నాగ శౌర్య, రీతు వర్మ హీరో హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. ఈ సినిమా రేపు విడుదల సందర్భంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మీడియాతో పలు ఆసక్తికర విషయాల గురించి చర్చించారు లక్ష్మీ సౌజన్య పుట్టిందీ కర్నూలు జిల్లాలో అయితే పెరిగింది మాత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట.
లక్ష్మి వాళ్ళ నాన్న మ్యాథ్స్ లెక్చరర్. ఈమె పదకొండేళ్ళకే పదో తరగతి ఎగ్జామ్ రాసిందట. ఈమెకు చిన్నప్పటినుంచీ నలుగురితో కలిసి ఉండటం, కలిసి తిరగటం లాంటివి ఇష్టమట. అందుకే ఆమెకు సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్ కరెక్ట్ అనిపించిందట. తనకు పద్దెనిమిదేళ్ల వయసులో ఇంట్లో పెళ్లి చేస్తానంటే వారిని ఎదిరించి మరీ హైదరాబాదుకు వచ్చిందట. అలా శేఖర్ కమ్ముల, తేజ, కృష్ణవంశీ, ప్రకాష్ కోవెలమూడి లాంటిమంచి మంచి డైరెక్టర్ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిందట.
ఇలా ఇండస్ట్రీలో పదిహేనేళ్ల జర్నీ తర్వాత ఈమె వరుడు కావలెను సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతోందట. ఇక ఈ కథలో 2017లో చిన్నబాబు కూడా చెప్పగా, స్టోరీ ఐడియా మొదలు అరగంట ఫుల్ ప్రదేశం వరకు అతడికి అంతా నచ్చిందట. అలా ఈ సినిమా కథ మొదలైంది.ప్యాండమిక్ సిచువేషన్ వల్ల రెండేళ్లు ఆలస్యం అయ్యింది. హారిక హాసిని క్రియేషన్స్ ఇలాంటి పెద్ద బ్యానర్ లో నా లాంటి కొత్త డైరెక్టర్ కి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అని తెలిపింది.
ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టుగానే భూమికి ఉన్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అని తెలిసింది. ఇందులో హీరోయిన్ కు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటి వాళ్ళకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో వాళ్ల నుంచి అంతే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడడం, ఒకరిని ఇబ్బంది పెట్టడం లాంటిది చేయదు. అందుకే పర్యావరణానికి ఇబ్బందిలేని ఏకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంది. మరి అలాంటి అమ్మాయిని ప్రేమించాలి అంటే తన కంటే అబ్బాయిల్లో ఎక్కువ కలిసి ఉండాలి. అవన్నీ నాగశౌర్య లో ఉన్నాయి అని తెలిపింది లక్ష్మీ సౌజన్య.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…