Movie News

పెళ్లి పై స్పందించిన వరుడు కావలెను హీరోయిన్.. తన పెళ్లి అప్పుడే?

నాగశౌర్య, కలిసి రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల అక్టోబర్ 29న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రీతు వర్మ మొదట పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఇటీవల హీరో నాని నటించిన టక్‌ జగదీష్‌ చిత్రంలో నటించి అలరించింది. ఇందులో ఈమె బలమైన పాత్రలో నటించి మెప్పించింది. నానికి దీటుగా నటించింది. ఇక ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి వరుడు కావలెను చిత్రంతో రాబోతుంది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మ్యారేజ్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. అయితే రీతూ వర్మ తాజా మీడియాతో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో మ్యారేజ్‌ చేసుకోనని తెలిపింది. అంతేకాదు ఎప్పుడు చేసుకోబోయేది తెలిపింది. ఇంకా తన మ్యారేజ్‌ రెండుమూడేళ్లు అవుతుందని తెలిపింది.

అయితే మ్యారేజ్‌ విషయంలో ఇంట్లో నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. పెళ్లిపై తనకు ఫ్రీడమ్‌ ఇచ్చారని, అయితే అప్పుడప్పుడు పెళ్లెప్పుడని సరదాగా ఆటపట్టిస్తుంటారని పేర్కొంది రీతూ వర్మ. మ్యారేజ్‌ చేసుకునేది పూర్తిగా తన ఇష్టమని చెప్పొంది. ప్రస్తుతం తాను సినిమాలపై ఫోకస్‌ పెట్టినట్టు చెప్పింది. అయితే ఏది పడితే అది చేయనని, పాత్రకి ప్రాధాన్యత పాత్రలనే ఎంచుకుని,నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పింది రీతూ వర్మ.

ప్రస్తుతం నటిస్తూ వరుడు కావలెను చిత్రం గురించి చెబుతూ, ఇందులో భూమి పాత్రలో కనిపిస్తానని, పాత్ర సవాల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, అందుకే నో చెప్పకుండా నటించినట్టు చెప్పింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇదని చెప్పింది. ఇది పూర్తిగా లవ్‌ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగుతుందని తెలిపింది. కాకపోతే దర్శకు రాలు లక్ష్మీ సౌజన్య మహిళ కావడంతో, ఆమె పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సాగుతుందని పేర్కొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago