో నాగశౌర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ ముఖ్యపాత్రల్లో నటించారు. వరుడు కావలెను చిత్రానికంటే ముందు నాగ శౌర్య నటించిన చిత్రం లక్ష్య.. ఇది స్పోర్ట్ డ్రామాగా తెరెకెక్కింది. కానీ ఆశించినంత హిట్ కాలేకపోయంది.

అనీష్ కృష్ణతో కలిసి నాగశౌర్య..

ఇక నాగశౌర్య తదుపరి చిత్రం అనీష్ కృష్ణతో కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అతను గాయనిగా మారిన నటి షిర్లీ సెటియాతో రొమాన్స్ చేయనున్నాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషాముల్పూరి దీనిని నిర్మించగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నాడు.

వరుడు కావలెను దర్శకురాలు గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా?

నాగ శౌర్య, రీతు వర్మ హీరో హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. ఈ సినిమా రేపు విడుదల సందర్భంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మీడియాతో పలు ఆసక్తికర విషయాల గురించి చర్చించారు లక్ష్మీ సౌజన్య పుట్టిందీ కర్నూలు జిల్లాలో అయితే పెరిగింది మాత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట.

లక్ష్మి వాళ్ళ నాన్న మ్యాథ్స్ లెక్చరర్. ఈమె పదకొండేళ్ళకే పదో తరగతి ఎగ్జామ్ రాసిందట. ఈమెకు చిన్నప్పటినుంచీ నలుగురితో కలిసి ఉండటం, కలిసి తిరగటం లాంటివి ఇష్టమట. అందుకే ఆమెకు సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్ కరెక్ట్ అనిపించిందట. తనకు పద్దెనిమిదేళ్ల వయసులో ఇంట్లో పెళ్లి చేస్తానంటే వారిని ఎదిరించి మరీ హైదరాబాదుకు వచ్చిందట. అలా శేఖర్ కమ్ముల, తేజ, కృష్ణవంశీ, ప్రకాష్ కోవెలమూడి లాంటిమంచి మంచి డైరెక్టర్ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిందట.

ఇలా ఇండస్ట్రీలో పదిహేనేళ్ల జర్నీ తర్వాత ఈమె వరుడు కావలెను సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతోందట. ఇక ఈ కథలో 2017లో చిన్నబాబు కూడా చెప్పగా, స్టోరీ ఐడియా మొదలు అరగంట ఫుల్ ప్రదేశం వరకు అతడికి అంతా నచ్చిందట. అలా ఈ సినిమా కథ మొదలైంది.ప్యాండమిక్ సిచువేషన్ వల్ల రెండేళ్లు ఆలస్యం అయ్యింది. హారిక హాసిని క్రియేషన్స్ ఇలాంటి పెద్ద బ్యానర్ లో నా లాంటి కొత్త డైరెక్టర్ కి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అని తెలిపింది.

ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టుగానే భూమికి ఉన్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అని తెలిసింది. ఇందులో హీరోయిన్ కు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటి వాళ్ళకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో వాళ్ల నుంచి అంతే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడడం, ఒకరిని ఇబ్బంది పెట్టడం లాంటిది చేయదు. అందుకే పర్యావరణానికి ఇబ్బందిలేని ఏకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంది. మరి అలాంటి అమ్మాయిని ప్రేమించాలి అంటే తన కంటే అబ్బాయిల్లో ఎక్కువ కలిసి ఉండాలి. అవన్నీ నాగశౌర్య లో ఉన్నాయి అని తెలిపింది లక్ష్మీ సౌజన్య.

పెళ్లి పై స్పందించిన వరుడు కావలెను హీరోయిన్.. తన పెళ్లి అప్పుడే?

నాగశౌర్య, కలిసి రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల అక్టోబర్ 29న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రీతు వర్మ మొదట పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఇటీవల హీరో నాని నటించిన టక్‌ జగదీష్‌ చిత్రంలో నటించి అలరించింది. ఇందులో ఈమె బలమైన పాత్రలో నటించి మెప్పించింది. నానికి దీటుగా నటించింది. ఇక ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి వరుడు కావలెను చిత్రంతో రాబోతుంది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మ్యారేజ్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. అయితే రీతూ వర్మ తాజా మీడియాతో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో మ్యారేజ్‌ చేసుకోనని తెలిపింది. అంతేకాదు ఎప్పుడు చేసుకోబోయేది తెలిపింది. ఇంకా తన మ్యారేజ్‌ రెండుమూడేళ్లు అవుతుందని తెలిపింది.

అయితే మ్యారేజ్‌ విషయంలో ఇంట్లో నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. పెళ్లిపై తనకు ఫ్రీడమ్‌ ఇచ్చారని, అయితే అప్పుడప్పుడు పెళ్లెప్పుడని సరదాగా ఆటపట్టిస్తుంటారని పేర్కొంది రీతూ వర్మ. మ్యారేజ్‌ చేసుకునేది పూర్తిగా తన ఇష్టమని చెప్పొంది. ప్రస్తుతం తాను సినిమాలపై ఫోకస్‌ పెట్టినట్టు చెప్పింది. అయితే ఏది పడితే అది చేయనని, పాత్రకి ప్రాధాన్యత పాత్రలనే ఎంచుకుని,నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పింది రీతూ వర్మ.

ప్రస్తుతం నటిస్తూ వరుడు కావలెను చిత్రం గురించి చెబుతూ, ఇందులో భూమి పాత్రలో కనిపిస్తానని, పాత్ర సవాల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, అందుకే నో చెప్పకుండా నటించినట్టు చెప్పింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇదని చెప్పింది. ఇది పూర్తిగా లవ్‌ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగుతుందని తెలిపింది. కాకపోతే దర్శకు రాలు లక్ష్మీ సౌజన్య మహిళ కావడంతో, ఆమె పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సాగుతుందని పేర్కొంది.

నన్ను ఇంట్లో మనిషిగా భావించేవారు.. పూజా హెగ్డే!

నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. పి డి వి ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత కార్యక్రమాన్ని ఈ చిత్ర యూనిట్ నిర్వహించింది.

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. హీరోయిన్ ని అతిథిగా పిలవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ క్రెడిట్ అంతా కూడా చిన్న బాబు వంశీ లకు దక్కుతుంది అని తెలిపింది. హారిక అండ్ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్.

చిన్న బాబు గారు నన్ను ఇంట్లో మనుషిలా చూస్తారు అని తెలిపింది. దర్శకురాలు లక్ష్మి గారికి ఈ వరుడు కావలెను సినిమా మంచి సక్సెస్ రావాలి. ఈ వరుడు కావలెను సినిమాలను థియేటర్స్ లో ఫ్యామిలీ తో చూడాలి అనీ పూజా హెగ్డే తెలిపారు. సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ చిత్ర బృందానికి మంచి పేరు లాభాలు రావాలి. ఇదే ఆనందంతో సక్సెస్ పార్టీలో కలుద్దాం అని పూజా హెగ్డే తెలిపింది.

ఈ కార్యక్రమంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ, నాగ శౌర్య, రీతు వర్మ, లక్ష్మీ సౌజన్య, దేవర నాగ వంశీ, విశాల్ చంద్రశేఖర్ దితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా శ్రేయ ఘోషల్ పాటలను ఆలపించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్.. విభిన్నమైన కాన్సెప్ట్ తో అలా!

లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతూ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతోంది.చివరికి ఈ సినిమాను అక్టోబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు ఏర్పాటుచేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. పెళ్లిచూపులు నచ్చవు అనే కాన్సెప్టుతో మొదలయ్యే ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగ శౌర్య, రీతు భూమి, ఆకాష్ పాత్రలలో కనిపించనున్నారు.

భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు అంటూ ఉన్న వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఏ కారణాల చేత వారిద్దరూ విడిపోయారు అనే విషయం ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక ఇందులో వెన్నెలకిషోర్ చెప్పే డైలాగులు హైలెట్ గా నిలిచాయి. పొగరుబోతులకు కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ఆవిడే విన్నర్ అంటూ వెన్నెల కిషోర్ డైలాగులు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఈ ట్రైలర్ లో రీతూవర్మను హైలెట్ చేసి చూపించారు. ఇలా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రెండ్అవుతుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

దసరా కానుకగా వరుడు కావలెను.. అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం..

యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. దసరా రోజు అంటే అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రీతు వర్మ నాని సరసన నటించిన టక్ జగదీశ్ హిట్ టాక్ తెచ్చుకుంది. టక్ జగదీశ్ తర్వాత రీతు వర్మ నటించిన సీనిమా ఇదే. ఇది కూడా దసరా నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ విడుదల చేయగా.. ఓ రేంజిలో వ్యూస్ తెచ్చుకుంటోంది. ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుని సినిమాకు కావాలసిన ప్రమోషన్‌ను రాబట్టింది. దీనికి థమన్ సంగీతం వహించగా.. శేఖర్ మాస్టార్ కోరియోగ్రాఫర్ గా వహించాడు. ఈ పాటకు శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది.