దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఒక వైపు కరోనా మరొకవైపు డెంగ్యూ తో ప్రజలు పోరాడుతున్నారు.ఇవి రెండు చాలవన్నట్లు వాతావరణ మార్పులకు అనుగుణంగా వైరల్ జ్వరాలు మొదలయ్యాయి.అయితే ఈ మూడు వ్యాధులకు దాదాపుగా అన్నీ ఒకే లక్షణాలు కనిపిస్తున్నాయి.దీనితో ఈ వ్యాధి వచ్చిందో కనుక్కోవడం కొద్దిగా కష్టంగా మారింది. అయితే ఇప్పుడు ఈ కరోనా,డెంగ్యూ,వైరల్ జ్వరాల మధ్య తేడాలు ఏమిటి? వాటి లక్షణాలు ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం..
కరోనా, డెంగ్యూ వచ్చినప్పుడు వీటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి ముందుగా రెండు పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం.ఎవరైనా సరే జ్వరంతో ఆసుపత్రికి వెళితే కరోనా, డెంగ్యూ పరీక్షలు రెండూ ఉంటాయి. అయితే ఈ జ్వరాలు రాకుండా రక్షణ కూడా అవసరం. మీ ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో నిల్వ నీరు ఉండకూడదు. అలాగే ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనాను నివారించడానికి మాస్క్ ధరించాలి.
తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి.డెంగ్యూ జ్వరం, సాధారణ జ్వరం మధ్య తేడాను గుర్తించడానికి ముఖ్యమైనది జలుబు. డెంగ్యూ కారణంగా జ్వరం వచ్చినప్పుడు జ్వరంతో పాటు శరీరంలో నొప్పులు కూడా ఉంటాయి. అదే సమయంలో సాధారణ వైరల్ జ్వరం వచ్చినప్పుడు జలుబు, మొదలైన వాటితో కూడి ఉంటుంది. ఈ సీజన్‌లో జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు వచ్చి జలుబు లేనట్లయితే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.
డెంగ్యూ దోమలు కుట్టిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ జ్వరంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. రక్తం తగ్గుతుంది. తలతిరగడం వల్ల కొందరికి స్పృహ తప్పుతుంది. వాతావరణం కారణంగా వచ్చే ఈ వైరల్ జ్వరాలకు తగిన సూచనలు పాటించడం వల్ల వాటి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అంతే కాకుండా ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…