సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోలు,హీరోయిన్స్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూ, మరొకవైపు కొన్ని యాడ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ రెజీనా కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది.
ఇక ఇదే విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఇక ఈ విషయం పై నెటిజన్లు ఆమెపై పెద్దఎత్తున ఫైర్ అవుతున్నారు. తనకు తొమ్మిదేళ్ళ వయసు ఉన్నప్పుడు యాంకరింగ్ ప్రారంభించాలని, అయితే ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తారని ఈ సంతోషాన్ని సిగ్నేచర్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది.
అలా ఈమె సిగ్నేచర్ బ్రాండ్ ఆల్కహాల్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది. దీంతో ఈమె పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి హానికరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే తన పద్ధతి బాగాలేదని డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇండస్ట్రీలో పలువురి హీరోహీరోయిన్లు ఒక వెలుగు వెలిగి ఆ తరువాత నిదానంగా కనుమరుగై పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటివారిలో హీరోయిన్ రెజీనా కూడా ఒకరు. మొదట రొటీన్ లవ్ స్టోరీ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాలో నటించి సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే త్వరలో ఈ బ్యూటీ నేనేనా అనే హారర్ సినిమాలో నటిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…