సోషల్ మీడియా ను బాగా ఫాలో అవుతున్న వారికి వైవా హర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వైవా సిరీస్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకొని, అనంతరం నటుడిగా, ఆ తరువాత యాంకర్ గా ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు వైవా హర్ష. అంతేకాకుండా ఈయన యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అందులో తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
కేవలం యూట్యూబ్ వీడియోలు ద్వారా సెలబ్రిటీస్ రేంజ్ లో క్రేజ్ కొట్టేసిన హర్ష.. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా సాధించాడు. ఇటీవలే రిలీజ్ అయినా కలర్ ఫోటో సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో తన నటనతో అందరి మనసులలో స్థానం సంపాదించుకున్నాడు.ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.
తాజాగా వైవా హర్ష పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. నగరంలోని ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్ లో అక్షర అనే అమ్మాయి తో వివాహం ఘనంగా జరిగింది. ఏడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో వధూవరులు కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు.
ఈ పెళ్లి వేడుకకు దర్శకుడు మారుతి, నటుడు ప్రవీణ్, స్వాతి రెడ్డి, మహాతల్లి ఫేమ్ జాహ్నవి పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వైవా హర్ష కు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వైవా హర్ష అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వైవా హర్ష పెళ్లి చేసుకున్న అమ్మాయి పూర్తి పేరు అక్షర రీసు. ఎం కామ్ పూర్తి చేసిన ఈ అమ్మాయి హర్ష తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇక చివరికి పెద్దలను ఒప్పించి తాజాగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…