నాగశౌర్య, కలిసి రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల అక్టోబర్ 29న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రీతు వర్మ మొదట పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఇటీవల హీరో నాని నటించిన టక్ జగదీష్ చిత్రంలో నటించి అలరించింది. ఇందులో ఈమె బలమైన పాత్రలో నటించి మెప్పించింది. నానికి దీటుగా నటించింది. ఇక ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి వరుడు కావలెను చిత్రంతో రాబోతుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మ్యారేజ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. అయితే రీతూ వర్మ తాజా మీడియాతో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో మ్యారేజ్ చేసుకోనని తెలిపింది. అంతేకాదు ఎప్పుడు చేసుకోబోయేది తెలిపింది. ఇంకా తన మ్యారేజ్ రెండుమూడేళ్లు అవుతుందని తెలిపింది.
అయితే మ్యారేజ్ విషయంలో ఇంట్లో నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. పెళ్లిపై తనకు ఫ్రీడమ్ ఇచ్చారని, అయితే అప్పుడప్పుడు పెళ్లెప్పుడని సరదాగా ఆటపట్టిస్తుంటారని పేర్కొంది రీతూ వర్మ. మ్యారేజ్ చేసుకునేది పూర్తిగా తన ఇష్టమని చెప్పొంది. ప్రస్తుతం తాను సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు చెప్పింది. అయితే ఏది పడితే అది చేయనని, పాత్రకి ప్రాధాన్యత పాత్రలనే ఎంచుకుని,నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పింది రీతూ వర్మ.
ప్రస్తుతం నటిస్తూ వరుడు కావలెను చిత్రం గురించి చెబుతూ, ఇందులో భూమి పాత్రలో కనిపిస్తానని, పాత్ర సవాల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, అందుకే నో చెప్పకుండా నటించినట్టు చెప్పింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇదని చెప్పింది. ఇది పూర్తిగా లవ్ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని తెలిపింది. కాకపోతే దర్శకు రాలు లక్ష్మీ సౌజన్య మహిళ కావడంతో, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని పేర్కొంది.






























