లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతూ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతోంది.చివరికి ఈ సినిమాను అక్టోబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు ఏర్పాటుచేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. పెళ్లిచూపులు నచ్చవు అనే కాన్సెప్టుతో మొదలయ్యే ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగ శౌర్య, రీతు భూమి, ఆకాష్ పాత్రలలో కనిపించనున్నారు.
భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు అంటూ ఉన్న వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఏ కారణాల చేత వారిద్దరూ విడిపోయారు అనే విషయం ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక ఇందులో వెన్నెలకిషోర్ చెప్పే డైలాగులు హైలెట్ గా నిలిచాయి. పొగరుబోతులకు కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ఆవిడే విన్నర్ అంటూ వెన్నెల కిషోర్ డైలాగులు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
ఈ ట్రైలర్ లో రీతూవర్మను హైలెట్ చేసి చూపించారు. ఇలా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రెండ్అవుతుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…