Movie News

బాలకృష్ణ సినిమా చూసి కుర్చీలను విరగ్గొట్టిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా తారక్ ఈ కార్యక్రమానికి వచ్చే కంటెస్టెంట్ లతో తన వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటిస్తూ ఉంటారు. ఈ సమయంలోనే తాజా ఓ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కంటెస్టెంట్ కి ఒక వీడియో క్లిప్ చూయించి అది ఏ సినిమాలోది అనే ప్రశ్న వేశారు.

అందుకు అతను వెంటనే బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రంలోనిది అని కరెక్ట్ సమాధానం చెప్పారు.ఇలా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రం అనగానే తనకు గతంలో జరిగిన ఓ సన్నివేశం గుర్తుకు వచ్చి ఈ సందర్భంగా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ కు ఎంతో అభిమానం. బాలకృష్ణ నటించిన ప్రతి ఒక్క సినిమాను ఎన్టీఆర్ చూసేవారు. ఇలా నరసింహనాయుడు సినిమా విడుదలైనప్పుడు మొదటిరోజే ఈ సినిమాను చూడటానికి థియేటర్ కి వెళ్లానని చెప్పారు.

ఈ సినిమా చూసేటప్పుడు వచ్చిన ఎమోషన్ తట్టుకోలేక ముందున్న కుర్చీని ఒక్క తన్ను తంతే ఆ కుర్చీ విరిగిపోయిందని, అందులో కూర్చున్న వ్యక్తి కింద పడ్డారని ఈ సందర్భంగా తారక్ గతంలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago